'పటాస్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈయన దర్శకత్వంలో వస్తోన్న మరో చిత్రం 'సుప్రీమ్'. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా మే 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి తో సినీజోష్ ఇంటర్వ్యూ..
క్యాబ్ పేరే 'సుప్రీమ్'..
ఈ సినిమాలో హీరో క్యాబ్ డ్రైవర్. క్యాబ్ కు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర ఉంటుంది. దానికి కూడా ఏదైనా పేరు ఉంటే బావుంటుందని 'సుప్రీమ్' అని పెట్టాం.
ఎమోషన్స్ మీద నడిచే కథ..
హనుమంతుడు వాయువేగంతో శ్రీరాముడు కోసం వెళ్తాడు. ఈ కథలో హనుమంతుడు లాంటి టాక్సీ డ్రైవర్ ఎవరి కోసం వెళ్ళాడనేది ఆసక్తికరం.
రాశి క్యారెక్టర్ బావుంటుంది..
ఈ సినిమాలో రాశి ఖన్నా బెల్లం శ్రీదేవి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుంది. లేడీ పోలీస్ ఆఫీసర్ అంటే మొదటగా గుర్తొచ్చేది.. విజయశాంతి గారు. ఆమె పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించి చాలా గ్యాప్ వచ్చింది. అదే పాత్రను ఎంటర్టైనింగ్ గా చూపించాలనుకున్నాను. రాశి ఖన్నా, రఘుబాబు, వెన్నెల కిషోర్ ల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రాశి ఖన్నా ఇంట్రడక్షన్ కూడా చాలా మాసివ్ గా యాక్షన్ ఎపిసోడ్ తో ఉంటుంది.
పటాస్ నుండి ట్రావెల్ చేస్తున్నాను..
నేను డైరెక్ట్ చేసిన 'పటాస్' సినిమా ఫస్ట్ కాపీ చూసి దిల్ రాజు గారు అభినందించారు. అప్పటినుండి ఆయనతో ప్రయాణం చేస్తున్నాను. ఎమోషనల్ గా ఆయనకు బాగా కనెక్ట్ అయిపోయాను. మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలనుకున్నప్పుడు తేజు హీరోగా అనుకోలేదు. కథ రాసుకున్న తరువాత తేజు అయితే బావుంటుందని తనను సెలెక్ట్ చేసుకున్నాం.
ఆ హీరోల ఇంపాక్ట్ నా మీద ఉంటుంది..
నేను పుట్టింది 1980 లలో అప్పటి హీరోల ఇంపాక్ట్ నా మీద బాగా ఉంటుంది. చిరంజీవి గారి డాన్సులు, పాటలు నాకు నచ్చేవి. కొన్ని పాటలు విన్నప్పుడు నా సినిమాలో పెట్టుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది. అలా సుప్రీమ్ పాట అనిపించింది. ఏదో సినిమాకు హెల్ప్ అవుతుంది కదా అని రీమిక్స్ చేయలేదు. నా పిచ్చి, ప్యాషన్ తో చేశాను. అలానే ప్రేక్షకులు బ్రేక్ డాన్స్ చూసి కూడా చాలా గ్యాప్ వచ్చింది. చిరంజీవి గారి బ్రేక్ డాన్స్ అప్పట్లో అందరికి బాగా నచ్చేది. మరోసారి తేజుతో ఆ ప్రయత్నం చేశాం.
సగమైనా.. రీచ్ అవ్వాలనుకున్నాం..
ఒరిజినల్ సాంగ్ లో చిరంజీవి, రాధ గ్రేస్ మూమెంట్స్ ను ఎవరు మ్యాచ్ చేయలేరు. కనీసం యాభై శాతమైన వారికి మ్యాచ్ కావాలని రీమిక్స్ లో ట్రై చేశాం. ఇప్పడైతే 75 శాతం వరకు రీచ్ అయ్యామనే అనుకుంటున్నాం.
యూనివర్సల్ సబ్జెక్ట్..
సినిమాలో హీరో ఒక జర్నీ చేయాల్సి వస్తుంది. అందులో వచ్చే ప్రతి మూమెంట్ థ్రిల్లింగ్ గా ఉంటాయి. తేజు మాత్రమే కాకుండా సినిమాలో ప్రతి పాత్ర ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది యూనివర్సల్ సబ్జెక్టు. ఏ భాషలో అయినా.. రీమేక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే.. పటాస్ సినిమా రీమేక్ చేసే వారే ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రతి ఆర్టిస్ట్ ప్రాణం పెట్టి చేశారు..
ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ తమ సినిమాలా భావించి కష్టపడి పని చేశారు. రవికిషన్ అయితే విలన్ రోల్ లో ఇరగదీసాడు. రాజేంద్రప్రసాద్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. జంధ్యాల గారు ఒక లైబ్రరీ. ఇప్పటికి నేను ఆయన సినిమాలు చూస్తూ ఉంటాను. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ సూపర్. ఈరోజు చాలా మంది నా కామెడీ టైమింగ్ బావుందని మెచ్చుకుంటున్నారంటే దానికి రాజేంద్ర ప్రసాద్, జంధ్యాల గారే కారణం,
క్లైమాక్స్ కీలకం..
ఈ సినిమాలో చివరి ఇరవై నిమిషాల క్లైమాక్స్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో చూసి ఉండరు. క్లైమాక్స్ ముఖ్యమైన ఆరుగురు నటీనటులు కనిపిస్తారు. వారెవరనే విషయం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. ఆర్టిస్ట్ అందరు ఆ సీన్ కోసం లైఫ్ పెట్టి చేశారు.
బాలకృష్ణ గారితో కుదరలేదు..
బాలకృష్ణ గారితో రామారావు అనే సినిమా చేయాలనుకున్నాను. కాని ఏప్రిల్ నాటికే పూర్తి కథను రెడీ చేసి చెప్పమన్నారు. నేను 'సుప్రీమ్' సినిమా పనుల్లో బిజీగా ఉండడం వలన ప్రాక్టికల్ గా బాలకృష్ణ గారి సినిమా కుదరలేదు. భవిష్యత్తులో చాన్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను.
అదొకటి ప్లాన్ చేసుకున్నా..
డైరెక్టర్ గా నా లైఫ్ అయిపోతే దాసరి నారాయణరావు గారిలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాలని మరో ప్లాన్ చేసుకున్నా..
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
లైన్ అయితే రెడీ గా ఉంది కాని ఈ సినిమా రిజల్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.