సూపర్ స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'బ్రహ్మోత్సవం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు విలేకర్లతో ముచ్చటించారు.
విలువల్ని మర్చిపోతున్నారు..
మోడరన్ డేస్ లో కెరీర్ ముఖ్యమని వారి గోల్స్ ను మాత్రమే గుర్తుపెట్టుకుంటూ.. కుటుంబ విలువల్ని మర్చిపోతున్నారు. ఆ విలువల్ని గుర్తు చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది.
లవ్ స్టొరీ ఉంటుంది..
ఈ సినిమాలో లవ్ స్టొరీ ఉంటుంది. కుటుంబం మధ్య జరిగే కథే ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ కలగలిపిన చిత్రం. ఈ సినిమాలో ఎమోషన్స్ ప్యూర్ గా రియలిస్టిక్ గా ఉంటాయి.
కొత్త కాన్సెప్ట్..
శ్రీకాంత్ తో ఇదివరకు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేశాను. ఆ సినిమాకు బ్రహ్మోత్సవానికి ఎలాంటి పోలికలు ఉండవు. ఇదొక కొత్త కాన్సెప్ట్. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చేయలేదు. ఫ్రెష్ ఫిలిం.
చాలా అవుట్ డోర్ షూటింగ్స్ చేశాం..
ఈ సినిమా కోసం చాలా అవుట్ డోర్ షూటింగ్స్ చేశాం. ఇప్పటివరకు నేనే సినిమాకు ఇన్ని ఊర్లు తిరగలేదు. హరిద్వార్, ఉదయ్ పూర్ ఇలా చాలా ప్రాంతాలకు వెళ్లాం. బ్రహ్మోత్సవాలు జరిగే ఒక ప్రాంతాన్ని తీసుకొని సినిమాను చిత్రీకరించాం.
కథను నమ్మారు..
ఈ సినిమా కోసం పివిపి గారు ఎంతో ఖర్చుపెట్టారు. అడిగింది కాదనకుండా.. ఇచ్చారు. కథను నమ్మి ఈ సినిమాను నిర్మించారు.
భిన్నమైన సినిమా..
శ్రీమంతుడు లాంటి ఇన్స్పిరేషనల్ సినిమా తరువాత 'బ్రహ్మోత్సవం' లాంటి ఫ్యామిలీ సినిమా చేయడం నా అద్రుష్టం. ఒకే తరహా చిత్రాలు కాకుండా డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలి. శ్రీకాంత్ గారు 'శ్రీమంతుడు' సినిమా సమయంలో నాకు బ్రహ్మోత్సవం స్టొరీ చెప్పారు. అప్పుడే సినిమా చేయడానికి ఒకే చెప్పాను.
చాలా కష్టపడ్డారు..
ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వాలని ప్రతి ఒక్కరు ఎంతో కష్టపని పని చేశారు.
మురుగదాస్ తో సినిమా చేస్తున్నా..
నా నెక్స్ట్ ఫిలిం మురుగదాస్ గారితో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రెండు భాషల్లో ఆ సినిమా విడుదలవుతుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.