Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: విజయ్ ఆంటోనీ

Mon 16th May 2016 06:52 PM
vijay antony interview,bicchagadu movie,shasi    సినీజోష్ ఇంటర్వ్యూ: విజయ్ ఆంటోనీ
సినీజోష్ ఇంటర్వ్యూ: విజయ్ ఆంటోనీ
Advertisement
Ads by CJ

విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్'. శశి దర్శకుడు. ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి 'బిచ్చగాడు' టైటిల్ తో తెలుగులో అనువదించారు. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనీ విలేకర్లతో ముచ్చటించారు.

తెలుగు, తమిల్ ఆడియన్స్ టేస్ట్ ఒక్కటే..

ఇది వరకు నేను నటించిన 'నకిలీ','డా||సలీమ్' చిత్రాలను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశాం. రెండు చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా 'బిచ్చగాడు' సినిమాను రిలీజ్ చేశాం. అయితే తమిళంలో ఈ చిత్రాన్ని ఎంతగా ఆదరించారో.. తెలుగులో కూడా అదే విధంగా ఆదరిస్తున్నారు. తెలుగు, తమిల్ ఆడియన్స్ టేస్ట్ ఒక్కటే. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. నా తదుపరి చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలానే నా సినిమాలు యాభై శాతం చిత్రీకరణ తెలుగు రాష్ట్రాల్లోనే చేయాలనుకుంటున్నాను.

కథే హీరో...

నేను ప్రాక్టికల్ గా ఉండే చిత్రాల్లోనే నటిస్తాను. హీరోయిజమ్ ను నమ్మను. సినిమాకు కథే హీరో. కథ బావుండే సినిమాల్లోనే నటిస్తాను. సొసైటీలో జరిగే ఇష్యూస్ ను ప్రధానంగా తీసుకొని చేసే సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నాను. సినిమా సక్సెస్ అయిందంటే దాని క్రెడిట్ అంతా.. దర్శకుడికే చెందుతుంది.

నెగెటివ్ ఇంపాక్ట్ కలగదు..

నేను నటించే సినిమాలకు నెగెటివ్ టైటిల్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకో నేను ఆ టైటిల్స్ కు బాగా ఎట్రాక్ట్ అవుతున్నాను. అయినా.. నెగెటివ్ అని మీడియాలో అనుకుంటారు కానీ ప్రేక్షకులకు మాత్రం అవే నచ్చుతున్నాయి. వాళ్ళు బాగానే ఆదరిస్తున్నారు.

ఏడుస్తూనే ఉన్నాను..

ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఏడుస్తూనే ఉన్నాను. ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. అదే రియాక్షన్ నేను థియేటర్ లో చూశాను. థియేటర్ లో సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్ రెస్పాన్స్ అసలు నమ్మలేకపోయాను. నేను కథ విన్నప్పుడు ఎలా రియాక్ట్ అయ్యానో.. ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు అదే ఫీల్ అయ్యారు.

క్లైమాక్స్ సీన్స్ కష్టమనిపించింది..

ఈ సినిమా క్లైమాక్స్ కోసం రెండు రోజుల పాటు షూట్ చేశాం. అమ్మ కోసం కొడుకు ఏడ్చే సన్నివేశం. చాలా సేపు ఏడుస్తూనే ఉండాలి. అలా కంటిన్యూస్ గా ఏడవడం చాలా కష్టమనిపించింది. 

వర్క్ ఎంజాయ్ చేస్తున్నాను..

నా ప్రతి సినిమాకు మ్యూజిక్, ప్రొడక్షన్, హీరో ఇలా మూడు పనులూ నేనే చూసుకుంటున్నాను. నాకెప్పుడు కష్టమనిపించలేదు. కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతాను. నా పనిని ఎంజాయ్ చేస్తూ.. చేస్తాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతం సైతాన్, యముడు చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ రెండు సినిమాల తరువాత సలీమ్ మూవీ సీక్వెల్ లో నటిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ