Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: లతా హేగ్దే

Thu 10th Mar 2016 09:01 PM
latha hegde interview,thuntari movie,nara rohit  సినీజోష్ ఇంటర్వ్యూ: లతా హేగ్దే
సినీజోష్ ఇంటర్వ్యూ: లతా హేగ్దే
Advertisement

నారా రోహిత్, లతా హేగ్దే జంటగా శ్రీ కీర్తి ఫిల్మ్స్ బ్యానర్ పై కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో అశోక్, నాగార్జున్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'తుంటరి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 11న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ లతా హేగ్దే తో సినీజోష్ ఇంటర్వ్యూ..

నేపధ్యం..

నేను పుట్టింది బెంగుళూరు లో. కాని పెరిగిందంతా న్యూజిలాండ్ లో. రెండేళ్ళ క్రితం అక్కడ మోడలింగ్ చేయడం మొదలుపెట్టాను. 'మిస్ న్యూజిలాండ్' గా అవార్డు తెచ్చుకున్నాను. ఆ సమయంలోనే నాకు 'తుంటరి' సినిమాలో నటించమని ఆఫర్ వచ్చింది. మొదట ఫేక్ కాల్ అనుకున్నాను. కాని నాకు హైదరాబాద్, వైజాగ్ లలో స్నేహితులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు తెలుసుకున్నాను.

సినిమాలో పాత్ర..

ఈ సినిమాలో నా పాత్ర పేరు సిరి. డీసెంట్ గా ఉండే అమ్మాయి. తనకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సపోర్ట్ ఆడే వాళ్ళంటే కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూంటుంది. సినిమాలో రాజు(నారా రోహిత్) బాక్సర్ అనుకొని తనను ఇష్టపడుతుంది.

రోహిత్ చాలా హెల్ప్ చేశాడు..

నారా రోహిత్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల వ్యక్తి. నాకు తెలుగు రాకపోవడం వలన బాగా ఇబ్బంది పడేదాన్ని. ఆ సమయంలో నాకు ప్రతిది వివరించి చెప్పేవాడు. తనతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది.

కుమార్ అమేజింగ్ డైరెక్టర్..

కుమార్ నాగేంద్ర అమేజింగ్ డైరెక్టర్. తన వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అసలు స్ట్రెస్ ఫీల్ అవ్వరు. సెట్ లో చాలా కామ్ గా ఉంటారు. ఎంకరేజింగ్ పెర్సన్. ఒక షాట్ కోసం 10 నుండి 11 టేక్స్ తీసుకున్నాను. డైరెక్టర్ గారు తిడతారేమో అనుకున్నాను. కాని కుమార్ నా మీద కోప్పడలేదు. 

వర్క్ షాప్ లో ప్రాక్టీస్ చేశా..

ప్రత్యేకంగా నటన ఎక్కువ కాలం శిక్షణ తీసుకోలేదు. షార్ట్ టర్మ్ యాక్టింగ్ కోర్స్ చేశాను. సినిమాలో ప్రతి సీన్ కు ముందు వర్క్ షాప్ కండక్ట్ చేసేవారు. అక్కడే ఎక్కువగా నేర్చుకున్నాను. 

మొదట్లో ఇబ్బంది పడ్డా..

సినిమా షూటింగ్ మొదలయినప్పుడు కొంచెం టెన్షన్ పడేదాన్ని. యాక్టింగ్ సరిగ్గా రాదు.. భాష తెలియదు. కాని ఇప్పుడిప్పుడే తెలుగు అర్ధం చేసుకుంటున్నాను. అలానే సినిమా స్టార్టింగ్ సీన్స్ కంటే సెకండ్ హాఫ్, క్లైమాక్స్ లలో నా నటన బావుంటుంది.

మహేష్ బాబు ఫ్యాన్ ని..

ఈ సినిమా అంగీకరించిన తరువాత తెలుగులో 'ఆగడు' సినిమా చూశాను. ఆ సినిమాతో మహేష్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతానికి ఏది ఫైనల్ చేయలేదు.. ఈ సినిమా రిజల్ట్ బట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆలోచిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement