మంచు మనోజ్ రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
థ్రిల్లింగ్ లవ్ స్టోరీ..
'శౌర్య' ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. సినిమాలో ఎలాంటి ఫైట్స్, స్టంట్స్ ఉండవు. మంచి కామెడీ ఉంటుంది. నా సినిమా అంటే ప్రేక్షకులు మాస్ ఎలిమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కాని ఈ సినిమా క్లాసీగా ఉంటుంది. మొదట ఈ రోల్ కోసం 8 కేజీలు పెరిగాను. ఆ తరువాత షర్టు వేసుకొని, టక్ చేసుకొనే సరికి క్లాస్ లుక్ వచ్చింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేసరికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది.
శౌర్య, దశరథ్ గారి క్యారెక్టర్..
ఈ సినిమాలో శౌర్య పాత్ర తీసుకొని నిజ జీవితంలో పెడితే అది దశరథ్ గారి పాత్ర అవుతుంది. దర్శకులు బాగా వివరిస్తే ఆర్టిస్టుల పని సులువు అయిపోతుంది. దశరథ్ గారు ఆ విషయంలో నెంబర్ వన్. ఆయన చెప్పింది ఫాలో అయిపోయి నటించాను. ప్రతి ఒక్కరిలో మంచి, చెడు ఉంటాయి. అది మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తీసుకొని పెద్దగా చేయాలని ప్రయత్నిచాం. సినిమా ట్రైలర్ కట్ చేసినప్పుడు, దర్శకుడు బాగా కష్టపడ్డాడు. బేస్ లేయర్ చూపిస్తూ.. మెయిన్ లేయర్ ను రివీల్ చేయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమా మొదలయిన 10 నిమిషాలకే మెయిన్ కథ మొదలవుతుంది.
నేను ఏది ప్లాన్ చేయను..
ఈ సమయంలో ఇలాంటి సినిమాల్లో నటించాలని అనుకోను. నేను ప్లాన్ చేసుకొనే మనిషిని కాదు. 'ఎటాక్' సినిమా తరువాత దశరథ్ గారు ఫోన్ చేసి కథ వింటారా అనడిగారు. ముప్పై నిమిషాల నేరేషన్ తరువాత ఆయన స్క్రిప్ట్ ను ఎంతగా ప్రేమించారో అర్ధమయింది. ఇక వెంటనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. క్లారిటీ ఉన్న డైరెక్టర్. నాకు చెప్పిన దానికంటే ఇంకా బాగా తీశారు.
నాన్నకు బాగా నచ్చింది..
ఈ సినిమాపై మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఇప్పటివరకు నేను కామెడీ, హై ఎనర్జీ లెవెల్స్ ఉన్న పాత్రల్లోనే నటించాను. మొదటిసారి సెటిల్డ్ గా ఉన్న పాత్రలో నటించాను. నాన్నగారు రీసెంట్ గా సినిమా చూసి చాలా కొత్తగా కనిపించానని చెప్పారు. డైరెక్టర్ గారిని పొగిడారు. రెజీనా చాలా బాగా నటించింది. తన పాత్రకు న్యాయం చేసింది. టాలెంట్ ఉన్న అమ్మాయి.
నేను గయ్యాలిని చేసుకోలేదు..
ప్రణతి నాకు 5 సంవత్సరాలుగా తెలుసు. మా ఇద్దరికీ పెళ్లి కాకముందే తనను ఏ విషయంలోనైనా.. మ్యానేజ్ చేయడానికి కష్టపడేవాడిని(నవ్వుతూ..). ఇప్పుడు నేను బయటకి వెళ్ళినా.. తనను కూడా తీసుకువెళ్ళిపోతాను. పెళ్ళికి ముందు, పెళ్లి తరువాత నాలో ఎలాంటి మార్పు రాలేదు. నేను గయ్యాలిని చేసుకోలేదు కాబట్టి బ్రతికిపోయాను.
శ్రీ సినిమా తరువాత మరోసారి..
దశరథ్ గారితో ఇది రెండవ సినిమా. 'శ్రీ' సినిమాకు ఇప్పటికి ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అదే ప్యాషన్, అదే విజన్ ఉంది. కాకపోతే ఆయన కాన్ఫిడెన్స్ ఇంకాస్త పెరిగింది. నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేసాడో.. అనుకుంటారు. గ్రిప్పింగ్ గా ఉంటూ.. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే సినిమా.
బావుంటే అన్నీ హిట్ అవుతాయి..
ఈరోజుల్లో నాలుగైదు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా.. బావుంటే అన్నీ హిట్ అవుతున్నాయి. కళ్యాన్ వైభోగమే డైరెక్టర్ నందిని రెడ్డి, ప్రవీణ్ సత్తారు నాకు మంచి ఫ్రెండ్స్. మేము సరదాగా ఒకరి గురించి ఒకరం ట్వీట్ చేసుకుంటున్నాం. రిలీజ్ అయిన తరువాత అందరం పార్టీ చేసుకుందామని కూడా అనుకుంటున్నాం.
డ్రగ్స్ కి, కాస్ట్ కి దూరంగా ఉండండి..
ఎక్కడికెళ్ళినా.. దరిద్రంగా కాస్ట్ అనే మాట వినిపిస్తోంది. ప్రతి రంగంలో కొంతమందికే న్యాయం జరుగుతుంది. కాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువైపోతుంది. నా సినిమాను మాత్రం కాస్ట్ ఫీలింగ్ తో చూడొద్దు. కళాకారులు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని సినిమా చేస్తారు. ఎన్నో కాస్ట్ లు కలిస్తే ఒక సినిమా చేయగలం. డ్రగ్స్ ఎలా జీవితాన్ని పాడుచేస్తాయో.. కాస్ట్ కూడా అంతే. డ్రగ్స్ కి, కాస్ట్ కి దూరంగా ఉండండి.
నాన్నగారు ఇన్వాల్వ్ అవ్వరు..
నేను మీకు తెలుసా సినిమా తరువాత నాన్నగారు నా స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నా సినిమాలు నేనే సెలెక్ట్ చేసుకుంటాను. రేపు నా భార్యకు, పిల్లలకు మీరు తినేది నా ఫుడ్, మీ తాతది కాదు అని నేను గర్వంగా చెప్పుకోవాలి.
ఈ సినిమా తరువాతే ఎటాక్..
మొదట నుండి ఈ సినిమాకు హైప్ బాగా వచ్చింది. సో.. దీని తరువాత ఎటాక్ సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమా ప్రొడ్యూసర్ కు లాభాలు వస్తాయనే ఉద్దేశ్యంతో అది రిలీజ్ కాస్త లేట్ చేశాం.
మంచి సినిమా చేశాననే తృప్తి ఉండాలి..
నేను చిన్నప్పటి నుండే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. నాన్నగారు అప్స్ అండ్ డౌన్స్ చూశాను. నాకు హిట్, ఫ్లాప్ తో సంబంధం ఉండదు. మంచి సినిమా చేశాననే తృప్తి కలగాలి.
పెదరాయుడు మరోసారి..
నాన్నగారి ఇండస్ట్రీకు వచ్చి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఆయన కోసం మేము కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాం. అందులో బాగంగా త్వరలోనే పెదరాయుడు సినిమా రిలీజ్ చేస్తున్నాం.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
ఏప్రిల్ లో కొత్త సినిమా ప్రారంభించబోతున్నాం. ఆ సినిమాలో కొత్త లుక్ తో కనిపిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.