Advertisementt

వోటు హక్కు లేదుకానీ ఎమ్మెల్యే పాత్ర చేస్తోంది!

Sun 17th Apr 2016 10:05 PM
catherin tresa interview,boyapati sreenu,allu arjun  వోటు హక్కు లేదుకానీ ఎమ్మెల్యే పాత్ర చేస్తోంది!
వోటు హక్కు లేదుకానీ ఎమ్మెల్యే పాత్ర చేస్తోంది!
Advertisement
Ads by CJ

'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటి కేథరిన్ తెరెసా. 'పైసా','రుద్రమదేవి' వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం 'సరైనోడు' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ కేథరిన్ తెరెసాతో సినీజోష్ ఇంటర్వ్యూ..

యంగ్ ఎమ్మెల్యే రోల్..

ఈ సినిమాలో నేనొక యంగ్ ఎమ్మెల్యేగా కనిపించబోతున్నాను. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో ఎవరు నటించలేదు. బాధ్యత గల ఓ రాజకీయనాయకురాలిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నాను. కానీ నిజ జీవితంలో నేను రాజకీయాలకు చాలా దూరం. నాకు వోటు హక్కు కూడా లేదు.   

మంచి పాత్రలకే నా వోటు.. 

తెలుగులో ఎక్కువగా సెకండ్ లీడ్ రోల్స్ ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. నేను మెయిన్ లీడ్, సెకండ్ లీడ్ అని చూసుకోను. నాకు పాత్ర నచ్చితే చేస్తాను. మంచి పాత్రలను సెలక్ట్ చేసుకొని నటిస్తాను. తెలుగులో నాకు ఎగ్జైటెడ్ గా అనిపించే రోల్స్ తక్కువ వస్తున్నాయి. అందుకే కొన్ని చిత్రాల్లోనే నటిస్తున్నాను. తమిళంలో మాత్రం మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అందుకే అక్కడ ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నాను.

ఏది ప్లాన్ చేయలేదు..

బన్నీ తో ఇది మూడవ సినిమా. అది యాదృచ్చికంగానే జరిగింది. కానీ కావాలని ప్లాన్ చేసి చేసింది కాదు. 

రిజల్ట్ నా చేతిలో ఉండదు..

సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది నా చేతిలో ఉండదు. నాకు సినిమా అంటే ఇష్టం. ప్యాషన్ తో నటిస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. రిజల్ట్ అనేది నా చేతిలో ఉండదు.

ఎనర్జిటిక్ హీరో..

బన్నీ ఎనర్జిటిక్ హీరో. అసలు అలిసిపోకుండా వర్క్ చేస్తూనే ఉంటాడు. చాలా కష్టపడతాడు. ప్యాషనేట్ యాక్టర్. ఈ సినిమాలో రకుల్ కూడా నటించింది. తనకు నాకు కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. డెడికేషన్ ఉన్న నటి. 

కథపై గ్రిప్ ఉన్న డైరెక్టర్..

తెలుగులో నేను చేసిన సినిమాల్లో మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన సినిమా ఇదే. బోయపాటి గారు ఫెంటాస్టిక్ డైరెక్టర్. కథ మీద మంచి గ్రిప్ ఉన్న దర్శకుడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా దగ్గరుండి మరీ చూసుకునేవారు.

ఇక్కడ హ్యాపీగా ఉన్నాను..

తెలుగు, తమిళంలో నాకు వచ్చే అవకాశాలతో నేను సంతోషంగానే ఉన్నాను. మంచి రోల్స్ వస్తున్నాయి. బాలీవుడ్ కు అప్పుడే వెళ్ళే ఆలోచన అయితే లేదు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

తమిళంలో విశాల్ నటిస్తోన్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నాను. అలానే ఆర్య లీడ్ రోల్ లో నటిస్తోన్న మరో సినిమా కమిట్ అయ్యాను. తెలుగులో ఏ సినిమాకు కమిట్ కాలేదంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ