Advertisementt

క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కనబడుటలేదు -వైశాలి రాజ్‌

Tue 17th Aug 2021 06:24 PM
kanapadutaledu,kanapadutaledu movie,crime suspense thriller movie kanapadutaledu  క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కనబడుటలేదు -వైశాలి రాజ్‌
Crime suspense thriller movie Kanapadutaledu క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కనబడుటలేదు -వైశాలి రాజ్‌
Advertisement
Ads by CJ

క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ కనబడుటలేదు త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది: -వైశాలి రాజ్‌

సునీల్, సుక్రాంత్‌ వీరెల్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం క‌న‌బ‌డుట‌లేదు. బాల‌రాజు ఎం ద‌ర్శ‌క‌త్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై సాగ‌ర్ మంచ‌నూరు, స‌తీశ్ రాజు, దిలీప్ కూర‌పాటి, డా.శ్రీనివాస్ కిష‌న్ అన‌పు, దేవీ ప్ర‌సాద్ బ‌లివాడ  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా హీరోయిన్ వైశాలి రాజ్ ఇంట‌ర్వ్యూ విశేషాలు..

- హీరోయిన్‌గా కనబడుటలేదు నా తొలి చిత్రం. నా స్క్రీన్ నేమ్ వైశాలి రాజ్ అయితే నా అసలు పేరు కవిత. మాది వైజాగ్. పుట్టి పెరిగింది, చదువువంతా వైజాగ్‌లోనే సాగింది. రెండేళ్ల ముందు నాన్న చ‌నిపోయారు. నేను జాబ్ చేస్తుండేదాన్ని. నాన్న‌గారు చ‌నిపోయిన త‌ర్వాత జాబ్ మానేశాను. సినిమాల్లోకి రావ‌డానికి మా అమ్మ‌గారి స‌పోర్టే కార‌ణం. అప్పుడ‌ప్పుడు షార్ట్ ఫిలింస్‌లో యాక్ట్ చేసేదాన్ని. రెండేళ్ల ముందు ఓ షార్ట్ ఫిల్మ్‌లో నా ఫొటో చూసిన బాలరాజుగారు హీరోయిన్‌గా అవ‌కాశం ఇచ్చారు.

- నేనెక్క‌డా యాక్టింగ్ నేర్చుకోలేదు. ఐదారు షార్ట్ ఫిలింస్‌లో యాక్ట్ చేశాను. మ‌ధ్య మౌన రాగం అనే సీరియ‌ల్‌లో నెగ‌టివ్ రోల్ చేశాను. హీరోయిన్స్ పాత్ర‌లే కాదు, పెర్ఫామెన్స్‌కు ప్రాధాన్యం ఉండే పాత్ర‌లైనా చేయ‌డానికి నేను సిద్ధం.

- క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల‌ర్ మూవీ. ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్ప‌గ‌ల‌ను. క‌చ్చితంగా ఆడియెన్స్‌కు న‌చ్చుతుంది. సునీల్‌గారు మెయిన్ రోల్ చేశారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం హ్యాపీగా అనిపించింది.

- సునీల్‌గారు ఏమ‌నుకుంటారోన‌ని భ‌య‌ప‌డ్డాను. కానీ ఆయ‌న చాలా ఫ్రెండ్లీగా క‌లిసిపోయారు.

- నా చుట్టూనే ఈ సినిమా ర‌న్ అవుతుంది. ఏడాదిన్న‌ర‌గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను.

- మిడిల్ క్లాస్ ప‌క్కింటి అమ్మాయి పాత్ర‌లో న‌టించాను. పాత్ర‌లో అన్ని ఎమోష‌న్స్ ఉంటాయి.

- షార్ట్ ఫిలింస్‌ను రెండు, మూడు రోజుల్లో చేస్తాం. అలాగే సీరియ‌ల్స్‌లోనూ చాలా ఎపిసోడ్స్‌ను ఒక‌రోజులో చేస్తాం. కానీ సినిమాల్లో ఒక‌ట్రెండు సీన్స్ మాత్ర‌మే చేస్తాం.

- డైరెక్ష‌న్ చేయాల‌నైతే ఉంది. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.

- స్టోరీస్ వింటున్నాను. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత చూడాలి.

- నాకు దీపికా ప‌దుకోన్‌, న‌య‌న‌తార‌, స‌మంత అక్కినేని అంటే చాలా ఇష్టం. వాళ్లు సెల‌క్ట్ చేసుకునే రోల్స్ బాగా న‌చ్చుతాయి.

Crime suspense thriller movie Kanapadutaledu:

Crime suspense thriller movie Kanapadutaledu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ