Advertisementt

మా 'చుట్టాలబ్బాయి' అంటారు: వీరభద్రమ్‌

Thu 18th Aug 2016 10:55 AM
chuttalabbayi,chuttalabbayi movie interview,chuttalabbayi movie director interview,director veerabhadram about chuttalabbayi  మా 'చుట్టాలబ్బాయి' అంటారు: వీరభద్రమ్‌
మా 'చుట్టాలబ్బాయి' అంటారు: వీరభద్రమ్‌
Advertisement

ఆది కెరీర్‌లో 'చుట్టాలబ్బాయి' ది బెస్ట్‌ ఫిలిం అవుతుంది 

- దర్శకుడు వీరభద్రమ్‌ 

'అహనాపెళ్లంట', 'పూలరంగడు' వంటి హిట్‌ చిత్రాలను అందించి కింగ్‌ నాగార్జునతో 'భాయ్‌'వంటి యాక్షన్‌ చిత్రాన్ని రూపొందించిన వీరభద్రమ్‌ కొంత విరామం తర్వాత 'చుట్టాలబ్బాయి'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా, నమితా ప్రమోద్‌ హీరోయిన్‌గా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై వీరభద్రమ్‌ దర్శకత్వంలో యువ నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 19న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వీరభద్రమ్‌ 'చుట్టాలబ్బాయి' విశేషాలను తెలియచేశారు. 

'చుట్టాలబ్బాయి' చిత్రం ఎలా ఉండబోతుంది? 

- కంప్లీట్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. 'అహనాపెళ్లంట', 'పూలరంగడు' చిత్రాలు ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఎలా అలరించాయో అదే కోవలో 'చుట్టాలబ్బాయి' చిత్రం కూడా అలరిస్తుంది. ప్రస్తుత సమాజంలో సగటు మనిషి తన జీవన గమనంలో ఎంతో స్ట్రెస్‌కి గురవుతున్నాడు. దాని నుండి విముక్తి కోసం మంచి సినిమాకి వెళ్లాలనుకుంటాడు. రెండున్నర గంటలు థియేటర్‌లో కూర్చుని హాయిగా నవ్వుకుని ఎంజాయ్‌ చేయాలనుకుంటాడు. అలా నవ్వుకుని ఎంజాయ్‌ చేసేవిధంగా మా చిత్రం ఉంటుంది. 

ఫస్ట్‌కాపీ చూసి ఎలా ఫీలయ్యారు? 

- చాలా హ్యాపీగా ఉన్నాం. మేం ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా టు హండ్రెడ్‌ పర్సెంట్‌ సినిమా బాగా వచ్చింది. డెఫినెట్‌గా పెద్ద హిట్‌ కొట్టబోతున్నామని మా యూనిట్‌ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. 

ఈ సినిమా పర్సనల్‌గా మీకు ఎలాంటి పేరు తెస్తుందని అనుకుంటున్నారు? 

- అహనాపెళ్లంట, పూలరంగడు నాకు ఎంత పేరు తెచ్చాయో అంతకన్నా ఎక్కువ పేరు 'చుట్టాలబ్బాయి'తో వస్తుందని గర్వంగా ఫీలవుతున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలు వీరభద్రమ్‌ బాగా తీస్తాడని 'చుట్టాలబ్బాయి' చిత్రం మరోసారి ప్రూవ్‌ చేస్తుంది. 

ఆది క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది? 

- రికవరీ బాబ్జీ క్యారెక్టర్‌లో ఆది ఎక్స్‌లెంట్‌గా నటించాడు. ఆది బాడీలాంగ్వేజ్‌, కాస్ట్యూమ్స్‌, లుక్స్‌, హెయిర్‌ స్టైల్‌ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. డైలాగ్‌ డెలివరీ కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. నేను రాసుకున్న కథకి హండ్రెడ్‌ పర్సెంట్‌ ఆది న్యాయం చేశాడు. 

ఆదికి ఈ సినిమా ఎంతవరకు హెల్ప్‌ అవుతుంది? 

- ప్రేమకావాలి, లవ్‌లీ సినిమాలు హిట్‌ అయి ఆదికి ఎంత పేరు తెచ్చాయో అందరికీ తెలుసు. ఆది కెరీర్‌లో హై బడ్జెట్‌ ఫిలిం ఇది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందించిన ఈ చిత్రం ఆది కెరీర్‌లో ది బెస్ట్‌ ఫిలిం అవుతుంది. 

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంతవరకు ఉంటుంది? 

- బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, కృష్ణభగవాన్‌ల కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ముఖ్యంగా పృధ్వీ త్రూ అవుట్‌ సినిమా అంతా నవ్విస్తాడు. అతని క్యారెక్టర్‌ సినిమాలో వన్‌ ఆఫ్‌ ది హైలైట్‌గా నిలుస్తుంది. స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఎంజాయ్‌ చేసేలా ఈ చిత్రం ఉంటుంది. 

యాక్షన్‌ పార్ట్‌ ఎంతవరకు ఉంటుంది? 

- డ్రాగన్‌ ప్రకాష్‌ ఈ చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ని అద్భుతంగా కంపోజ్‌ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో వచ్చే ఫైట్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ స్టైలిష్‌గా, ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. 

ఈ సినిమా ఎందుకు చూడాలి అనేవారికి మీ సమాధానం? 

- పది సంవత్సరాలు ఎంతో కష్టపడి నా గురువుగారు ఇవివి సత్యనారాయణ గారి వద్ద వర్క్‌ నేర్చుకున్నాను. ఆయన బాటలోనే ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేవిధంగా సినిమాలు తీస్తున్నాను. కృష్ణవంశీ, తేజ, ఎంతో మంది దర్శకుల వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసోసియేట్‌గా, కో డైరెక్టర్‌గా వర్క్‌చేశాను. 'అహనాపెళ్లంట'తో అనీల్‌ సుంకరగారు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇచ్చారు. 'పూలరంగడు'తో ఆర్‌ఆర్‌ వెంకట్‌గారు ఎంతో ఎంకరేజ్‌ చేసి ఆ సినిమా నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో నాగార్జునగారు 'భాయ్‌' సినిమాకి ఆఫర్‌ ఇచ్చారు. ఇండస్ట్రీలో హిట్‌, ఫ్లాప్‌లు సహజం. 'భాయ్‌' కొంచెం నిరాశపరిచినా.. ఆ తప్పుని సరిదిద్దుకుని మంచి సినిమా తీయాలన్న కసితో 'చుట్టాలబ్బాయి' కథ రాసుకుని ఈ సినిమా తీశాను. సినిమా చూసే ప్రేక్షకులను ఎవరినీ ఈ సినిమా డిజప్పాయింట్‌ చేయదు. ప్రతి ఒక్కరికీ మా 'చుట్టాలబ్బాయి' నచ్చుతాడు. 

'చుట్టాలబ్బాయి' మెయిన్‌ కథాంశం ఏమిటి? 

- సరదా సరదాగా జాలీగా తిరిగే ఓ కుర్రాడు అనుకోకుండా ఓ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. దాని నుంచి ఆ కుర్రాడు ఎలా బయటపడ్డాడు అనేది ముఖ్య కథాంశం. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ చాలా కొత్తగా, ఫ్రెష్‌గా ఉంటుంది. 

ఈ సినిమాకి బడ్జెట్‌ పెరిగింది అనే టాక్‌ ఉంది? 

- కథ డిమాండ్‌ మేరకు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు మా నిర్మాతలు. బ్యాంకాక్‌, రాజమండ్రి, హైదరాబాద్‌ తదితర లొకేషన్స్‌లో షూట్‌చేశాం. కొత్త నిర్మాతలైనా ప్యాషన్‌తో మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చారు. ఫస్ట్‌ సినిమా కాబట్టి చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. అవుట్‌పుట్‌ చూసుకున్నాక వెంకట్‌, రామ్‌ గారు చాలా హ్యాపీగా వున్నారు. 

సాయికుమార్‌ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది? 

- ఫస్ట్‌ ఈ కథ సాయికుమార్‌ గారికి చెప్పినపుడు బాగా ఇంప్రెస్‌ అయ్యారు. ఈ సినిమాలో ఒక కీ రోల్‌ ఉంది. అది సాయికుమార్‌ గారు చేస్తాను అని చెప్పారు. వెంటనే మీరు చేస్తే అదిరిపోతుంది సార్‌ అని చెప్పాను. ఆది, సాయికుమార్‌ గారి కాంబినేషన్‌లో చేసిన సీన్స్‌ చాలా పవర్‌ఫుల్‌గా వుంటాయి. విలేజ్‌ నేటివిటీ ఉన్న ఒక పెద్దాయన క్యారెక్టర్‌లో సాయికుమార్‌గారు అత్యద్భుతంగా చేశారు. పెద్ద పెద్ద రైతులందరికీ సాయికుమార్‌గారి క్యారెక్టర్‌ కనెక్ట్‌ అవుతుంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ సాయికుమార్‌గారు ఈ క్యారెక్టర్‌కి యాప్ట్‌ అయ్యారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సాయికుమార్‌ భలే చేశాడ్రా అని అప్రీషియేట్‌ చేస్తారు. 

నిర్మాతలు వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి మేకింగ్‌ ఎలా ఉంది? 

- మా హీరో ఆది మార్కెట్‌ రేంజ్‌కన్నా ఎక్కువ ఖర్చుపెట్టి చాలా గ్రాండియర్‌గా ఈ సినిమా నిర్మించారు. ఫస్ట్‌నుండి ఈ సినిమాపై పాజిటివ్‌ వైౖబ్రేషన్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. ఫస్ట్‌ టీజర్‌ రిలీజ్‌ అయ్యాక సినిమాపై క్రేజ్‌ బాగా పెరిగింది. ఆడియో రిలీజ్‌ అయి చాలా పెద్ద హిట్‌ అయింది. మూడు పాటలు కాలర్‌ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు. ట్రైలర్‌కి యుట్యూబ్‌లో పది లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఒక్కొక్క ఏరియా నుండి ఇద్దరు, ముగ్గురు డిస్ట్రిబ్యూటర్స్‌ వచ్చి ఫ్యాన్సీ రేటుతో సినిమాని కొన్నారు. నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా ఉన్నారు. 

సినిమాలో మెయిన్‌ హైలైట్స్‌ ఏంటి? 

- తమన్‌ మ్యూజిక్‌తో పాటు రీ రికార్డింగ్‌ ఇరగదీశాడు. కెమెరామెన్‌ అరుణ్‌ ప్రతి సీన్‌ని విజువల్‌గా వండర్‌ఫుల్‌గా చిత్రీకరించాడు. రామ్‌, వెంకట్‌ గారి మేకింగ్‌, ఆది - సాయికుమార్‌ల పర్ఫామెన్స్‌, పృధ్వీ కామెడీ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా నిలుస్తాయి. పది సంవత్సరాలపాటు గుర్తు పెట్టుకునే విధంగా మా 'చుట్టాలబ్బాయి' చిత్రం ఉంటుంది. మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్‌తో ఆడియన్స్‌ ధియేటర్‌ నుండి బయటికి వస్తారు. 

నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఏమిటి? 

- రెండు ప్రాజెక్ట్స్‌ కమిట్‌ అయ్యాను. ఇదే బ్యానర్‌లో ఒకటి, బయటి బ్యానర్‌లో ఒక సినిమా ఉంటుంది. వివరాలు త్వరలో చెబుతాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement