మలయాళం, తమిళంలో నటిగా తన టాలెంట్ నిరూపించుకున్న నివేత థామస్ తొలిసారిగా 'జెంటిల్ మెన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మొదటి సినిమాతోనే విమర్శకుల, ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సందర్భంగా నివేత ప్రేక్షకులతో ముచ్చటించారు.
స్టొరీ వినగానే చేయాలనుకున్నాను..
కో డైరెక్టర్ సురేష్ గారు నేను నటించిన కొన్ని సినిమాలు చూశారు. అలానే తమిళంలో నా ఇంటర్వూస్ చూశారు. అవి ఆయనకు నచ్చడంతో మోహన్ కృష్ణ గారికి చెప్పారు. ఆయన నాకు స్టోరీ నేరేట్ చేయగానే సినిమా చేయాలనుకున్నాను. అంతగా నా క్యారెక్టర్ ఆకట్టుకుంది.
నానికి నేను పెద్ద ఫ్యాన్..
నాని కి నేను పెద్ద ఫ్యాన్ ని. తను నటించిన సినిమాలన్నీ చూశాను. కాని పెర్సనల్ గా తను నాకు తెలియదు. మొదటిసారిగా రీడింగ్ సెషన్ లోనే తనను కలిశాను. కమల్ హాసన్ గారి తరువాత నేను అభిమానించే మనిషి నానినే. మన తోటి నటీనటులను అప్రిషియేట్ చేయడానికి గట్స్ ఉండాలి. నానికి ఆ విషయంలో క్రెడిట్స్ ఇవ్వాలి.
మంచి రెస్పాన్స్ వస్తోంది..
సినిమా రిలీజ్ అయిన తరువాత మంచి రెస్పాన్స్ వస్తోంది. నాకు సినిమా మొదలయిన్నప్పటి నుండి చాలా నమ్మకం ఉండేది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నాని లాంటి మంచి హ్యాండ్స్ లో సినిమా ఉంది. సినిమా బాగా రావడానికి డైరెక్టర్ గారు, నాని ఉన్నారనే కాన్ఫిడెన్స్ ఉండేది. మోహన్ గారు నాకు ఫ్యామిలీలా అయిపోయారు.
డబ్ చేయాలనుకున్నాను..
సెట్స్ లో మొదటిరోజు తమిల్, మలయాళం తెలిసిన వారు ఉంటారనుకున్నాను. కాని ఎవరు లేరు. నాతో అందరు హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడేవారు. నాకు మొదటి నుండి తెలుగంటే ఇష్టం. అందుకే నేర్చుకున్నాను. సినిమా కోసమని కాదు నా తృప్తి కోసం. డబ్బింగ్ కూడా చెప్పాలనుకున్నాను. కాని అదే సమయానికి నాకు పరీక్షలు ఉండడంతో చెప్పడం కుదరలేదు. నెక్స్ట్ సినిమాకు ఖచ్చితంగా డబ్బింగ్ చెప్తాను.
భాష ఒక్కటే వేరు..
నేను తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటించాను. ఇండస్ట్రీ ప్రకారం నేను దేన్నీ డివైడ్ చేయలేను. పని చేయడానికి వచ్చాం.. అందరితో మంచిగా ఉండాలి. భాష ఒక్కటే వేరు. పని ఎక్కడైనా ఒకటే. ఒక భాషలో సెటిల్ అవుతానని చెప్పలేను. ప్రస్తుతం తెలుగులో మంచి షిఫ్ట్ ఉంది. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను.
నాని లేకుండా సినిమా ఉండదు..
నాని హీరోగా చేస్తున్నాడని నేను ఈ సినిమా అంగీకరించలేదు. స్క్రిప్ట్ నచ్చింది. అయినా.. నాని లేకుండా ఈ సినిమా జరిగేదే కాదు.
కమల్ గారు ఇంకా సినిమా చూడలేదు..
పాపనాశం సినిమాలో కమల్ హాసన్ గారితో కలిసి నటించాను. కమల్ గారు గౌతమీ గారు నాకు చాలా సపోర్టివ్ గా ఉంటారు. వాళ్ళు నాకు చాలా స్పెషల్. కమల్ సర్ ఇంకా సినిమా చూడలేదు. నాని వైఫ్ అంజన ఈ సినిమా చూసి నన్ను బాగా మెచ్చుకుంది. జెన్యూన్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది.
స్కిన్ షో నాకు నచ్చదు..
మొదట కథ వింటాను. ఆ పాత్రలో నేను సెట్ అవ్వగలనో లేదో చూసుకుంటాను. ఆ తరువాత హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు అని ఆలోచిస్తాను. కథ, పాత్ర నాకు నచ్చాలి. స్కిన్ షో నాకు నచ్చదు. దాని వల్ల సినిమా హిట్ అవుతుందంటే నమ్మను. నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను. హిట్ అయితే హ్యాపీ, సినిమా ఆడకపోతే దాని నుండి ఓ లెసన్ నేర్చుకుంటాను.
సురభి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది..
నాతో పాటు సినిమాలో మరో హీరోయిన్ ఉందని, స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుందని ఆలోచించలేదు. సురభితో నాకు ఎలాంటి ఇస్శ్యూస్ లేవు. నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. తనను చాలా మిస్ అవుతున్నాను. తను ఉండేది ఢిల్లీలో నేను ఉండేది చెన్నైలో. కాని తనతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను.
నరేష్ మంచి ఫ్రెండ్..
అల్లరి నరేష్ తో కలిసి తమిళంలో ఓ సినిమాలో నటించాను. అప్పుడే మంచి ఫ్రెండ్ అయిపోయాడు. నాని, అంజన, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఆయన ఫ్యామిలీ ఇలా అందరితోను స్నేహంగానే ఉంటాను.
నాని అందులో మాస్టర్..
నేను ఎలాంటి యాక్టింగ్ కోర్స్ చేయలేదు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో నటించే ముందు మోహన్ కృష్ణ గారు, నాని, నేను కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. రిహార్సల్స్ చేస్తాం. మోహన్ కృష్ణ గారు ఆర్టిస్ట్స్ ల యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. వాళ్ళు చెప్పింది ఆయనకు నచ్చితే వెంటనే ఓకే చేస్తారు. నాని ఇంప్రువైజేషన్ లో మాస్టర్.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ఇప్పటివరకు ఏ సినిమా కమిట్ కాలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.