Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- యంగ్ టైగర్ ఎన్టీఆర్

Tue 12th Jan 2016 03:04 PM
ntr interview,nannaku prematho movie,sukumar,janatha garage  సినీజోష్ ఇంటర్వ్యూ- యంగ్ టైగర్ ఎన్టీఆర్
సినీజోష్ ఇంటర్వ్యూ- యంగ్ టైగర్ ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

ఒక్కప్పుడు సినిమాలు వెయ్యి రోజులు ఆడేవి. ఆ సంఖ్య కాస్త మా జెనరేషన్ కు వచ్చేప్పటకి 175 రోజులకు చేరుకుంది. ఆ తరువాత యాభై రోజులు, ఇరవై ఐదు రోజులు ఇప్పుడు 14 రోజులకు చేరుకుంది. పండగ సీజన్ అనేది సినిమా రెవెన్యూకి చాలా ముఖ్యం. అందుకే సంక్రాంతి కానుకగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని విడుదల చేస్తున్నామని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మాటల్లో చెబుతున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..

రాత్రింబవళ్ళు కష్టపడి చేశాం..

'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో రాత్రింబవళ్ళు కష్టపడి పని చేశాం. సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తే అడ్వాంటేజ్ అవుతుందనే ఆలోచనతో జనవరి 13న రిలీజ్ కు ప్లాన్ చేశాం. బాక్సాఫీస్ రికార్డ్స్ ఏవో బ్రేక్ చేయాలని, మరొక ఆలోచనతో సినిమా చేయలేదు. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఇంటెన్షన్ తో చేశాం. ఫ్యూచర్ లో నాకు కూడా మంచి సినిమా చేశాననే త్రుప్తి ఉండాలని చేశాను.

నాలుగు సినిమాలు హిట్ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు..

నేను నటించిన 'అదుర్స్' సినిమా రిలీజ్ అప్పుడు 'శంభో శివ శంభో' , 'నమో వెంకటేశా' సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్, సమ్మర్ సీజన్, దసరా సీజన్ చాలా ముఖ్యమైనవి. సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు హిట్ అయిన రోజులు ఉన్నాయి. స్టూడెంట్ నెం 1 సినిమా రిలీజ్ తరువాత వారం వ్యవధిలో ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు హిట్టే. సో.. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నాలుగు సినిమాలు హిట్ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు. 

మెయిన్ మార్క్ సుకుమార్..

నా కెరీర్ లో 25వ సినిమా అనే మార్క్ తో 'నాన్నకు ప్రేమతో' చేయలేదు. మెయిన్ మార్క్ సుకుమార్. తనతో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. సుకుమార్ తో చేయడం చాలెంజింగ్ గా ఉంటుంది. 25వ సినిమా అని చెప్పి ప్రేక్షకులను మోసం నాకిష్టం లేదు. జెన్యూన్ గా ఒక కథ చెప్పాలని చేశాం.

సుకుమార్ ఫ్లాప్ కి కూడా రెస్పెక్ట్ ఉంటుంది..

లండన్ లో సినిమా షూట్ చేయడానికి ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉదయం 5 గంటలకు లేచి 7 గంటలకు షూట్ మొదలు పెట్టేసేవాళ్ళం. సుకుమార్ నాకు తెలిసి ఒక రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవారు. ఎప్పుడు సినిమా గురించి, సీన్ ఎలా తీయాలనే ఆలోచన తప్ప ఆయన మైండ్ లో మరొకటి ఉండదు. తన జాబ్ ను ప్రేమిస్తాడు. తనలా మరెవరు ఉండరేమో.. సుకుమార్ సినిమా ఫ్లాప్ అయినా కథ బాలేదని ఎవరు అనలేరు. తన ఫ్లాప్ కి కూడా రెస్పెక్ట్ ఉంటుంది.

కథనం కొత్తగా ఉంటుంది..

ఇదొక సింపుల్ స్టొరీ. చాలా ఎమోషన్స్ తో డీల్ చేశాం. మైండ్ గేమ్ కూడా ఉంటుంది. కథ కొత్తగా ఉంటుందని చెప్పను కాని కథనం కొత్తగా ఉంటుంది. సినిమా బ్యాక్ డ్రాప్, కొన్ని కొన్ని డైలాగ్స్, తండ్రి కొడుకుల మధ్య ఉండే రిలేషన్ చాలా బాగా చూపించారు. ఆఖరి అరగంట సినిమాకు ఆయువు పట్టు. 

లుక్ విషయంలో మొదట టెన్షన్ పడ్డాను..

ఫారెన్ లో ఉండే అబ్బాయి పాత్ర కాబట్టి కొత్తగా చూపించాలని సుకుమార్ ట్రై చేశారు. ఫారెన్ లో ఉండే ఎన్నారైలు అంతా స్టైలిష్ గా ఉంటారు. అక్కడ సుమారు అందరూ అండర్ కట్ హెయిర్ స్టైల్ విత్ బియర్డ్ తో కనిపిస్తారు. అదే విధంగా నా లుక్ కూడా మార్చేశారు. మొదట అందరికి నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడ్డాను. సుకుమార్ మీద నమ్మకంతో స్టైల్ మార్చాను. ఆ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. 

ఎఫర్ట్ గుర్తిస్తే చాలు..

మాస్, క్లాస్ అనే పదాలు నాకు నచ్చవు. ఎవరైతే ఓవర్ గా ఎక్స్ ప్రెస్ చేస్తారో వాళ్ళని మాస్ అని, ఎక్స్ ప్రెస్ చేయలేకపోతే క్లాస్ అని అంటుంటారు. నా దృష్టిలో సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉండాలి. మాస్ సినిమా, క్లాస్ సినిమా అని కాదు. మేము పెట్టే ఎఫర్ట్ ను ప్రేక్షకులు గుర్తిస్తే చాలు.

డాన్సులు చేస్తుంటే కొత్తగా లేదు..

సినిమాలో ఉండే 6 పాటలకు డాన్సులు చేయాలంటే మాత్రం నరకం చూస్తున్నా.. 16 నుండి 25 సంవత్సరాల వరకు బానే చేసేవాడ్ని. ఇప్పుడు నాకు కొడుకు కూడా పుట్టాడు. ఇప్పుడు చేయడం కష్టంగా అనిపిస్తుంది. నాకు 45  వచ్చేసరికి అసలు కాళ్ళు కూడా సరిగ్గా తిప్పలేనేమో. అయినా అన్ని పాటలకు డాన్స్ చేస్తుంటే కొత్తగా అనిపించట్లేదు. కానీ సినిమాలో ఒక్క పాటకు మాత్రం దయ్యం డాన్స్ చేసేస్తాను. 

మా నాన్న గుర్తొచ్చారు..

సినిమాలో ఉండే ఒక సీన్ కు యూనిట్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. సుకుమార్ నాకు నేరేట్ చేసేప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. సుకుమార్ చెప్తూ.. చెప్తూ.. తను ఏడ్చేశాడు. పక్కన ఉన్న మా సినిమాటోగ్రాఫర్ కూడా ఏడుస్తున్నాడు. ఆ సీన్ విన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. ఆ సీన్ లో నటించి రాజేంద్రప్రసాద్ గారిని హగ్ చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలా ఉండిపోయాను. 

2015 ఫెంటాస్టిక్ ఇయర్..

2015 సంవత్సరం నుండి ఇండస్ట్రీ మారింది. బాహుబలి, శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్ లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు హిట్స్ గా నిలిచాయి. ఒకప్పుడు చిరంజీవి గారి 'రుద్రవీణ' నాగార్జున గారి 'గీతాంజలి' వంటి కథలు ఉన్న సినిమాలను ప్రేక్షకులు చూశారు. రానురాను ఇండస్ట్రీ మారుతూ వచ్చింది. కామెడీ ట్రెండ్ నడిచింది. నేను కూడా 'రభస' , 'రామయ్య వస్తావయ్య' చిత్రాలతో రెగ్యులర్ సినిమాలనే నమ్ముకున్నాను. 'టెంపర్' సినిమా ఒక చాలెంజింగా తీసుకొని చేశాను. ఆ చాలెంజ్ లో నుండి జర్నీ పుట్టింది. అక్కడ నుండి పెర్ఫార్మన్స్ వచ్చింది. ఫైనల్ గా నాకొక దారి దొరికింది.

డేట్స్ లేక 'ఊపిరి' చేయలేకపోయా..

'ఊపిరి' సినిమాలో నన్ను నటించమని అడిగారు. కాని అప్పటికే 'నాన్నకు ప్రేమతో' సినిమా కమిట్ అయ్యాను. సో.. డేట్స్ క్లాష్ అవ్వడం వలన సినిమా చేయలేకపోయాను. వంశీ, నాగ్ లని వెయిట్ చేయించడం ఇష్టం లేదా ఆ ప్రాజెక్ట్ వొదిలేశాను. 

బలవంతంగా పాడాను..

పాటలు పాడడం మానేద్దాం అనుకున్నాను. ఎందుకో తెలియదు పాట పాడాలంటే టెన్షన్ వచ్చేస్తోంది. మా అమ్మ ముందు, నా భార్య ముందు అయితే పాడగలను కాని మైక్ పట్టుకోవాలనే భయం వేస్తోంది. దేవిశ్రీ పాట స్పెషల్ గా ఉండాలని ఫోర్స్ తో 'ఫాలో ఫాలో యు' సాంగ్ నాతో పాడించాడు. 

ఏదైనా మంచి కథ ఉంటే చేస్తా..

అదుర్స్ 2 అని కాదు ఏదైనా మంచి కథ ఉంటే చేస్తాను.

కొత్త దర్శకులకు అవకాసం ఇస్తా..

కథ నచ్చితే కొత్త దర్శకులకు ఖచ్చితంగా అవకాసం ఇస్తాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఫిబ్రవరి 10 నుండి 'జనతా గ్య్తారేజ్' సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నాం. అది కాకుండా మా బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఒక సినిమా చేయాలనుకుంటున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ