Advertisementt

కిరణ్‌ అబ్బవరం బర్త్ డే స్పెషల్ లుక్స్

Thu 15th Jul 2021 04:42 PM
kiran abbavaram,kiran abbavaram birthday special,sr kalyanamandapam movie,sammatame movie,sebastian p.c. 524 movie  కిరణ్‌ అబ్బవరం బర్త్ డే స్పెషల్ లుక్స్
Kiran Abbavaram Birthday Special Look కిరణ్‌ అబ్బవరం బర్త్ డే స్పెషల్ లుక్స్
Advertisement
Ads by CJ

కిరణ్‌ అబ్బవరం హీరోగా సమ్మతమే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు స్పెషల్ గా ఆయన నటిస్తున్న చిత్రాల నుండి స్పషల్ లుక్స్ వదులుతున్నారు ఆయా మూవీ టీం. 

కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ సమ్మతమే. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 80 శాతం పూర్తయింది.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం (జూలై 15) కిరణ్‌ అబ్బవరం బర్త్‌ డే సందర్భంగా సమ్మతమే సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కిరణ్‌ అబ్బవరం, అతన్ని చూస్తూ ఎఫెక్షన్‌ ఫీల్‌ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో సినిమాలో కిరణ్‌ అబ్బవరం కల ఏంటో ఆడియన్స్‌కు అవగాహన కలిగించడంలో డైరెక్టర్‌ పూర్తిగా  సక్సెస్ అయ్యారని తెలుస్తుంది. అలాగే కిరణ్‌ అబ్బవరం పట్ల చాందినీ ప్రేమ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో కనిపిస్తుంది. గడ్డంతో కిరణ్‌ హ్యాండ్‌సమ్‌ కనిపిస్తుంటే, చీరకట్టులో చాందినీ చౌదరి అందంగా కనిపిస్తున్నారు.

 

సెబాస్టియన్‌ పిసి524 బర్త్-డే లుక్ కు అద్భుత స్పందన... త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల

కథానాయకుడిగా పరిచయమైన రాజావారు రాణిగారు సినిమాతో కంటెంట్‌ ఉన్న కుర్రాడని కిరణ్‌ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. అలాగే, కిరణ్‌ అబ్బవరానికి వెల్కమ్ చెప్పింది. రాజావారు రాణిగారు విజయం తర్వాత అతను చేస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత కొంచెం విరామం ఇచ్చి సెబాస్టియన్ పిసి524తో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు కిరణ్ అబ్బవరం రానున్నారు. 

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా సెబాస్టియన్‌ పిసి524. ప్రమోద్, రాజు నిర్మించారు. ఇందులో నమ్రతా దరేకర్‌, కోమలీ ప్రసాద్‌ హీరోయిన్లు. నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలో సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హీరో కిరణ్ అబ్బవరానికి తొలి తమిళ చిత్రమిది. ఈరోజు (జూలై 15) హీరో పుట్టినరోజు సందర్భంగా బర్త్-డే లుక్ విడుదల చేశారు. 

నిర్మాతలు ప్రమోద్, రాజు మాట్లాడుతూ కిరణ్ సబ్బవరం పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బర్త్-డే లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఆల్రెడీ క్రిస్మస్ కి విడుదలైన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఎస్.ఆర్. కళ్యాణమండపం విడుదలైన తర్వాత మా సినిమాను విడుదల చేస్తాం. పక్కా కమర్షియల్ సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో తీశాం అని చెప్పారు.

బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ పోలీస్ సెబా పాత్రలో కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించారు. రేచీకటి కల వ్యక్తిగా నటించడం అంత సులువు కాదు. కిరణ్ చాలా బాగా చేశారు. నటుడిగా గత చిత్రాలతో పోలిస్తే వ్యత్యాసం చూపించాడు. జిబ్రాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. పాటలతో పాటు నేపథ్య సంగీతం అద్భుతంగా చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది అని అన్నారు. 

కిరణ్‌ అబ్బవరం పుట్టినరోజు (జూలై 15) సందర్భంగా ఒక రోజు ముందే, బుధవారం నాడు ఎస్.ఆర్. కళ్యాణమండపంరిలీజ్ టీజర్ విడుదల చేశారు. సెబాస్టియన్ పిసి524 బర్త్-డే లుక్ విడుదల చేశారు. అలాగే, సమ్మతమే ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు విడుదలైంది. కిరణ్ అబ్బవరం హీరోగా దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ సమర్పణలో ఆయన కుమార్తె కోడి దివ్యాదీప్తి నిర్మిస్తున్న సినిమాను ఈరోజు ప్రకటించారు. దీనికి మణిశర్మ సంగీత దర్శకుడు, కార్తీక్ శంకర్ దర్శకుడు. హీరోగా కిరణ్ అబ్బవరం ఐదో చిత్రమిది.

Kiran Abbavaram Birthday Special Look :

Kiran Abbavaram Birthday Special news

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ