ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. 'అందాల రాక్షసి' వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిభ్రవరి 12న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడితో సినీజోష్ ఇంటర్వ్యూ...
అందుకే లేట్ అయింది..
'అందాల రాక్షసి' సినిమా 2012లో విడుదలైంది. ఆ తరువాత యాక్షన్ లవ్‌స్టోరీని తెరకెక్కించాలని సంవత్సరంన్నర పాటు ఓ కథ తయారు చేసుకుని ఆ కథతో జర్నీ చేశాను. కాని అది జరగలేదు. దాని తర్వాత రాసుకున్న కథే 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. అందువలనే లేట్ అయింది.
ఆ కథ నానికే ముందు చెప్పాను...
నేను డైరెక్ట్ చేసిన 'అందాల రాక్షసి' సినిమా కథను ముందు నానికే చెప్పాను. అలాగే మరొక కథను కూడా చెప్పాను. రెండు కథలు తనకు ఎందుకో నచ్చలేదు. ఆ తర్వాత ఈ కథ తయారు చేసుకుని నానికి వినిపించాను. తనకు బాగా నచ్చింది.
నేను అలా కథ రాసుకోను...
కామన్ మ్యాన్‌ను బేస్ చేసుకుని కథలు రాసుకుంటాను. అందులో భాగంగా నాని దృష్టిలో పెట్టుకునే రాసుకుంటాను. నేను ఓ చోట కూర్చొని కథ రాసుకునే టైప్ కాదు. చాలా సార్లు ఓ వ్యక్తితో డిస్కషన్ పెట్టుకున్న తరువాతే రాసుకుంటాను. అలాగే నానితో ఈ సినిమా విషయమై ట్రావెల్ చేశాను. డిస్కషన్స్ చేశాను. ఓ ఐడియాతో సినిమా కథ డెవలప్ చేశాను. పెద్ద హిట్ కొట్టేయాలని సినిమా చేయను. వర్క్ సాటిస్ఫ్యాక్షన్ కోసం చేస్తాను.
ఇదొక లవ్ జర్నీ...
'కృష్ణగాడి వీర ప్రేమగాథ' కంప్లీట్ ఎంటర్‌టైనర్. దానితో పాటు స్ట్రాంగ్ లవ్‌స్టోరీ ఉంటుంది. జర్నీ అంతా లవ్ కారణంగానే సాగుతుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో చెప్పిన పాయింట్ 20 ఏళ్ళుగా ఎవరు టచ్ చేయలేదు.
ఇద్దరు బాగా నటించారు..
ఈ సినిమాలో నాని హీరోగా ఎక్కడా కనపించడు. కృష్ణ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. మెహరీన్ తెలుగు అమ్మాయి కాకపోయినా డైలాగ్స్ బాగా చెప్పింది. అలాగే పిల్లలు మైని, మోక్ష, శ్రీ ప్రథమ్ చక్కగా నటించారు. షూటింగ చేసేటప్పుడు ప్రతిరోజు ఛాలెంజింగ్‌గా చేశాను. కథలో భాగంగా ఎక్కువ పార్ట్ అవుట్‌డోర్‌లో చిత్రీకరించాం. లైవ్ లోకేషన్స్ లో చేయడం అనుకున్నంత ఈజీ కాదు.
అసలు జైబాలయ్య అనుకోలేదు..
ఈ సినిమాలో నాని బాయ్య అభిమానిగా కనిపిస్తాడు. అయితే 'జై బాలయ్య' అనే టైటిల్ వినపడింది కానీ మేం ముందు నుండి జై బాలయ్య అనే టైటిల్ అనుకోలేదు. సినిమాలో ఫ్యాక్షన్ ఉంటుంది కానీ పునాదిలా ఉంటుంది. అంటే ఇంటి పునాది మనకు కనపడదు కదా, అలాగే ఇందులో కనపడదు. అక్కడి మనుషులు, పరిస్థితులను చూపించాం.
రథన్ తో ఎలాంటి గొడవ లేదు..
ఈ సినిమాకు రథన్ మ్యూజిక్‌ను చేంజ్ చేయడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. చేంజ్ ఉండాలనే ఉద్దేశంతోనే విశాల్ చంద్రశేఖర్‌ను తీసుకున్నాను. నాకు, రథన్ మధ్య గొడవలేం లేవు. నా తదుపరి సినిమాకి అతనితో వర్క్ చెయ్యొచ్చు.
నెక్స్ ట్ ప్రాజెక్ట్స్..
'కవచం' అనే సినిమా చేస్తున్నాను.. ఇంకా కాస్టింగ్ ఎవరు ఫైనల్ కాలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.