Advertisementt

టీవీ షోలో ఇదొక బాహుబలి: మంచు లక్ష్మీ!

Wed 30th Mar 2016 04:53 PM
memu saitham,lakshmi prasanna,rakul preeth singh  టీవీ షోలో ఇదొక బాహుబలి: మంచు లక్ష్మీ!
టీవీ షోలో ఇదొక బాహుబలి: మంచు లక్ష్మీ!
Advertisement
Ads by CJ

సమాజంలో అనారోగ్య, ఆర్ధిక బాధలతో తల్లడిల్లుతున్న కుటుంబాలని ప్రత్యేక శ్రద్ధతో గుర్తించి వారిని ఆదుకోవడానికి మా వంతు బాధ్యతగా 'మేము సైతం' అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, వెండితెర మీద మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా మన స్టార్స్ తమ సత్తా చాటబోతున్నారని మంచు లక్ష్మీ వెల్లడించారు. ఆమె ఆధ్వర్యంలో వస్తోన్న ఈ 'మేము సైతం' కార్యక్రమం ఏప్రిల్ 2 నుండి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ''రెండు సంవత్సరాలుగా ఇలాంటి ఒక ప్రోగ్రాంను ప్రారంభించాలని ఆలోచిస్తున్నాను. కాని నాకు ఎలా ఫార్మాట్ చేయాలో అర్ధం కాలేదు. సుశీల్ కుమార్ షిండే గారి కుమార్తె స్మృతి షిండే ఇలాంటి కార్యక్రమాన్ని హిందీలో చేస్తున్నారు. దక్షిణాదిన కూడా చేయాలని నన్ను కలిశారు. ఆమె చెప్పిన వెంటనే అంగీకరించాను. జీవితంలో మరొక దారి లేదని నిరాశ చెందే వారికి ఒక మార్గం చూపించడమనేది మంచి విషయం. దీనికి సహకరిస్తున్న మన స్టార్స్ అందరికి నా కృతజ్ఞతలు. టీవీ షోలో ఇదొక బాహుబలి అని చెప్పొచ్చు. దీని కోసం అంత ఎఫర్ట్ పెడుతున్నాం. తమిళం, మలయాళం, కన్నడలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు'' అని తెలిపారు.

''దక్షిణాదిన ఇలాంటి కార్యక్రమం చేయడం ఎందరికో స్పూర్తిని కలిగిస్తుందని'' హీరో సుశాంత్ చెప్పాడు.

''10 సంవత్సరాల చిన్న పాప క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. తన జీవితంలో మార్పు రావడం కోసం నేను కాయగూరలు అమ్మాను'' అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జెమిని టీవీ బిజినెస్ హెడ్ సుబ్రమణ్యం పాల్గొని తమ వంతు ఆర్ధిక సహాయాన్ని అందించారు. జెమిని టీవీ నాన్ పిక్షన్ హెడ్ కాశీనాథ్, జెమిని కిరణ్ లక్ష్మీ ప్రసన్నను అభినందించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ