Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: సత్యరాజ్

Tue 21st Jun 2016 10:35 PM
satya raj interview,dorai movie,sibiraj,dharani dharan  సినీజోష్ ఇంటర్వ్యూ: సత్యరాజ్
సినీజోష్ ఇంటర్వ్యూ: సత్యరాజ్
Advertisement
Ads by CJ

దాదాపు 220 చిత్రాల్లో నటించి 'బాహుబలి' సినిమాలో కట్టప్ప పాత్రతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటుడు సత్యరాజ్. ఆయన న‌టిస్తే సినిమా హిట్ అవుతుంద‌నే పాజిటివ్ టాక్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సత్యరాజ్ త‌మిళంలో 'జాక్స‌న్ దురై' పేరుతో ఓ సినిమాలో న‌టించారు. ఆ చిత్రం తెలుగులో 'దొర‌' గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆయ‌న సొంత త‌న‌యుడు శిబిరాజ్ కీల‌క పాత్ర‌ను పోషించారు. నిర్మాత జ‌క్కం జ‌వ‌హ‌ర్‌బాబు  ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. జులై 1 న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నటుడు సత్యరాజ్ విలేకర్లతో ముచ్చటించారు. 

ఇదొక హార్రర్ ఎంటర్ టైనర్..

ఇదొక పీరియాడికల్ హార్రర్ ఎంటర్టైనర్ సినిమా. థ్రిల్లర్, కామెడీ అంశాలు కలగలిపి ఉండే చిత్రం. ఓ బ్రిటీష్ దయ్యానికి, ఇండియన్ దయ్యానికి మధ్య జరిగే గొడవే ఈ సినిమా. ఓ వైవిద్యమైన లైన్ తో ఈ సినిమాను రూపొందించాము. ధ‌ర‌ణీధ‌ర‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఆయన అమెరికాలో డైరెక్షన్ కోర్స్ చేశారు. 

నా పాత్ర పేరే దొరై..

నేను ఈ సినిమాలో ఇండియన్ దయ్యం పాత్రలో కనిపిస్తాను. బ్రిటిష్ దయ్యం పేరు జాక్సన్, ఇండియన్ దయ్యం పేరు దొరై. తమిళంలో అందుకే జాక్సన్ దొరై అని టైటిల్ పెట్టాం. తెలుగుకు వచ్చేసరికి దొరై అని పెట్టాలనుకున్నాం. బ్రిటిష్ దయ్యం పాత్రలో ఒరిజినల్ బ్రిటిష్ పెర్సన్ ఒకరు నటించారు. 

నా కొడుకు కూడా నటించాడు..

ఈ సినిమాలో నాతో పాటు నా కొడుకు శిబిరాజ్ కూడా నటించాడు. ఈ మధ్య కాలంలో హార్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. నాకు గోస్ట్ పాత్రలో నటించడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. ఎందుకంటే వాటికొక మ్యానరిజం ఉండదు. అవి ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికి తెలియదు. అందుకే నాకు నటించడం కాస్త సులువు అనిపించింది. 

నాకోసం పాత్రలు రాస్తున్నారు..

తెలుగు, తమిళ భాషల్లో దర్శకులు విభిన్నమైన రోల్స్ తో నా దగ్గరికి వస్తున్నారు. ఒక ఆర్టిస్ట్ ను దృష్టిలో పెట్టుకొని పాత్రలు రాస్తుంటే చాలా ప్రౌడ్ గా ఉంటుంది. నన్ను దృష్టిలో పెట్టుకొని పాత్రలు రాస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓ నటుడిగా నాకు కావాల్సింది ఇంకేముంటుంది. 

ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళిదే..

38 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. అయితే ఇప్పుడు అందరూ నా ఒరిజినల్ పేరు మర్చిపోయి, కట్టప్ప అని పిలుస్తున్నారు. చిన్నపిల్లలు కూడా బయటకు వెళ్ళినప్పుడు కట్టప్ప అనే సంబోధిస్తున్నారు. నా పేరు మర్చిపోయి నా పాత్ర పేరు గుర్తుపెట్టుకుంటున్నారంటే.. నటుడిగా నేను చాలా చాలా సంతోషించే విషయమది. ఈ క్రెడిట్ మొత్తం రాజమౌళి గారికే చెందుతుంది. లైఫ్ టైం క్యారెక్టర్ అది. 

నా సినిమాలు చాలా రీమేక్ చేశారు..

దాదాపు 220 సినిమాల్లో నటించాను. 75 కి పైగా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాను. ఆ తరువాత హీరోగా చాలా సినిమాలు చేశాను. 200 సినిమాల తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాను. రకరకాల పాత్రలు పోషించాను. స్నేహితుడు సినిమాలో వైరస్ పాత్రలో నటించిన వ్యక్తి, బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో నటించిన మనిషి ఒక్కరే అని ఎవరు గుర్తుపట్టారు. ఏ పాత్రకు ఆపాత్ర భిన్నంగా ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా నాతో పని చేసిన దర్శకులకే చెందుతుంది. నేను నటించిన చాలా సినిమాలు తెలుగులో రీమేక్ చేశారు. పసివాడి ప్రాణం, ఆరాధన, అసెంబ్లీ రౌడీ, ఎస్.పి.పరశురామ్, అల్లుడు గారు, బ్రహ్మ ఇలా చాలా చిత్రాలు తెలుగులో రీమేక్ చేశారు. 

భాష సమస్య ఉంటుంది..

హిందీలో చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించాను. బాలీవుడ్ లో నటించడానికి భాష సమస్య ఉంటుంది. ఈ వయసులో లాంగ్వేజ్ నేర్చుకొని నటించడమంటే కష్టం. నాకు ప్రామ్ప్టింగ్ బాగా వచ్చు. అది కష్టం అనిపిస్తే భాష నేర్చుకోవాలి. ప్రస్తుతమైతే ప్రామ్ప్టింగ్ తో కానిచ్చేస్తున్నా..

నెస్ట్ ప్రాజెక్ట్స్..

తమిళంలో పటాస్ రీమేక్ లో నటిస్తున్నాను. సాయికుమార్ గారి పాత్రలో కనిపిస్తాను. అలానే రామ్, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నటించడానికి అంగీకరించాను. హీరో తండ్రి పాత్రలో కనిపిస్తాను. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ అంటూ ఇంటర్వ్యూ ముగించారు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ