Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-చరణ్ దీప్

Wed 30th Dec 2015 02:27 PM
charan deep interview,bahubali,loafer movie,puri jagannath  సినీజోష్ ఇంటర్వ్యూ-చరణ్ దీప్
సినీజోష్ ఇంటర్వ్యూ-చరణ్ దీప్
Advertisement
Ads by CJ

అరుడుగుల విగ్రహం, చూపరులను ఆకట్టుకునే దేహధారుడ్యంతో విలనిజాన్ని కళ్లతో పలికించే రూపం చరణ్ దీప్ సొంతం. సినిమా రంగంలోకి ఇప్పుడున్న యంగ్ విలన్స్ లో తనదైన స్టయిల్ లో పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళుతున్న ఈ యంగ్ విలన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

నేపధ్యం..

మాది కడప, అయితే నేను పుట్టి పెరిగిందంతా హైద్రాబాద్ లోనే. బి.టెక్ చదివిన తర్వాత సినిమాల్లో ట్రై చేశాను. ఐదేళ్లుగా సినీ ప్రయత్నాలు చేస్తున్నాను. మధ్యలో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని సిక్స్ ప్యాక్, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుని మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ముందు నాకు తమిళంలో 'జిల్లా' చిత్రంలో విలన్ మంచి అవకాశం వచ్చింది. ఆ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ చేశాను. అంతకు ముందు రెండు మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. అయితే ఇది కరెక్ట్ కాదనే నేను గ్యాప్ తీసుకున్నాను. తర్వాత 'సిగరం తొడు' సినిమా చేశాను. అలా నేను చేస్తున్న పాత్రలకు మంచి పేరు రావడంతో మంచి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. 

విలన్ అవుదామనే వచ్చాను...

నేను ఇండస్ట్రీలోకి విలన్ అవుదామనే వచ్చాను. నూటికి తొంబై తొమ్మిది శాతం మంది హీరో అవుదామనే ఇక్కడకు వస్తారు. అయితే నేను మాత్రం విలన్ అవుదామనే వచ్చాను. ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ మెయిన్ విలన్ గా చేస్తున్నవే.   

'లోఫర్' విజిటింగ్ కార్డు అయింది..

'లోఫర్' సినిమాలో విలన్ గా నటించాను. సినిమా మంచి విజయాన్ని సాధించింది. నేను ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. లోఫర్ ఒకటి ఒక ఎత్తు. నాకొక విజిటింగ్ కార్డులాగా మారిపోయింది. పూరి గారికి ఈ విషయంలో థాంక్స్ చెప్పుకోవాలి. 

కాన్ఫిడెన్స్ పెరిగింది..

లోఫర్ సినిమాతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. పూరి గారు డైరెక్ట్ చేసిన 'గోలీమార్' సినిమా ఆడిషన్స్ కి వెళ్లాను. చివరి నిమిషంలో నన్ను రిజెక్ట్ చేసారు. అందులో చిన్న క్యారెక్టర్ అయినా.. ఆ సమయంలో నాకు అది చాలా ముఖ్యమైనది. పెద్ద డైరెక్టర్ నన్ను రిజెక్ట్ చేసాడనే బాధలో నాలో కసి పెరిగింది. ఆయనతో ఎలా సినిమా చేయాలనే పట్టుదల పెరిగింది. 'లోఫర్' సినిమా అవకాశం రాగానే పూరి గారికి మీరు ఒక్కప్పుడు నన్ను రిజక్ట్ చేసారని చెప్పారు. ఆయన సారీ చరణ్ నాకు గుర్తులేదు అని చెప్పారు. ఆయనతో ట్రావెల్ అయ్యాక నాలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. 

'బాహుబలి 2' ఉంది..

'బాహుబలి' కథ చెప్పినప్పుడు ప్రభాకర్ చనిపోయిన తరువాత కాలకేయులను నువ్వే లీడ్ చేస్తావని చెప్పారు. 2016 మార్చి నుండి షూటింగ్ మొదలు పెడుతున్నారు. అక్కడి వరకే నాకు వివరాలు తెలుసు.

వాళ్ళిద్దరి మైండ్ సెట్స్ వేరు..

రాజమౌళి, పూరి జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేసాను. వాళ్ళిద్దరి మైండ్ సెట్స్ వేరు. రాజమౌళి గారు సన్నివేశాన్ని ఎలా కనెక్ట్ చేయాలి అని ఆలోచిస్తారు. పూరి గారు సినిమా ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేస్తారు. పూరి గారితో కలిసి పని చేశాక వేరే వాళ్ళతో వర్క్ చేయడం బోరింగ్ గా అనిపిస్తుంది. పూరి గారితో వర్క్ చేయడంలో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది.

ఏ క్యారెక్టర్ అయినా చేస్తా..

విలన్ క్యారెక్టర్ అనే కాదు. నాకు ఏ పాత్ర నచ్చినా చేస్తాను. చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడను. ఏ పాత్ర అయితే ప్రేక్షకులకు రీచ్ అవుతుందనిపిస్తుందో.. అలాంటి పాత్రల్లో నటిస్తాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

సర్దార్ గబ్బర్ సింగ్ 2 కోసం అడిగారు. పాత్ర నచ్చితే చేస్తాను. చుట్టాలబ్బాయి, స్పీడున్నోడు సినిమాల్లో నటిస్తున్నాను. తమిళం నుండి ఎన్నో ఆఫర్స్ వస్తున్నాయి. శంకర్ గారి అసిస్టెంట్ తో ఒక సినిమా చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ