Advertisementt

సూర్య బర్త్ డే స్పెషల్

Fri 23rd Jul 2021 10:49 AM
kollywood star hero surya,surya birthday special,surya birthday,surya40 first look,etharkkum thunindhavan  సూర్య బర్త్ డే స్పెషల్
Kollywood Star Hero Surya Birthday special సూర్య బర్త్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా స్టార్ హీరోనే. సూర్య నటించిన ప్రతి తమిళ సినిమా తెలుగులోనూ డబ్ అవుతుంది. ఇక్కడా సూర్య సినిమాలు హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గజినీ, సింగం, ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలో తెలుగులో మంచి హిట్స్. తాజాగా సూర్య తెలుగు డైరెక్టర్ బోయపాటి తో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ కూడా ఉంది. 

సూర్య సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయంటే.. తెలుగు హీరోలకుండే క్రేజ్, ప్రేక్షకుల రెస్పాన్స్ సూర్య సినిమాలకు ఉంటుంది. గత ఏడాది ఆకాశం నీ హదురా సినిమాలో హీరోగా నటించి నిర్మించిన సూర్య ఈ ఏడాది ఆ ఆకాశం నీ హద్దురా సినిమాతో బాలీవుడ్ కి వెళ్లబోతున్నాడు. అక్కడ ఓ స్టార్ హీరో తో ఈ సినిమాని రీమేక్ చెయ్యబోతున్నాడు. ఇక ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య 40 లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సూర్య బర్త్ డే సందర్భంగా సూర్య 40 లుక్ రిలీజ్ చేసింది టీం. సూర్య 40 లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది. 

ఇక నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూర్య కి టాలీవుడ్ ప్రముఖుల దగ్గరనుండి.. కోలీవుడ్ ప్రముఖుల వరకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సూర్య కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగాలంటూ.. సూర్య కి సినీజోష్ తరుపునుండి ఏ వెరీ హ్యాపీ బర్త్ డే

Kollywood Star Hero Surya Birthday special :

 Hero Surya Birthday special 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ