Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-దిల్ రాజు

Thu 18th Feb 2016 02:47 PM
dil raju interview,sunil,krishnashtami,vasu varma  సినీజోష్ ఇంటర్వ్యూ-దిల్ రాజు
సినీజోష్ ఇంటర్వ్యూ-దిల్ రాజు
Advertisement
Ads by CJ

''రీషూట్స్, రీ ఎడిటింగ్స్, రీవర్క్ చేయడం మంచిదే. సినిమా అవుట్ పుట్ కోసం ఎలాంటి వర్క్ చేసినా తప్పులేదు.. 'కృష్ణాష్టమి' సినిమా కోసం నేను ఎలాంటి రీషూట్స్ చేయలేదు కాని రీ ఎడిటింగ్స్ చేశాను.. అంటూ ఫిబ్రవరి 19న విడుదలవ్వబోయే 'కృష్ణాష్టమి' చిత్ర విశేషాల గురించి నిర్మాత దిల్ రాజు విలేకర్లతో ముచ్చటించారు.

రిలీజ్ చేయడం లేట్ అయింది..

నిజానికి 'కృష్ణాష్టమి' సినిమా షూటింగ్ ఆగస్ట్ లోనే పూర్తయింది. సెప్టెంబర్ లో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమా రిలీజ్ ఉండడం వలన అక్టోబర్ లో 'కృష్ణాష్టమి' విడుదల చేయాలనుకున్నాం. కాని ఆ సమయంలో వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంత అనుభవం ఉండి రాంగ్ డేట్ లో సినిమాను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని భావించి ఈ నెల 19 కి వాయిదా వేశాను.

బన్నీ చేయాల్సింది కానీ..

గోపీచంద్ మలినేని 'పండగ చేస్కో' సినిమాకు ముందు ఈ సినిమా కథ చెప్పాడు. బావుందని అల్లు అర్జున్ కి వినిపించాను. ఆర్య, పరుగు లాంటి సినిమాల తరువాత మన కాంబినేషన్ లో వచ్చే సినిమా కొత్తగా ఉండాలని బన్నీ భావించాడు. నేను కూడా బన్నీ చెప్పింది ఆలోచించాను. మేమిద్దరం చాలా ఓపెన్ గా డిస్కస్ చేసుకుంటాం. 

సునీల్ కి చెప్పగానే ఫ్రీజ్ అయ్యాడు..

వాసువర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే బావుంటుందని తనకి స్టొరీ చెప్పాను. ఆ కథను తను డెవలప్ చేస్తూ.. ఇంకా స్ట్రాంగ్ గా చేశాడు. నిజానికే అప్పుడు వాసు వర్మ సాయి ధరం తేజ్ తో 'లవర్' అనే సినిమా చేస్తున్నాడు. ఇక తేజుని 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాకు షిఫ్ట్ చేసి వాసుతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాను. సునీల్ కు స్టొరీ చెప్పగానే ఫ్రీజ్ అయ్యాడు. ఈ సినిమా కోసం మరే ప్రాజెక్ట్ ఒప్పుకోనని ఎనబై శాతం సినిమా షూటింగ్ అయ్యే వరకు ఏ సినిమా ఒప్పుకోకుండా ఈ సినిమా కోసమే వర్క్ చేశాడు.

ఆ ఇద్దరి విషయంలో తప్పు జరిగింది..

నా బ్యానర్ నుండి పరిచయమయిన సుకుమార్, వంశీ పైడిపల్లి, భాస్కర్, శ్రీకాంత్ అడ్డాల, బోయపాటి శ్రీను లాంటి     వాళ్ళు ఈరోజు మంచి స్థానంలో ఉన్నారు. కాని వాసు, వేణు శ్రీరాం విషయంలో మాత్రం పొరపాటు జరిగింది. వాసు వర్మ నాతో దిల్, ఆర్య, బొమ్మరిల్లు నుండి ట్రావెల్ చేస్తున్నాడు. తనలో మంచి టాలెంట్ ఉంది. అలాంటి తనతో 'జోష్' సినిమా చేయడం మిస్టేక్ అయింది. ఆ సమయంలో కాలేజీలలో ఎలాంటి ఎలక్షన్ గొడవలు లేవు.. లేని ఒక ఇష్యూని తీసుకొని జనాలపై రుద్దాలనుకోవడం పొరపాటు. అంతేకాకుండా లెజెండరీ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోను సెలెక్ట్ చేసుకోవడం తప్పు. తనపై చాలా అంచనాలు ఉంటాయి. అదే సమయంలో వైఎస్ఆర్ చనిపోవడం ఈ కారణాల వల్ల ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. అయినా ఆ తప్పులు హీరోల వలనో, దర్శకుల వలనో జరిగినవి కావు. ప్రొడ్యూసర్ గా అది నా తప్పు.

అలా అయితే నేను కూడా బెస్ట్ రిజల్ట్ ఇస్తా..

రాజ్ కుమార్ హిరానీ లాగా రెండు సంవత్సరాలకు ఒక సినిమా తీయాలంటే నేను కూడా బెస్ట్ రిజల్ట్ ఇస్తాను. కాని నాకు సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. అలాంటప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తూ ఉండాలి. ఆడియన్స్ కు ఎలాంటి సినిమాలు చేస్తే నచ్చుతుందో నన్ను నేను అప్ గ్రేడ్ చేసుకుంటూ.. సినిమాలు చేస్తాను. 

షాకింగ్ సర్ప్రైజ్ గా ఉంటుంది..

సునీల్ నటించిన 'అందాల రాముడు','పూల రంగడు' సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొత్తగా ఉంటుంది. తనలో ఉండే ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా హీరోయిజం ఎలివేట్ ట్రీట్ చేశాం. ఆ ట్రీట్మెంట్ ప్రేక్షకులకు షాకింగ్ సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అదే నమ్మి సినిమాను చేశాను. వర్కవుట్ అవుతుందనే భావిస్తున్నాను.

రీషూట్స్, రీ ఎడిటింగ్స్ చేయడం తప్పులేదు..

సినిమా అవుట్ పుట్ కోసం రీషూట్స్, రీ ఎడిటింగ్స్, రీవర్క్ చేయడం మంచిదే. 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాకు 17 రోజులు రీషూట్ చేశాం. 'కేరింత' సినిమా కూడా ముప్పై రోజులు షూట్ చేసిన తరువాత నచ్చక మొత్తం రీషూట్ చేశాం. కాని ఈ సినిమాకు మాత్రం ఎలాంటి రీషూట్స్ చేయలేదు కాని రీ ఎడిటింగ్స్ చేశాను. ఆడియన్స్ డబ్బులు ఇచ్చి వాళ్ళ సమయాన్ని కూడా మనకు ఇస్తున్నారు. అలాంటప్పుడు రెండు గంటల పాటు వారిని ఎంగేజ్ చేసే బాధ్యత మాపై ఉంటుంది. 

కొత్తగా ఉంటుందని చెప్పను..

ఈ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పను కాని ఖచ్చితంగా ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంటుంది. సింపుల్ స్టొరీ.. పక్క వాళ్లకు సమస్య వస్తేనే దాన్ని సాల్వ్ చేసే వ్యక్తి.. తనకు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరిస్తాడో అనేదే కథ. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీశాం. 

ఇక నేనే రివ్యూలు రాస్తా..

డెబ్బై శాతం ఆడియన్స్ కు సినిమా నచ్చితే అది హిట్ కిందే లెక్క. ఆడియన్స్ కు సినిమా నచ్చితే రివ్యూల గురించి అసలు పట్టించుకోరు. ఇకపై నా సినిమా రివ్యూ గురించి సినిమా రిలీజ్ కు ముందురోజు నేనే రాస్తా.. 

కృష్ణవంశీ సినిమా మూడు భాషల్లో..

మా బ్యానర్ లో కృష్ణవంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాం. 'రుద్రాక్ష' టైటిల్ అనే వార్తలు వినిపిస్తున్నాయి కాని ఆ టైటిల్ పెట్టకపోవచ్చు. ఆ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో బైలింగ్యువల్ చేస్తున్నాం. హిందీలో మాత్రం డబ్ చేస్తున్నాం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్...

ప్రస్తుతం 5 నుండి 6 ప్రాజెక్ట్స్ వర్కింగ్ లో ఉన్నాయి. నాతో పాటు శిరీష్, హర్షిత్ కూడా ప్రాజెక్ట్స్ చూసుకుంటున్నారు. ఇక నుండి సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ