Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-నరేష్!

Tue 22nd Dec 2015 06:20 PM
allari naresh interview,mama manchu alludu kanchu,mohan babu,poorna,vishnu manchu  సినీజోష్ ఇంటర్వ్యూ-నరేష్!
సినీజోష్ ఇంటర్వ్యూ-నరేష్!
Advertisement
Ads by CJ

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'మామ మంచు..అల్లుడు కంచు'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిశంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

మోహన్ బాబు గారికి ముందే చెప్పేశా..

ఈ సినిమా ఓకే చేసినప్పటినుండి అందరూ నన్ను మోహన్ బాబు గారితో కలిసి నటించడానికి భయం వేయలేదా.. అని అడుగుతున్నారు. నేను సినిమా అంగీకరించిన మొదటిరోజే మోహన్ బాబు గారి దగ్గరకి వెళ్లి 'సర్ నేను మీకు భయపడను కాని గౌరవం ఇస్తాను' అలా అయితేనే సన్నివేశాన్ని పండిచగలమని చెప్పేశాను. ముందుగానే ప్లాన్ చేసుకొని చేయడం వలన కష్టంగా ఎక్కడ అనిపించలేదు. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసుకున్నాం. 

50వ సినిమా సోలోగా చేయాలనుకున్నా..

నిజానికి నా యాభైవ సినిమా సోలో హీరోగా చేయాలనుకున్నాను. నాగేశ్వరరెడ్డి గారి దర్శకత్వంలో ఓ ఘోస్ట్ కామెడీ చేయాలని ఫిక్స్ అయ్యాను కూడా. అయితే ప్రస్తుతం అన్ని హారర్ కామెడీ చిత్రాలే వస్తున్నాయి. సో.. కొంచెం గ్యాప్ తీసుకొని చేయాలనుకున్నాను. దాని తరువాత 'మామ మంచు.. అల్లుడు కంచు' చేస్తానని చెప్పాను. కాని విష్ణు, మోహన్ బాబు ఇదే 50వ సినిమాగా చేయమని అడిగారు. అందుకే చేశాను. కాని నేను నటిస్తున్న యాభైవ సినిమా అని హైప్ మాత్రం చేయలేదు. 

డిక్షన్ నేర్చుకున్నా..

ఈ సినిమా అల్లరి మొగుడు చిత్రానికి కంటిన్యూస్ గా ఉంటుంది. మోహన్ బాబు గారు ఇద్దరిని పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టడంతో ఆ సినిమా ఎండ్ అవుతుంది. 25 ఏళ్ళ తరువాత ఎలా ఉంటుందనేదే ఈ స్టొరీ. మొదటిసారి మోహన్ బాబు, మీనాలతో వర్క్ చేశాను. నేను మాట్లాడేప్పుడు చాలా ఫాస్ట్ గా మాట్లాడతాను. ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి.. ఎక్కడ ఫాస్ట్ గా మాట్లాడాలనే విషయంలో మోహన్ బాబు గారి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఆయన నుండి డిక్షన్ బాగా నేర్చుకున్నాను.

మంచి కామెడీ ఫిలిం..

డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారితో 'బొమ్మన బ్రదర్స్.. చందన సిస్టర్స్' సినిమా చేశాను. అప్పటికి, ఇప్పటికి ఆయన వ్యక్తిత్వం ఏం మారలేదు. ఎక్కువగా నవ్వుతూనే ఉంటారు. పెద్ద కాస్టింగ్ ను బ్యాలన్స్ చేసుకొని సినిమా తీశారు. 99% ఇది కామెడీ ఫిలిం. ఎలాంటి ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ ఉండవు. తొంబై శాతం ఒరిజినల్ స్క్రిప్ట్ రీమేక్ చేశారు. ఒక 10 శాతం తెలుగు నేటివిటీ యాడ్ చేశారు.

పూర్ణ, విష్ణు ఛాయస్..

పూర్ణ తో ఇది మూడవ సినిమా. విష్ణునే పూర్ణ ను సెలెక్ట్ చేసాడు. నేను నటించిన 'సీమశాస్త్రి' సినిమా చూసి విష్ణు, నాకు పూర్ణకు మధ్య కెమిస్ట్రీ బావుందని భావించి ఈ సినిమాకు కూడా తననే ఓకే చేశాడు. 

వరుణ్ అతిథి పాత్రలో కనిపిస్తాడు..

ఈ సినిమాలో వరుణ్ సందేశ్ అతిథి పాత్రలో కనిపిస్తాడు. అంతా ఒకే అనుకున్న సమయంలో అన్ని డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళిపోయే క్యారెక్టర్ తనది.  

టైటిల్ క్రెడిట్ భగవాన్ గారిదే..

నేను నటించిన 'జేమ్స్ బాండ్' సినిమాకు టైటిల్ ఏం పెట్టాలని ఆలోచించినప్పుడు కృష్ణభగవాన్ గారు 'అబ్బాయి మంచు అమ్మాయి కంచు' అని పెట్టమని సలహా ఇచ్చారు. విష్ణు ఈ సినిమాకు టైటిల్ అనుకుంటున్న సమయంలో నేను 'మామ మంచు అల్లుడు కంచు' ఎలా ఉందని అడిగాను. డైరెక్టర్ గారికి కూడా నచ్చడంతో ఓకే చేసేశారు. టైటిల్ క్రెడిట్ అంతా కృష్ణ భగవాన్ గారికే చెందుతుంది.

సక్సెస్ ఉన్నప్పుడు ఎక్కువ చేశా..

సక్సెస్ ఉన్నప్పుడు సంవత్సరానికి ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటాం. అదే ఫెయిల్యూర్ వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకొని మెల్లగా సినిమాకు చేస్తారు. నా స్క్రిప్ట్స్ నేనే వింటాను. నాన్నగారు బ్రతికున్నప్పుడు కూడా నా కథలు నేనే వినేవాడిని. సినిమా సక్సెస్ అయిన ఫెయిల్ అయిన అది నా బాధ్యతే. 

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలి..

'బెండు అప్పారావు' సినిమా తరువాత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయలేదు. ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో ఉండే ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కోసం స్క్రిప్ట్స్ వినాలనుకుంటున్నాను. అలానే మా బ్యానర్ లో నటించడానికి ఇద్దరు మోడరేట్ హీరోలను అప్రోచ్ అయ్యాను. త్వరలో ఆ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతం ఈశ్వర్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాను. కేశినేని ట్రావెల్స్ వాళ్ళది ఒక సినిమా ఓకే చేశాను. నాగేశ్వరెడ్డి గారితో మరో సినిమా చేయాలి అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ