Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ:రవికాంత్ పేరెపు

Thu 18th Feb 2016 05:59 PM
ravikanth perepu interview,kshanam movie,adavi sesh  సినీజోష్ ఇంటర్వ్యూ:రవికాంత్ పేరెపు
సినీజోష్ ఇంటర్వ్యూ:రవికాంత్ పేరెపు
Advertisement
Ads by CJ

అడవి శేష్, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రల్లో రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'క్షణం' ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు రవికాంత్ పేరెపుతో సినీజోష్ ఇంటర్వ్యూ..

నేపధ్యం..

నేను పుట్టింది, పెరిగింది వైజాగ్ లోనే. చిన్నప్పటి నుండి సినిమాల మీద ఆసక్తి ఉండేది. మణిరత్నం గారి 'సఖి' సినిమా చూసి నేను కూడా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆయనే నా ఇన్స్పిరేషన్. కాని ఇంట్లో వాళ్ళు మొదట డిగ్రీ కంప్లీట్ చేయమని చెప్పారు. వైజాగ్ లోనే ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఆ తరువాత సినిమా చేయాలని హైదరాబాద్ వచ్చాను.

శేష్ నా ఫేస్ బుక్ ఫ్రెండ్..

అడవి శేష్, సాయి కిరణ్ అడవి నాకు ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్. సినిమా చేయాలనుందని శేష్ తో చెప్పినప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన తరువాత రా అని చెప్పాడు. తను 'కర్మ' సినిమా చేస్తున్నప్పటి నుండి నాకు తెలుసు. తన మీద నమ్మకంతో ఇక్కడకి వచ్చాను. శేష్ చేసిన 'కిస్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయాలనుకున్నాను. కాని ఆ సినిమా షూటింగ్ మొత్తం ఫారెన్ లో జరిగింది. నాకు వీసా ప్రాబ్లం ఉండడం వలన వెళ్ళలేకపోయాను. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం చూసుకున్నాను.

ఇదొక సస్పెన్స్ డ్రామా..

అడవి శేష్ కు జరిగిన ఓ ఇన్సిడెంట్ ను ఆధారంగా చేసుకొని ఈ కథను డెవలప్ చేశాం. కిడ్నాప్ చుట్టూ తిరిగే ఓ సస్పెన్స్ డ్రామా ఇది. చిన్నపిల్లను కిడ్నాప్ చేసిన తరువాత తనను వెతికే ప్రాసెస్ లో జరిగే కథ ఇది. గ్రిప్పింగ్ గా ఉంటుంది. శేష్ కూడా ఒక డైరెక్టర్ అయినా.. ఈ సినిమాకు చాలా ఫ్రీడం ఇచ్చాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తరువాత నా వర్క్ లో అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు.

మొదట ఇబ్బంది పడ్డాను..

నాకు సినిమా గురించి థియరీ తప్ప సెట్స్ లో సినిమా ఎలా చేయాలో తెలియదు. మొదట నాలుగైదు రోజులు చాలా ఇబ్బంది పడ్డాను. ఎలాంటి డౌట్ వచ్చినా.. గూగుల్ లో వెతికేవాడిని. నాలుగు రోజుల తరువాత నుండి ఇంక అలావాటు అయిపోయింది. కాన్ఫిడెన్స్ తో సినిమా షూట్ చేశాను. 

ప్రొడ్యూసర్స్ ఒక్కటే చెప్పారు..

ఈ సినిమా కథ పివిపి గారికే మొదట వినిపించాం. మూడు రోజుల్లో ఓకే చేసేసి మాకు ఆఫీస్ ఇచ్చేసారు. నాకు మెయిన్ ఫ్రీడమ్ ప్రొడ్యూసర్స్ నుండి వచ్చిందనే చెప్పాలి. స్క్రిప్ట్ కంటే 10 నుండి 15 శాతం సినిమా బావుండాలని చెప్పారు. అవుట్ పుట్ చూసిన తరువాత వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాను లిమిటెడ్ బడ్జెట్ లోనే తీశాం. మొత్తం 65 నుండి 70 రోజులు చిత్రీకరణ జరిపాం.

నా స్వార్ధం కోసం సినిమా చేశా..

డెబ్యూ ఫిలిం ఏ లవ్ స్టొరీనో తీసుకొని సినిమాగా చేయొచ్చుగా.. అని అందరూ అనుకుంటారు. ఇప్పటివరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. నా కెరీర్ కు మొదటి సినిమా కాబట్టి అందరికి నచ్చే విధంగా ఉండాలి. సినిమా నచ్చితే అందరి ఫోకస్ నా మీద పడుతుందనే స్వార్ధంతో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమా ఎంచుకున్నాను. ఈ సినిమా హిట్ అయితే నా కెరీర్ కు ఇది పెద్ద స్టెప్.

క్షణంలో జీవితాలు మారిపోతాయి..

ఒక క్షణంలో జీవితాలు మారిపోతాయి. నెక్స్ట్ సెకండ్ లో ఏం జరుగుతుందో..? మనం చెప్పలేము. అదే కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి సినిమాకు టైటిల్ గా 'క్షణం'ను ఎంపిక చేసుకున్నాను. స్క్రీన్ ప్లే కూడా టైటిల్ కు తగ్గట్లు గ్రిప్పింగ్ గా ఉంటుంది.

ట్రైలర్ రెస్పాన్స్ ఊహించలేదు..

సినిమా ట్రైలర్ కు మేము అనుకున్నదానికంటే మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది బావుందని చెప్పారు. నితిన్, నిఖిల్, రానా, మహేష్ ఇలా చాలా మందికి నచ్చింది.

మంచి సినిమానే నా ఇన్స్పిరేషన్..

మణిరత్నం గారి సినిమా చూసే ఇన్స్పైర్ అయ్యాను. అలానే త్రివిక్రమ్ గారి సినిమాలు, పూరి గారి హీరోల క్యారెక్టరైజేషన్స్, రాజమౌళి గారి బిగ్ కాన్వాస్ అన్ని నచ్చుతాయి. మంచి సినిమా ఏది వస్తే అదే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను.

హారర్ తప్ప అన్నీ చేస్తా..

నేను అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చేయాలనుకుంటాను. హారర్ సినిమాలు మాత్రం చేయను. హారర్ సినిమాలు చూడాలంటేనే నాకు భయం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఇప్పటివరకు ఏది ఫైనల్ కాలేదు. కాని చేస్తే లవ్ స్టొరీ చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ