Advertisementt

బర్త్ డే స్పెషల్: హీరో ఆది!

Wed 23rd Dec 2015 10:30 AM
aadi birthday interview,december 23rd birthday,garam movie  బర్త్ డే స్పెషల్: హీరో ఆది!
బర్త్ డే స్పెషల్: హీరో ఆది!
Advertisement

'ప్రేమ కావాలి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన హీరో ఆది. ఆ తరువాత 'లవ్లీ','ప్యార్ మే పడిపోయా'.'గాలిపటం' వంటి చిత్రాల్లో నటించాడు. అందం, అభినయం, మంచి డైలాగ్‌ డెలివరీ, ఈజ్‌ ఉన్న ఈ హీరో తన తాజా చిత్రం 'గరం' తోనైనా హిట్‌ కొట్టాలని ఆశపడుతున్నాడు. ఆది, ఆదాశర్మ జంటగా మదన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న నిమా విడుదలకు రెడీ అవుతుంది. డిశంబర్ 23 న ఆది పుట్టినరోజు సందర్భంగా 'గరం' చిత్ర విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు. 

సినిమాలో కొత్తగా కనిపిస్తా..

'గరం'లో వారాల బాబు అనే పాత్రలో కనిపిస్తాను. తన తండ్రి ఎప్పుడూ తిడుతూ ఉండడంతో కోపంలో ఏదైనా సాధించాలని పల్లెటూరు నుండి సిటీకు వస్తాడు. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. సినిమాలో కొత్తగా కనిపించడంతో పాటు నా భాష కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈస్ట్ గోదావరికి చెందిన భాషలో మాట్లాడతాను. ఇందులో ఫైట్స్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేశారు. ఆ ఫైట్స్ చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు.

స్క్రిప్ట్ లో బాగా ఇన్వాల్వ్ అయ్యాను..

ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కథలో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. నిజానికి ఈ చిత్రం మొదట రాజ్ కుమార్ అనే వ్యక్తి నిర్మాణ సారధ్యంలో మొదలయ్యింది. కొన్ని అనివార్య కారణాల వలన ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. నాన్నగారికి చెప్పి ఆయన నిర్మాతగా ఈ చిత్రాన్ని పూర్తి చేశాం.

లేట్ అవ్వడానికి కారణాలు అవే..

నిర్మాత మధ్యలో తప్పుకోవడం వలన కొంచెం గ్యాప్ వచ్చింది. అదీ కాకుండా ఈ సినిమాలో ప్యాడింగ్ ఆరిస్ట్స్ ఎక్కువగా ఉన్నారు. మేము అనుకున్న షెడ్యూల్ లో సినిమా జరగలేదు. ఆర్టిస్ట్స్ డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ కాలేదు. దాంతో వాళ్ళంతా ఖాళీగా ఉన్న సమయంలో షూట్ చేయాల్సి వచ్చింది. అందుకే సినిమా లేట్ అయింది.

నాన్నగారి కోరిక అదే..

ఈ సినిమా మొదలయిన తరువాతే నాకు పెళ్లయింది. అప్పుడే నాకు కూతురు కూడా పుట్టేసింది కాని సినిమా మాత్రం రిలీజ్ అవ్వలేదు. నేను ఇది అసలు గమనించలేదు. నా కూతురు పుట్టిన తరువాత రిలీజ్ అవుతున్న ఈ చిత్రం నాకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నాను. నిర్మాతగా నాన్నగారికి కూడా మంచి లాభాలు తీసుకురావాలి. ఈ సినిమానే కాకుండా నాన్నగారు మరిన్ని సినిమాలను రూపొందిచాలని ఆలోచిస్తున్నారు. రెగ్యులర్ చిత్రాలు కాకుండా ప్రేక్షకులను అలరించే సినిమాలు తీయాలన్నదే ఆయన కోరిక.

తల్లితండ్రుల మీద గౌరవం రెట్టింపయ్యింది..

తండ్రినయ్యాననే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది. నా కూతురు పుట్టగానే ఎత్తుకున్నప్పుడు అద్భుతమైన అనుభూతి కలిగింది. అప్పుడే నా తల్లితండ్రుల మీద గౌరవం రెట్టింపయ్యింది. చిన్నప్పుడు వాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చుసుకున్నారో అర్ధమయింది. 

మొదటి షో డిసైడ్ చేస్తుంది..

నాకు తెలిసిన హీరోలందరి కెరీర్ లో వారు నటించిన ఏడవ సినిమా హిట్ గా నిలిచింది. అలానే నా కెరీర్ లో కూడా ఇది ఏడవ సినిమా కాబట్టి ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నాను. సినిమా హిట్ అయిందో, ఫ్లాప్ అయిందో మొదటి షో డిసైడ్ చేస్తుంది. అప్పటివరకు సినిమా పరిస్థితి ఏంటనేది ఎవరు ఊహించలేరు.

తన డాన్స్ చూసి ఆశ్చర్యపోయా..

ఈ సినిమాలో నాకు జోడీగా ఆదాశర్మ నటించింది. సినిమాలో తను ముస్లిం అమ్మాయిగా బురఖాలోనే కనిపిస్తుంది. బురఖాలో కూడా చాలా అందంగా ఉందనుకుంటారందరూ.. అలానే సినిమాలో నాతో పోటీగా డాన్స్ చేసింది. తనలా డాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

వీరభద్రమ్ గారి డైరెక్షన్ లో 'చుట్టాలబ్బాయి' సినిమాలో నటిస్తున్నాను. ఇప్పటికి నలభై శాతం షూటింగ్ పూర్తయింది. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement