ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Exclisive Interview with Gatham Movie Cast

అతను మరో ఆర్జీవీ: ‘గతం’ టీమ్‌తో ఇంటర్వ్యూ

Exclisive Interview with Gatham Movie Cast

సినీజోష్: ప్రేక్షకులు ఈ సినిమా ఎందుకు చూడాలి?

భార్గవ్: ప్రేక్షకులకు ఇదొక రోలర్ కోస్టర్ రైడ్ అండి ఇది. వాళ్ళు ఒక్క పది నిమిషాలు కదలకుండా మా సినిమా చూస్తే.. మిగతా సినిమా అంతా మేము చూపిస్తాం. అది మా బాధ్యత. కథ అంత గ్రిప్పింగ్‌గా, గ్యారంటీగా ఉంటుంది. ఇదొక థ్రిల్లర్. ఎమోషన్స్ అప్ అండ్ డౌన్స్ గ్యారంటీగా క్యారెక్టర్‌తో పాటు ఆడియెన్స్ కూడా ఫీలవుతారు. 

పూజిత: మేమందరం కొత్త ఫేసెస్ కదండి. ఈ కథకి పాత్రలు చాలా కీలకం. ఫస్ట్ 15 మినిట్స్ ఫార్వార్డ్ చేయకుండా చూడండి. సినిమా అంతా చూడండి.. చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది.. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. 

రాకేశ్: మేము ఈ సినిమాతోనే పరిచయం అవుతున్నాం కదండీ. ఈ సినిమాకి కంటెంటే కింగ్. అందుకే అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది. నవంబర్ 6న విడుదలవుతుంది. ప్రేక్షకులకు నేను చెప్పేది ఏమిటంటే.. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఇటువంటి పాత్రలతో తెలుగులో ఇటువంటి ఫిల్మ్‌ని నేనయితే చూడలేదు. భార్గవ్‌గారు, పూజిత చెప్పినట్లు.. 15 నిమిషాలు సినిమా చూస్తే.. ఆ తర్వాత మేమే ఈ సినిమా చూపిస్తాం. 

సినీజోష్: భార్గవ్‌గారూ ఫైనల్‌గా మీకొక ప్రశ్న... మీరు ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్. ఓటీటీలపై మీ అభిప్రాయం ఏమిటి? మీ సినిమా అమెజాన్ ప్రైమ్ వంటి పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుంటే మీకేమనిపిస్తుంది. ముందు ముందు ఓటీటీల ప్రభావం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?

భార్గవ్- నిజంగా చాలా గర్వంగా ఉందండి. మాలాంటి అనామకులు తీసిన ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌లో ఆదరణ దొరకడం అనేది చిన్న విషయం కాదు. ఇలాంటిది ఇదే ఫస్ట్ టైమ్. ఎవరూ ఇవ్వలేదండి ఇప్పటి వరకు అవకాశం. ఇది ట్రెండ్ సెట్టర్ అని నేను భావిస్తున్నాను. కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ బాగుంటే అమెజాన్ ప్రైమ్ వంటి పెద్ద సంస్థలు మీకు అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇదే నిదర్శనం. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. రాబోయే కాలానికి ఓటీటీలే స్ట్రాంగ్‌ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సినిమా తీయడంలో కూడా చాలా మార్పు వచ్చింది. హానెస్ట్‌గా స్టోరీ చెబుతున్నారు. ఇంతకుముందు ఒక ఫ్రేమ్ వర్క్ ఉండేది. ఒక ఫార్ములా ఉండేది.. ఇలా బోలెడన్ని ఉండేవి. ఇట్లాగే తీయాలని రూల్ ఉండేది. ఇప్పుడు దానిని మార్చేసి కథని కథలాగా చెబుతున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. రేపు థియేటర్స్‌లో వచ్చే సినిమాలు కూడా ఇలాగే తీయడం స్టార్ట్ చేస్తారు. ఇది నా నమ్మకం. 

సినీజోష్: థియేటర్స్‌ ఓపెన్ అయి.. అంటే కరోనాకి వ్యాక్సిన్ వచ్చి.. అంతా నార్మల్ అయిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయా?

భార్గవ్- అంటే.. థియేటర్స్ కొన్నే ఉన్నాయండి. క్రియేటివ్ మైండ్స్ చాలా ఉన్నాయ్. ఇప్పుడే జనాల్ని అలవాటు చేస్తున్నాం. మిగతావాళ్లు కూడా సినిమాలు తీస్తారు. వాళ్లు తీసినా మనం సినిమా చూడొచ్చు.. అని అల్రెడీ అలవాటు చేసేశాం. ఈ క్రియేటివ్ మైండ్స్‌కి ఒక దారి దొరికింది. సో.. ఇక ఇది ఆగదు. ఇదొక ప్రవాహం. ఇలా నడుస్తూనే ఉంటది. 

సినీజోష్: ఫైనల్‌గా ఈ సినిమా మంచి విజయం సాధించి.. మీ అందరికీ మంచి పేరు, మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం.. ఆల్ ద బెస్ట్. 

‘గతం’ టీమ్: థ్యాంక్స్ అండి.

Movie Team Talks about Gatham Movie

gatham
gatham movie
kiran director
bhargav
rajesh
poojitha
gamham
harsha associate director
gatham movie cast
gatham telugu movie