Advertisementt

ఫ్లాప్స్ గురించి ఆలోచించే టైం లేదు: నారా రోహిత్

Thu 28th Apr 2016 06:16 PM
nara rohit interview,raja cheyyi vesthe,pradeep  ఫ్లాప్స్ గురించి ఆలోచించే టైం లేదు: నారా రోహిత్
ఫ్లాప్స్ గురించి ఆలోచించే టైం లేదు: నారా రోహిత్
Advertisement

'బాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన హీరో నారా రోహిత్. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాల్లో నటిస్తూ.. బిజీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నారా రోహిత్ నటించిన 'రాజా చెయ్యి వేస్తే' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా రోహిత్ విలేకర్లతో ముచ్చటించారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపిస్తా..

ఈ సినిమాలో నా పాత్ర పేరు రాజారామ్. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుంటాను. డైరెక్టర్ కావాలనేదే తన కల. ఇదొక చాలెంజింగ్ రోల్. నా క్యారెక్టర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. యాక్షన్, థ్రిల్లర్ జోనర్ లో సాగే ఈ కథలో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. సినిమాలో హీరో, విలన్ ల రోల్స్ చాలా టఫ్ గా ఉంటాయి.

స్క్రీన్ ప్లే బావుంటుంది..

ఇప్పుడు కొత్తగా తీయడానికి కథలు లేవు. రొటీన్ కథ అయినా.. కథనం ఎలా ఉంటుందనేదే ముఖ్యం. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నే ప్రాణం. దర్శకుడు ప్రదీప్ నాకు నేరేట్ చేసిన కథను స్క్రీన్ పై అలానే ప్రెజంట్ చేశాడు. తనకు కావాల్సింది వచ్చేవరకు అసలు కాంప్రమైజ్ కాని వ్యక్తి. ప్రతి విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. టెక్నికల్ గా కూడా ప్రదీప్ చాలా స్ట్రాంగ్.

నాకంటే ముందు తనే సైన్ చేశాడు..

ఈ సినిమాకు ముందుగా సైన్ చేసింది తారక్. ఆ తరువాత నాకు కథ నచ్చి ఒప్పుకున్నాను. తారక్ వలన ఈ సినిమాకు ఫ్రెష్ నెస్ వచ్చింది. తను లేకపోతే సినిమా ఇంత బాగా వచ్చుండేది కాదు. ఈ సినిమాతో మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.

ఆలోచించే సమయం లేదు..

రీసెంట్ గా రిలీజ్ అయిన 'సావిత్రి' సినిమా నేను అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఎందువలన మంచి రిజల్ట్ రాలేదని ఆలోచించే సమయం నాకు లేదు. తుంటరి సినిమాకు మాత్రం మంచి రిజల్టే వచ్చింది. నిర్మాతలు కూడా సంతోషంగానే ఉన్నారు.

క్వాలిటీ లేదంటే ఒప్పుకోను..

వరుసగా సినిమా చేయడం వలన క్వాలిటీ తగ్గుతుంది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేనే సినిమా 10, 15 రోజుల్లో పూర్తి చేయలేదు. సావిత్రి సినిమా 55 రోజులు షూట్ చేశాం. రాజా చెయ్యి వేస్తే సినిమా కోసం సుమారుగా 75 రోజులు చిత్రీకరణ జరిపాం. స్క్రీన్ మీద క్వాలిటీ ఖచ్చితంగా ఉంటుంది.

కొత్త, పాత అని చూడను..

ఏ సినిమా చేయడానికైనా.. ముందు కథ నచ్చిందా..? లేదా..? అనే చూస్తాను. కొత్త డైరెక్టర్, పాత డైరెక్టర్, ఇంతకముందు ఎవరి దగ్గర వర్క్జ్ చేశారు..? ఇలాంటి విషయాలు అసలు పట్టించుకోను. ఒక ప్రయత్నాన్ని నమ్మి సినిమా చేస్తాను. ముందే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందా..? లేదా..? అని జడ్జ్ చేయలేం కదా..!

పూరి గారితో సినిమానా..?

పూరి జగన్నాథ్ గారితో సినిమా చేస్తున్నాననే మాటలు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదు. నేను ఆయనతో సినిమా చెయ్యట్లేదు.

పూర్తిగా తగ్గాలి..

ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గాను. జూన్ నుండి మొదలయ్యే సినిమాల్లో పూర్తిగా బరువు తగ్గి నటిస్తాను.

ఇళయరాజా గారి మ్యూజిక్..

కథలో రాజకుమారి అనే సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. మే నెలలో రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఆ చిత్రానికి ఇళయరాజా గారు మ్యూజిక్ అందించారు. ఇప్పటికే మూడు పాటల షూటింగ్ అయిపోయింది. మంచి ట్యూన్స్ ఇచ్చారు.

ఇద్దరు అన్నదమ్ముల కథ..

శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో 'జో అచ్యుతానంద' సినిమాలో నటిస్తున్నాను. ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉండే బాండింగ్ కథే ఈ సినిమా. ఇది కాకుండా.. 'అప్పట్లో ఒకడుండేవాడు','పండగలా వచ్చాడు' సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత కొత్త స్క్రిప్ట్స్ ఒప్పుకుంటాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement