Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-నాని

Wed 10th Feb 2016 01:23 PM
nani interview,krishnagadi veerapremagada,releasing on february 12th  సినీజోష్ ఇంటర్వ్యూ-నాని
సినీజోష్ ఇంటర్వ్యూ-నాని
Advertisement
Ads by CJ

'ఎవడే సుబ్రహ్మణ్యం','భలే భలే మగాడివోయ్' వంటి వరుస విజయాల తరువాత నాని నటిస్తోన్న మరో సినిమా 'కృష్ణగాడి వీరప్రేమగాథ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నానితో సినీజోష్ ఇంటర్వ్యూ..

జానపద ఫీల్ ఉంటుందని పెట్టాం..

నిజానికి సినిమా టైటిల్ పెట్టడానికి కష్టమైంది. చాలా టైటిల్స్ అనుకున్నాం. కాని ఏది సెట్ కాలేదు. అసలు సినిమా దేని గురించి..? దాని కథేంటి..? అని ఆలోచించగానే టైటిల్ లోనే కథ అర్ధమయ్యే విధంగా 'కృష్ణగాడి వీరప్రేమగాథ' అనుకున్నాం. ఆ టైటిల్ లో కూడా మంచి జానపదం ఫీల్ కలిగింది. అనంతపురం, హిందూపూర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను టచ్ చేసి చాలా రోజులయ్యింది. రియల్ లోకేషన్స్ కి వెళ్లి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఈ మధ్య ఎలాంటి సినిమాలు రాలేదు. ఆథెంటిక్ ఫీల్ కలగాలని టైటిల్ లో కూడా లెంగ్థ్ ఉండేలా చూసుకున్నాం. 

కృష్ణగాడి లవ్ స్టొరీ..

మహాలక్ష్మి అంటే కృష్ణగాడికి ప్రాణం. 15 ఏళ్ళ నుండి తనను ప్రేమిస్తూ ఉంటాడు. కాని ఆ విషయం కనీసం తన బెస్ట్ ఫ్రెండ్ కు కూడా చెప్పుకోలేని పరిస్థితి. కృష్ణ పిరికివాడే కాని ఆ భయాన్ని బయటకి చూపించడు. బ్రతుకు మీద ఆశ ఉన్నవారికే భయం అనేది ఉంటుంది. భయం అనేది చాలా విలువైనది. వాడి భయమే తన ప్రేమకు అడ్డమైతే ఆ భయాన్ని, ధైర్యంగా ఎలా మార్చుకొని తన ప్రేమను గెలుచుకున్నాడనేదే ఈ సినిమా. సినిమాలో ట్విస్టులు, టర్న్స్ చాలా ఉంటాయి. ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఇప్పటివరకు చూడని విధంగా ఉంటాయి. 

బాలయ్య అభిమానిగా..

సినిమాలో నేను బాలయ్య అభిమానిని. స్టొరీకి దానికి ప్రోపర్ లింక్ ఉంటుంది. హిందూపూర్ లో బాలయ్య గారికి అందరూ అభిమానులే. సినిమాలో నా ఇంట్రడక్షన్ సీన్ లో కూడా ఒక సంఘటనలో ఇరుక్కొని బాలయ్య పేరు చెప్పి ఎలా బయటపడతానో ఉంటుంది. నేను బాలకృష్ణ గారికి అభిమానినైతే ఎలా ఉంటానో.. అలానే సినిమాలో నటించాను. ఎవరినో చూసి ఇమిటేట్ చేయలేదు.

బాలకృష్ణ గారు ఎగ్జైట్ అయ్యారు..

ఈ సినిమా గురించి తెలుసుకొని బాలకృష్ణ గారు బాగా ఎగ్జైట్ అయ్యారు. ఏంటయ్యా.. సినిమాలో నా అభిమానిగా నటిస్తున్నావంట కదా అనడిగారు. నేను హిందూపూర్ లో ఉన్నప్పుడు షూటింగ్ జరిగితే చెప్పు. ఖచ్చితంగా వస్తానని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే ఆయన చూస్తారు. అందరికి నచ్చే సినిమా. బాలయ్య ఫ్యాన్స్ కి ఈ సినిమా బోనస్ గా ఉంటుంది.

ఎవరు బాగా చేస్తే వాళ్ళే..

నాకు రియల్ లైఫ్ లో నచ్చే నటుడు కమల్ హాసన్. ఏ సినిమాలో ఎవరు బాగా చేస్తే వాళ్ళే నచ్చుతారు.

'అందాల రాక్షసి' సినిమా కోసం అడిగారు..

హను నాకు మొదట 'అందాల రాక్షసి' సినిమాలో నటించమని స్టొరీ వినిపించాడు. ఎందుకో నాకు ఆ కథ కనెక్ట్ కాలేదు. నాని సినిమాలా అనిపించలేదు. నన్ను దృష్టిలో పెట్టుకునే హను కథ రాశాడు.  ఆ తరువాత కూడా రెండు, మూడు కథలు చెప్పాడు. కాని నా టేస్ట్ కి ఏది సెట్ కాలేదు. అప్పుడు నాతో కూర్చొని ఎలాంటి సినిమా కావాలని డిస్కస్ చేశాడు. ఆ డిస్కషన్ లో పుట్టిందే ఈ 'కృష్ణగాడి వీరప్రేమగాథ'. 

ఎలాంటి ప్రెషర్ లేదు..

ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఎలాంటి ప్రెషర్ లేదు. లాస్ట్ రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఈ సినిమా ఏమవుతుందనే టెన్షన్ ఉండేది. అయితే సక్సెస్, ఫెయిల్యూర్ ని పక్కన పెడితే ప్రతి సినిమాకు ఎఫర్ట్ పెట్టి పని చేయాలి. 20 ఏళ్ళ క్రితం ఉండే ఆడియన్స్ ఒక హీరోను అభిమానిస్తే ఎలాంటి సినిమా చేసిన మనవాడే అనే ఫీలింగ్ లో ఉండేవారు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రతి శుక్రవారం యాక్టర్ అనేవాడు తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి.   

ఆ సినిమాతో బాధ్యత పెరిగింది..

ఇప్పుడు ప్రేక్షకుల్లో, వారు సినిమా చూసే విధానంలో మార్పు వచ్చింది. కంటెంట్ ఉంటేనే సినిమాను ఆదరిస్తున్నారు. 'భలే భలే మగాడివోయ్' సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి మేమే షాక్ అయ్యాం. ఓవర్సీస్ లో టాప్ సినిమాల లిస్టులోకి చేరిపోయింది. ఆ సినిమాతో నాపై భాద్యత ఇంకా పెరిగింది.

రెమ్యునరేషన్ పెంచనా..

నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేప్పుడు మొదటిసారి 2500 జీతం తీసుకున్నాను. ఆ తరువాత 3500 తీసుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే రెమ్యునరేషన్ పెంచారు. యాక్టర్ అయ్యాకా పెంచనా..?(నవ్వుతు..)

మణిరత్నం సినిమా ప్రస్తుతం లేదు..

మణిరత్నం గారి సినిమాలో నటించాలనుకున్నాను. కాని ఆ సినిమా కథ ఒక హిందీ సినిమా కథకు దగ్గరగా ఉందని ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆయన వేరే స్క్రిప్ట్ పనిలో ఉన్నారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారితో ఒక లవ్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తున్నాను. అది కాకుండా విరించి డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నాను. ఇక నుండి 5నెలలకు ఒక సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నా అంటూ ఇంటర్వ్యూ ముగించారు.     

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ