Advertisementt

కృష్ణ‌గారితో నటించడం నా అదృష్టంః ఆశిష్

Mon 06th Jun 2016 01:06 PM
asish gandhi interview,krishna. sri sri movie  కృష్ణ‌గారితో నటించడం నా అదృష్టంః ఆశిష్
కృష్ణ‌గారితో నటించడం నా అదృష్టంః ఆశిష్
Advertisement
Ads by CJ

'ప‌టాస్' చిత్రంలో విల‌న్ గా న‌టించి విమ‌ర్శ‌కుల నుంచి  ప్ర‌శంలందుకున్నఆశిష్ గాంధీ తాజాగా సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించ‌గా ముప్ప‌ల‌నేని శివ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'శ్రీ శ్రీ' చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించాడు. ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లైంది.  ఆశిష్ గాంధీ పోషించిన  పాత్ర‌కు ప్రేక్ష‌కుల నంచి మంచి అప్లాజ్ వ‌స్తుండ‌టంతో  ఈ రోజు పాత్రికేయుల‌తో త‌న సంతోషాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయ‌న మాటల్లో...

నేపధ్యం..

మాది హైద‌రాబాద్, మా నాన్న‌గారు కేబుల్ ర‌న్ చేస్తుంటారు. చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో హార్డ్ వ‌ర్స్ చేసి మ‌మ్మ‌ల్ని చదివించారు. వారి నుంచి నాకు కూడా క‌ష్ట‌ప‌డే   తత్వం ఏర్ప‌డింది. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. మోడ‌లింగ్ రంగంలో కూడా నేను రాణించాను. కొన్ని షార్ట్ ఫిలింస్ కూడా చేశాను. అలాగే 'ఓస్త్రీ రేపురా' చిత్రంలో హీరోగా న‌టించా. దానికి కూడా మంచి పేరొచ్చింది. 

న‌ట‌న‌లో శిక్షణ తీసుకున్నా..

బిజినెస్ నిమిత్తం మా నాన్న‌గారు మ‌ద్రాసు, ముంబాయి వెల్లాల్సి వ‌చ్చింది. ఆ టైమ్ లో ముంబ‌యిలోని రోష‌న్ తనేజా ఫిలిం ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ లో శిక్ష‌ణ పొందా. ఈ స‌మ‌యంలోనే మోడ‌లింగ్ రంగంలోకి అడుగుపెట్టా. నాకు మోడ‌లింగ్ చాలా ప్ల‌స్ అయింది. అలాగే నాకు ఎంతో ఇష్ట‌మైన  మార్ష‌ల్ ఆర్ట్స్ లో కూడా శిక్ష‌ణ తీసుకున్నా.

కళ్యాణ్ గారు ప్రోత్సహించారు..

నేను చేసిన షార్ట్ ఫిలింస్ తో వెళ్లి `ప‌టాస్` ద‌ర్శ‌కుడిని క‌లిశాను. వారు ఆడిష‌న్ చేశారు. ఈ పాత్ర కోసం దాదాపు ప‌ది మందికి పైగా పోటీ ప‌డ్డారు. నాకు వ‌స్తుందో రాదో అని డౌట్ ప‌డ్డా. కానీ ద‌ర్శ‌కుడు వారి పాత్ర‌కు నేను స‌రిగ్గా సూట‌వుతాన‌ని నన్ను ఫైన‌ల్ చేశారు. హీరో క‌ళ్యాన్ రామ్ గారు చాలా బాగా చేస్తున్నావంటూ ఎంతో ప్రోత్స‌హించారు.

అది నా అద్రుష్టం..

సినిమా చూసిన ప్ర‌తి వారు ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది. నా కెరీర్ స్టార్టింగ్ లోనే లెజండ‌రీ యాక్ట‌ర్ సూప‌ర్ స్టార్ కృష్ణ గారు న‌టించిన సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌కుడు ముప్ప‌ల‌నేని శివ గారికి కృత‌జ్క్ష‌త‌లు తెలుపుకుంటున్నా.  ప్ర‌తి రోజు కృష్ణ‌గారి బ్లెస్సింగ్స్ తీసుకొనే వాడిని. చాలా పెద్ద విల‌న్ అవుతావంటూ కృష్ణ గారు దీవించ‌డం చాలా  హ్య‌పీ గా అనిపించింది. వారి ఎంక‌రేజ్ మెంట్ నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.

విల‌న్ గానే కంటిన్యూ అవుతా..

విల‌న్ పాత్ర‌ల్లో కంటిన్యూ అవ్వాల‌నుంది. 

ఫ్యామిలీ స‌పోర్ట్..

మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ మొద‌ట్లో సినిమాల్లోకి వెళుతున్నానంటే ఒప్పుకోలేదు. కానీ `ప‌టాస్` లో న‌టించిన‌ప్ప‌టి నుంచి ఎంక‌రేజ్ చేస్తున్నారు. వారి స‌పోర్ట్ తో ఇక మీద‌ట పూర్తిగా సినిమాల పైనే దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నా. ఒక మంచి న‌టుడుగా పేరు తెచ్చుకోవాల‌న్న‌దే నా యాంబీష‌న్.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఇప్పుడిప్పుడే పెద్ద ద‌ర్శ‌కుల‌ను క‌లుస్తున్నా. ముఖ్యంగా 'శ్రీ శ్రీ' సినిమా త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌కులు ఫోన్ చేసి అడుగుతున్నారు. రెండు మూడు తెలుగు సినిమాలు చ‌ర్చ‌ల్లో ఉన్నాయి. అలాగే త‌మిళంలో ఒక పెద్ద హీరో, ద‌ర్శ‌కుడు సినిమాలో న‌టించే అవ‌కాశం ల‌భించింది. త్వ‌ర‌లో దాని గురించి వెల్ల‌డిస్తాను అంటూ ముగించారు ఆశిష్ గాంధీ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ