Advertisementt

సినిమాలు చేయాలంటే అలసటగా ఉంటుంది: పవన్

Sat 19th Mar 2016 06:01 PM
pawan kalyan press meet,sardhar gabbar singh,sarath marar  సినిమాలు చేయాలంటే అలసటగా ఉంటుంది: పవన్
సినిమాలు చేయాలంటే అలసటగా ఉంటుంది: పవన్
Advertisement

పవన్ కళ్యాన్ నటిస్తోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 20న హైదరాబాద్ లోని నొవెటల్ హోటల్ లో జరగనుంది. అయితే ఈ కార్యక్రమం గురించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని విషయాలను తెలియజేశారు. ''రాజకీయాల కోసమే తప్ప ఈ మధ్యకాలంలో సినిమా ప్రెస్ మీట్ పెట్టడం ఇదే మొదటిసారి. నిజానికి సర్దార్ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్నటివరకు చేయాలా..? వొద్దా..? అని ఆలోచించాం. పబ్లిక్ ఫంక్షన్స్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాను. నా అభిమానులు సేఫ్ గా ఇంటికి వెళ్ళకపోతే నాకే బాధ. నొవెటల్ హోటల్ లో ఆడియో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు పోలీస్ సిబ్బంది వారు చాలా ప్రశ్నలు వేశారు. ఆ హోటల్ లో ఉన్న ఫారెన్ డెలిగేట్స్ ఇబ్బంది పడతారని చెప్పారు. ఒకానొక సమయంలో అసలు ఆడియో లాంచ్ క్యాన్సిల్ చేసి ఓ ప్రెస్ మీట్ లో పాటలను రిలీజ్ చేయాలనుకున్నాం. నిర్మాత శరత్ మరార్ ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. కమీషనర్ గారు, కెటిఆర్, హరీష్ రావు, డిసిపి లు ఇచ్చిన సపోర్ట్ తో ఆడియో ఫంక్షన్ చేస్తున్నాం. దయచేసి పాసులు లేని వారెవరు ఆడియో ఫంక్షన్ దగ్గర గుమ్మికూడొద్దు. అలా చేస్తే అసాంఘిక శక్తులకు ఊతమిచ్చినట్లు అవుతుంది. పాసులు ఉన్నవారే ఆడియోకు రావాలని కోరుకుంటున్నాను. నిజానికి నాకు ఇలా ఆడియో ఫంక్షన్స్ చేసుకోవడం నచ్చదు. కాని రాజకీయాలకైనా.. సినిమాలకైనా ఓ ట్రేడ్ విధానం ఉంది. ఇష్టం ఉన్నా.. లేకపోయినా ఫాలో అవ్వాలి. ఈ సినిమా హిందీ వారికి కూడా కథ కనెక్ట్ అవుతుంది. అందుకే బాలీవుడ్ లో కూడా సినిమా రిలీజ్ కు ప్లాన్ చేశాం. వర్మ గారు బాలీవుడ్ రిలీజ్ మంచిది కాదని ట్వీట్ చేశారు. ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. అయితే మరో సినిమాతో పోటీ పడాలని నేను ఎప్పుడూ.. ఆలోచించను. భగవంతుడికే వొదిలేస్తాను. రీసెంట్ గా అన్నయ్య(చిరంజీవి) సర్దార్ సెట్స్ కు వచ్చారు. ఆయన ఇంటి దగ్గరే కావడం వలన సెట్ ఎలా ఉందో.. చూడడానికి వచ్చారు. రియలిస్టిక్ గా చాలా బావుందని చెప్పారు. 'గబ్బర్ సింగ్' సినిమా ఆడియో అన్నయ్యే రిలీజ్ చేశారు. ఈ సినిమా ఆడియోకు కూడా అన్నయ్య ను ఆహ్వానించాను. ఈ సినిమాను ఎంటర్టైన్మెంట్ కోసమే చేశాం. పొలిటికల్ గా ఎలాంటి విషయాలను డీల్ చేయలేదు. సినిమాను నేను డైరెక్ట్ చేయకపోవడానికి కారణాలున్నాయి. దర్శకునిగా సినిమా చేయడానికి కొన్ని లిమిటేషన్స్ వచ్చేస్తాయి. ఎదుటివారిని పుష్ చేసే సమయంలో అందరికి నా మీద కోపం వచ్చేస్తుంది. అందుకే చేయలేదు. 'ఖుషి' సినిమా తరువాత నాలుగైదు సినిమాలు చేసి మానేయాలనుకున్నాను. కాని కుదరలేదు. నాకెందుకో సినిమాలు చేయాలంటే అలసటగా ఉంటుంది'' అని చెప్పారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement