Advertisementt

హీరోయిన్ అవ్వాలనేది నా కల: అదితి సింగ్

Wed 15th Jun 2016 07:48 PM
adithi singh interview,vinod lingala,sai ronak  హీరోయిన్ అవ్వాలనేది నా కల: అదితి సింగ్
హీరోయిన్ అవ్వాలనేది నా కల: అదితి సింగ్
Advertisement
Ads by CJ

సాయి రోనక్, అదితి సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వం వహించిన చిత్రం 'గుప్పెడంత ప్రేమ'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంద్భంగా హీరోయిన్ అదితి సింగ్ విలేకర్లతో ముచ్చటించారు. ''హీరోయిన్ అవ్వాలని, నన్ను నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనేది నా చిన్ననాటి కల. స్కూల్ లో కూడా టీచర్స్ అడిగినప్పుడు నేను హీరోయిన్ అవుతానని చెప్పేదాన్ని. నేను పుట్టింది ఢిల్లీ లో.. బొంబాయిలో పెరిగాను. మా నాన్నగారు ప్రతాప్ సింగ్ బాలీవుడ్ సినిమాల్లో నటించారు. అమీర్ ఖాన్ లాంటి పెద్ద హీరోలతో పని చేశారు. బహుసా ఆయన ప్రభావం నాపై ఉండేదనుకుంట. నేను చాలా లావుగా ఉండేదాన్ని. సుమారుగా 85 కిలోల బరువు ఉండేదాన్ని. అయితే ఈ సినిమా ఆడిషన్స్ కోసం 10 కిలోల బరువు తగ్గాను. ఆడిషన్స్ లో నిత్యామీనన్ 'అలా మొదలైంది' సినిమాలో డైలాగ్ చెప్పాను. బొంబాయి అమ్మాయి తెలుగులో డైలాగ్స్ ఏం చెప్తుందని అందరు అనుకున్నారు. కాని వినోద్ గారు నన్ను ప్రోత్సహించారు. భాషతో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. నేను డైలాగ్ చెప్పగానే అక్కడ ఉన్నవారంతా.. షాక్ అయ్యారు. వినోద్ గారు వెంటనే శాండీ అనే రోల్ లో నువ్వే నటిస్తున్నావని చెప్పారు. చాలా సంతోష పడ్డాను. శాండీ సింపుల్ గా ఉండే ఓ తెలుగమ్మాయి. అమ్మా, నాన్నలకు గౌరవం ఇస్తుంది. తన యాంబిషన్స్ చాలా పెద్దగా ఉంటాయి. నా కో యాక్టర్ సాయి రోనక్ నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. స్క్రీన్ పై కూడా మా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఈ సినిమాలో ఫస్ట్ లవ్ లో ఉండే ఫీలింగ్స్ ను డీల్ చేశారు. ఎమోషన్స్ చాలా ప్యూర్ గా ఉంటాయి. మేఘాలయ, చిరపుంజి వంటి ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలో సినిమాను చిత్రీకరించాం. ఈ సినిమాలు మ్యూజిక్ సోల్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అంత అధ్బుతంగా ఉంటాయి. వినోద్ గారికి స్క్రిప్ట్ పట్ల చాలా క్లారిటీ ఉంది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కాని కుదరలేదు. ఖచ్చితంగా నా తదుపరి చిత్రాలకు డబ్బింగ్ మాత్రమే కాదు పాటలు కూడా పాడాలని అనుకుంటున్నాను'' అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ