Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-భీమనేని శ్రీనివాస్

Tue 02nd Feb 2016 05:39 PM
bheemaneni srinivas interview,speedunnodu movie,bellamkonda sai srinivas  సినీజోష్ ఇంటర్వ్యూ-భీమనేని శ్రీనివాస్
సినీజోష్ ఇంటర్వ్యూ-భీమనేని శ్రీనివాస్
Advertisement
Ads by CJ

'శుభాకాంక్షలు','సుస్వాగతం','సూర్యవంశం',' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు భీమనేని శ్రీనివాస్. ఆయన దర్శకత్వం వహించిన 'సుడిగాడు' సినిమా తరువాత దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఒకే స్క్రిప్ట్ మీద వర్క్ చేసి తెరకెక్కించిన సినిమా 'స్పీడున్నోడు'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 5న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాస్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

మనసు పెట్టి చేసిన సినిమా..

'సుందరపాండ్యన్' సినిమా తమిళంలో, కన్నడలో చాలా పెద్ద హిట్ అయింది. మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టు. అందుకే తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాం. నేను డైరెక్ట్ చేసిన 'సుస్వాగతం' , 'సూర్యవంశం', 'శుభాకాంక్షలు' తరువాత అంత మనసుపెట్టి చేసిన సినిమా ఇది. 'సుడిగాడు' తరువాత దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం పని చేశాను. ప్యాషనేట్ గా మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాను. తమిళంలో ఈ సినిమాను న్యాచురల్ గా తీశారు. తెలుగులో కూడా అదే విధంగా ప్రెజంట్ చేస్తే కొంతమందికి కనెక్ట్ అవ్వదని తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా  దానికి కామెడీ, ఎమోషన్స్ ను జోడించాం. 

ఆ సోల్ అనేది మిస్ అవ్వదు..

ప్రతి సినిమాకు ఒక సోల్, హార్ట్ ఉంటాయి. తమిళంలో నేను ఈ సినిమా చూసినప్పుడు బాగా టెంప్ట్ అయ్యాను. వెంటనే రీమేక్ రైట్స్ తీసుకున్నాను. తెలుగులో ఆ సోల్ అనేది మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా అందరికి నచ్చే సినిమా అవుతుంది.

వసంత్ కూడా నాతోనే ట్రావెల్ చేశాడు..

నేను సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని మూడు సంవత్సరాలు అయింది. సుడిగాడు హిట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ మీదే వర్క్ చేశాం. నా ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సుడిగాడు సినిమాకు వసంత్ నేను కలిసి వర్క్ చేశాం. ఆ సినిమా కూడా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు కూడా తనే మ్యూజిక్ అందించాడు. నాతో పాటు మూడు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. సినిమాలో ప్రతి పాట ఎంతో కేర్ తీసుకొని చేశాం. ఈరోజు ఆడియో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆడియోలానే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. 

శ్రీనివాస్ చాలా బాగా నటించాడు..

మొదట ఈ సినిమాలో హీరోగా చాలా మందిని అనుకున్నాం. రవితేజ, సునీల్ ఇంకా మరికొంతమంది హీరోలను సంప్రదించాం. కాని రెమ్యునరేషన్, డేట్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం వలన కుదరలేదు. అయితే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించిన 'అల్లుడు శీను' సినిమా చూశాను. తను డాన్సులు, ఫైట్స్, ఎనర్జీ చూసి ఈ సినిమాకు తనే యాప్ట్ అనుకున్నాను. వేరే హీరోలు చేస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేను కాని కేవలం ఒక సినిమా అనుభవంతో ఈ సినిమాలో అధ్బుతంగా నటించి సినిమా బాగా రావడానికి కారణమయ్యాడు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఒక హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి.

ఇప్పటివరకు ఈ యాంగల్ లో సినిమా రాలేదు..

స్నేహం గురించి ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నింటిలో ఈ సినిమా అల్టిమేట్ గా నిలుస్తుంది. ఎవరు టచ్ చేయని ఓ డైమెన్షన్ ను ఇందులో టచ్ చేశాం. ఫ్రెండ్స్ లేని వారెవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఓ ఐదుగురు స్నేహితులు చదువు పూర్తయ్యాక ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు. ఒక అమ్మాయి వలన ఐదు సంవత్సరాల మళ్ళీ కలుస్తారు. ఆ సమయంలో వారికి ఎదురైన సమస్యలను ఎలా ఎడుర్కొన్నారనేదే సినిమా కథ.

ప్రొడ్యూస్ చేయాలనేది నా ఇంటెంన్షన్ కాదు..

దర్శకుడిని అవ్వాలనే ఇండస్ట్రీకి వచ్చాను. అదే నా ప్యాషన్. నిర్మాత అవ్వాలనే కోరిక నాకు లేదు. కొన్ని పరిస్థితుల్లో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. నన్ను నేను ప్రూవ్ చేసుకొని సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి ప్రొడ్యూస్ చేశాను. నేను హిట్ సినిమాలు చేయలేదని చెప్పట్లేదు. రీమేక్ సినిమా తెలుగు నేటివిటీకి సెట్ అవుతుందా..? అని కొందరికి అనుమానాలు ఉండడం వలన నేనే నిర్మాతగా మారాను. సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుందో నాకు తెలుసు. ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుందాం అనుకున్నాను.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ..

సినిమా షూటింగ్ హైదరాబాద్ చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో నిర్వహించాం. క్లైమాక్స్ షెడ్యూల్ మాత్రం కర్నూలులో చేశాం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ.

నేను అడిక్ట్ అయిపోయాను..

రీమేక్ సినిమాలే ఎందుకు చేస్తున్నారని అడిగితే అడిక్ట్ అయిపోయాననే చెప్పాలి. రీమేక్ సినిమాలు బాగా చేయగలనని నా మీద ఒక ముద్ర పడిపోయింది. మరో డైమెన్షన్ ప్రూవ్ చేసుకునే వరకు రీమేక్స్ చేస్తూనే ఉంటాను. దర్శకునిగా నాకు కూడా స్ట్రెయిట్ సినిమా చేయాలనుంది. మంచి కథ దొరికితే ఖచ్చితంగా చేస్తాను. 

అదొక స్పెషల్ సాంగ్..

ఈ సినిమాలో ప్రతి పాటను పెద్ద బడ్జెట్ లో చిత్రీకరించాం. ఒక్క తమన్నా పాటకే రెండు కోట్ల ఖర్చయింది. ఐటెం సాంగ్స్ లో ఒక యూనిక్ సాంగ్ గా ఈ పాట మిగిలిపోతుంది. ఐటెం సాంగ్ కంటే ఓ స్పెషల్ సాంగ్ అని చెప్పొచ్చు. షూట్ చేసిన తరువాత తమన్నా పాట చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది.

బడ్జెట్ పెరిగింది..

మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. మూడు నెలల ముందే సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ నాకు మంచి ఫ్రెండ్స్. ప్రాఫిట్స్ వస్తే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం.

సుడిగాడు సీక్వెల్ ఉండదు..

ఇప్పుడైతే సుడిగాడు 2 సినిమా చేసే ఆలోచన లేదు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. ఇది పూర్తయిన తరువాతే మరో సినిమా గురించి ఆలోచిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ