Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-బెల్లంకొండ శ్రీనివాస్

Thu 04th Feb 2016 04:48 PM
bellamkonda srinivas interview,bheemaneni srinivas,speedunnodu movie  సినీజోష్ ఇంటర్వ్యూ-బెల్లంకొండ శ్రీనివాస్
సినీజోష్ ఇంటర్వ్యూ-బెల్లంకొండ శ్రీనివాస్
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు శీను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 2014లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత సుమారుగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న ఈ నటుడు కొత్త సంవత్సరంలో(2016) 'స్పీడున్నోడు' చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ..

తమిళంలో సూపర్ హిట్ అయిన 'సుందరపాండ్యన్' సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. తమిళంలో ఈ సినిమాను చూసినప్పుడు బాగా కనెక్ట్ అయ్యాను. ఫ్రెండ్స్ కు సంబంధించిన కథ. నాకు రియల్ లైఫ్ లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ లేని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. క్లైమాక్స్ అధ్బుతంగా ఉంటుంది. సినిమా చూసిన తరువాత ఒక్క నిమిషమయినా ఆలోచిస్తారు. 

ఎవరికైనా సూట్ అవుతుంది..

ఈ కథ ఎవరికైనా సూట్ అవుతుంది. ఇప్పుడున్న ఏ హీరో అయినా కథకు సెట్ అవుతాడు. మెచ్యూర్డ్ ఆర్టిస్ట్, యంగ్ పెర్సన్స్ ఎవరైనా నటించొచ్చు. రీమేక్ సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో సినిమా చేయలేదు. 'అల్లుడు శీను' తరువాత దాదాపు ముప్పై నుండి నలభై కథలు విన్నాను. కాని ఏది నన్ను సంతృప్తి పరచలేదు. భీమనేని గారు ఈ సినిమా కథ వినిపించగానే బాగా నచ్చింది. చాలా ప్లాన్ చేసుకొని సినిమా చేశాం. అవుట్ పుట్ చూసిన తరువాత సంతోషపడ్డాం. ప్రొడక్ట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నాం.

తమన్నానే హీరోయిన్ అనుకున్నాం..

మొదట ఈ సినిమా కోసం హీరోయిన్ గా తమన్నానే అనుకున్నాం. కాని కథకు ఫ్రెష్ ఫేస్ అయితే బావుంటుందని సొనారిక ను సెలెక్ట్ చేసుకున్నాం. తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించాలనుకున్నాం. తను బెస్ట్ డాన్సర్. నాకు మంచి ఫ్రెండ్ కూడా..

10 రెట్లు ఎక్కువ కష్టపడ్డా..

నా మొదటి సినిమా 'అల్లుడు శీను' కంటే ఈ సినిమా కోసం 10 రెట్లు ఎక్కువ కష్టపడ్డాను. హెయిర్ స్టైల్, మేకప్, డ్రెస్సింగ్, నా హావభావాలు ఇలా ప్రతి విషయంలో కొత్తగా కనిపిస్తాను.

కర్నూల్ కుర్రాడిలా..

ఈ సినిమాలో యంగ్, ఎనర్జిటిక్ క్యారెక్టర్ నాది. కర్నూలుకు చెందిన కుర్రాడిలా కనిపిస్తాను. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసే పాత్ర. అమ్మయిల విషయంలో ఎక్స్ పర్ట్ అయిన తనను ఫ్రెండ్స్ అందరూ సలహాలు అడుగుతూ ఉంటారు. 

ఫ్రెండ్స్ కు సినిమా చూపించాను..

స్నేహితులకు సంబంధించిన సినిమా కనుక నా ఫ్యామిలీకు, స్నేహితులందరికీ కలిపి సినిమా చూపించాను. నాన్న గారు సినిమా చూసిన వెంటనే గట్టిగా కౌగిలించుకున్నారు. అమ్మ అసలు తన ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేయలేకపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ క్లైమాక్స్ చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. 

ప్యాషన్ ఉన్న డైరెక్టర్..

సీనియర్ డైరెక్టర్స్ తో పని చేసేప్పుడు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. భీమనేని గారు ఎందరో స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. ఆ గర్వం ఆయనలో ఎప్పుడు చూడలేదు. ఏ సినిమా అయిన తన మొదటి సినిమాలాగా కష్టపడి చేస్తారు. సినిమా పట్ల ప్యాషన్ ఉన్న దర్శకుడు. కథను ఇంకా బెటర్ గా ఎలా తీయాలని ఆలోచిస్తుంటారు.

టెక్నీషియన్స్ అందరి కష్టం ఈ సినిమా..

వసంత్ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందరిని ఆకట్టుకుంది. నేను, వసంత్, ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్ ఇలా ప్రతి ఒక్కరు చాలా కష్టపడి వర్క్ చేశారు. టెక్నీషియన్స్ అందరి కష్టం ఈ సినిమా.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

బోయపాటి గారి దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో నటించడానికి అంగీకరించాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ