Advertisementt

త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నా:ఆది పినిశెట్టి

Sat 23rd Apr 2016 08:12 PM
aadi pinisetty interview,allu arjun,sarainodu,boyapati sreenu  త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నా:ఆది పినిశెట్టి
త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నా:ఆది పినిశెట్టి
Advertisement

'ఒక విచిత్రం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన హీరో ఆది పినిశెట్టి. అయితే తెలుగులో కంటే ఈ హీరోకి తమిళంలో మంచి పాపులారిటీ ఉంది. తెలుగులో కూడా తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న ఈ హీరోకి బెస్ట్ ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. కేవలంలో హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే నెగెటివ్ రోల్ చేయడానికి సిద్ధపడిన ఈ హీరో రీసెంట్ గా 'సరైనోడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో విలన్ గా కనిపించిన ఆది కు మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సందర్భంగా ఆది విలేకర్లతో ముచ్చటించారు. 

అరవింద్ స్వామితో పోల్చారు..

ఈ సినిమాకు తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు వచ్చిన ఫోన్ కాల్స్ మరే సినిమాకు నాకు రాలేదు. ప్రతి ఒక్కరు కాల్ చేసి మెచ్చుకుంటున్నారు. తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు బాగా నడుస్తాయి. 'సరైనోడు' పక్కా కమర్షియల్ సినిమా అయినా.. అక్కడ ఆడియన్స్ కు బాగా నచ్చింది. గ్రాండియర్ గా ఉందంటున్నారు. నా నటన చూసి 'తని ఒరువన్' సినిమాలో అరవింద్ స్వామి గారితో పోలుస్తున్నారు.

విలన్ రోల్స్ చేస్తా..

హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినా.. పాత్ర ఆసక్తికరంగా అనిపిస్తే విలన్ రోల్స్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే కథ ఇంటరెస్టింగ్ గా ఉండడంతో పాటు పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న సినిమా అయితేనే నటిస్తాను. టెక్నికల్ టీం స్ట్రాంగ్ గా ఉండాలి. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా అనేవి మాత్రమే ఉంటాయి. భారీ బడ్జెట్ సినిమా, చిన్న సినిమా అని ఆలోచించను.

కథ విన్నప్పుడే చేయాలనుకున్నాను..

అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి ఒక కథ విను. నీకు నచ్చితేనే చెయ్.. లేదంటే మొహమాట పడకుండా చెప్పేయ్ అన్నారు. అయితే 25నిమిషాల నేరేషన్ వినగానే నేను ఖచ్చితంగా ఈ సినిమాలో భాగమవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను ఈ సినిమాలో చేసింది సాధారణ విలన్ పాత్ర కాదు. చాలా పవర్ ఫుల్ గా ఉండే రోల్. 

డైరెక్టర్ చెప్పింది చేశా..

నిజ జీవితంలో నేను చాలా మంచోడిని. సడెన్ గా విలన్ రోల్ అనగానే షూటింగ్ కు రాకముందే విలన్ గా ఎలా కనిపించాలా..? అని ప్రాక్టీస్ చేశా.. అయితే షూటింగ్ స్పాట్ కు వెళ్ళగానే బోయపాటి గారి మైండ్ లో నేను అనుకున్నదానికంటే పవర్ ఫుల్ విలన్ ఉన్నాడు. ఇక నేను ప్రాక్టీస్ చేసిందంతా.. పక్కన పెట్టేసి బోయపాటి గారు చెప్పినట్లు విన్నాను. కాని నేను బోయపాటి గారు చెప్పిన దాంట్లో కేవలం ముప్పై నుండి నలభై శాతం మాత్రమే నటించాను. 

బన్నీ నా రోల్ చేస్తానన్నాడు..

సినిమాలో నా పాత్ర కోసం నేను బన్నీతో ప్రత్యేకంగా డిస్కస్ చేయలేదు. షూటింగ్ సమయంలో మాత్రం చేసేవాడిని. మా ఇద్దరి మధ్య హెల్థీ డిస్కషన్స్ జరిగేవి. బన్నీ కి నా రోల్ బాగా నచ్చింది. ఇదే సినిమాను మరొక ల్యాంగ్వేజ్ లో చేస్తే 'నీ రోల్ లో నేను నటిస్తానని' బన్నీ చెప్పేవాడు. 

చిరంజీవి గారు ఫోన్ చేసి మాట్లాడారు..

ఈ సినిమా చూసిన ఇండస్ట్రీ వారు చాలా మంది ఫోన్స్ చేసి అభినందిస్తున్నారు. చిరంజీవి, వినాయక్, టెక్నీషియన్స్ ఇలా అందరూ ఫోన్ చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఐదు నిమిషాల పాటు మాట్లాడారు. నాకు మధ్యలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. మొదటిసారి ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోసారి ఇలాంటి అవకాశం వస్తుందో.. రాదో కూడా నేను చెప్పలేను. నా డిక్షన్, బాడీ ల్యాంగ్వేజ్ ఇలా ప్రతి ఒక్కదాని గురించి మాట్లాడారు. నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అది.

రెండు బ్యాలన్స్ చేస్తూ.. చేస్తా..

నా తదుపరి సినిమాలు డిఫరెంట్ గా ఉంటూ.. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా బ్యాలన్స్ చేసుకుంటూ చేయాలనుకుంటున్నాను. నా నెక్స్ట్ రెండు సినిమాలు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాను. నాకు నచ్చని కమర్షియల్ సినిమాలైతే నేను చేయను.

మా అన్నయ్యతో చేయాలనుంది..

నేను అన్నయ్య డైరెక్షన్ లో 'మలుపు' సినిమా చేశాను. తనతో మరో సినిమా చేయాలనుంది. డైరెక్టర్ కు, హీరోకు సింక్ అయ్యి.. కథ బావుంటే సినిమా హిట్ అవుతుంది. మా అన్నయ్యకు నాకు బాగా సింక్ అవుతుంది.

హీరో పనే కష్టం..

విలన్, హీరోలలో హీరో వర్క్ చేయడమే కష్టం. యాక్షన్స్ సీక్వెన్సెస్, డాన్సులు ఇలా ప్రతి ఒక్క విషయంలో హీరో కష్టపడతాడు. ఈ సినిమాను బన్నీ తన భుజాలపై వేసుకొని నడిపించాడు. 

ప్రతి సీన్ బెటర్ గా చేయాలనిపిస్తుంది..

నేను చేసిన సినిమాలు చూసుకొని ఇంకా బెటర్ గా చేస్తే బావుంటుందని అనుకుంటాను. ఈ సినిమా విషయంలో కూడా అంతే..

మా ప్రొడక్షన్ లో సినిమాలు వస్తాయి..

అన్నయ్య మొదటిసారిగా సినిమా చేస్తున్నాడని సపోర్ట్ చేయడానికి ఆ సినిమాను మేమే ప్రొడ్యూస్ చేశాం. అయితే ప్రస్తుతం మా ప్రొడక్షన్ లో ఏ సినిమా ప్లాన్ చేయలేదు. భవిష్యత్తులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎవరైనా కథలు తీసుకొస్తే చిన్న సినిమాలు చేయాలనుకుంటున్నాం.  

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

బైలింగ్యుల్ సినిమా ఒకటి కొత్త డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నాం. నిధిని వెతుక్కుంటూ... వెళ్ళిన ఒక గ్యాంగ్ వారికి ఎదురైన సంఘటనలు ఎంటర్టైన్మెంట్ రూపంలో తెరకెక్కిస్తున్నాం. 

త్వరలోనే జైలుకు వెళ్ళాల్సి వస్తుంది..

ప్రస్తుతానికి ఇంట్లో నాకు పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నాను(నవ్వుతూ..). తెలుగమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. నేనైతే ఎవరిని చూసుకోలేదు. ఎరెంజేడ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement