హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్ తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిశంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
టైటిల్ అందుకే మార్చలేదు..
'లోఫర్' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమా తరువాత మథర్ సెంటిమెంట్ తో చేస్తోన్న సినిమా ఇది. మథర్ సెంటిమెంట్ కనుక 'మా అమ్మ సీతామహాలక్ష్మి' అనే టైటిల్ పెట్టాలని భావించాం. కాని 'లోఫర్' అనే టైటిల్ అందరికి రీచ్ అవ్వడంతో అదే టైటిల్ గా పెట్టేశాం. సినిమా బావుంటే ఏ టైటిల్ అయినా.. ఓకే. లోఫర్ అనే టైటిల్ పెట్టినా.. చివరకు హీరో మంచివాడనే చెప్తాం.
ఆ సినిమాకు దీనికి వేరియేషన్ ఉంది..
'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' మాదిరిగా మథర్ సెంటిమెంట్ సినిమా అయినా.. దానికి 'లోఫర్' కు చాలా డిఫరెన్స్ ఉంది. అందులో కొడుకు తల్లితో చిన్నప్పటి నుండి కలిసే ఉంటాడు. ఈ సినిమాలో మాత్రం తల్లి ఎక్కడ ఉందో.. కూడా కొడుకుకి తెలియదు. వేరు వేరు చోట్ల ఉంటారు. ఈ సినిమాలో తల్లి మీద ఉండే 'సువ్వి సువ్వాలమ్మా' పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
చిరు గారు వరుణ్ తేజ్ గురించే మాట్లాడారు..
రీసెంట్ గా చిరంజీవి గారిని కలిసాను. ఆయన వరుణ్ తేజ్ ను ఎంతగానో పొగిడారు. సుమారుగా పది నిమిషాల పాటు వరుణ్ గురించే మాట్లాడారు. నటునిగా కొన్ని భావాలు పలికించడం చాలా కష్టమని, వరుణ్ తేజ్ మాత్రం చాలా బాగా చేసాడని ఆయన చెప్పారు. నిజంగా సినిమా చూసిన వారు వరుణ్ మూడవ సినిమాలోనే ఇంత బాగా నటించాడా.. అనుకుంటారు.
వరుణ్ లో నాకు ఆ విషయం బాగా నచ్చుతుంది..
వరుణ్ లో ఎలాంటి యారోగన్స్, ఎవరి ఇన్ఫ్లుయన్స్ ఉండదు. డైలాగ్స్ రాయడం సులువే. యాక్టర్ అనేవాడు ఆ డైలాగ్స్ ను యారోగంట్ గా చెప్తే ప్రేక్షకులు డిస్కనెక్ట్ అయిపోతారు. వరుణ్ అలా కాకుండా చాలా చక్కగా డైలాగ్స్ చెప్తాడు. తన మొహంలో అమాయకత్వం ఉంటుంది. అది తనకు ప్లస్ పాయింట్.
రేవతి గారు అలా అన్నారు..
ఈ సినిమాకు రైట్ హ్యాండ్ రేవతి, లెఫ్ట్ హ్యాండ్ పోసాని గారు అన్నట్లుగా నటించారు. ఓ మంచి తల్లి పాత్రలో రేవతి గారి నటన అధ్బుతం. మా సినిమాలో నటించమని స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తరువాత ఫోన్ లో నేరేషన్ ఇచ్చాను. ఆమె వెంటనే ఓకే చేసారు. రేవతి గారు ఆర్ట్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తారు. ఈ సినిమాలో కొన్ని లౌడ్ సీన్స్ లో నటించేప్పుడు 'పూరి నేనెప్పుడు ఇలాంటి సీన్స్ లో నటించలేదు. నీ మీద నమ్మకంతో చేసేస్తున్నానని' చెప్పారు.
ప్లానింగ్ తో చేస్తా..
నేను సినిమాలు చేసే ముందు చాలా ప్లానింగ్ తో ఉంటాను. స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ ఉంటుంది. అదే క్లారిటీ మా టీం అందరికి ఉండాలని అందరిని కూర్చోపెట్టి నేరేషన్ ఇస్తాను. సో.. అప్పుడు వాళ్లకు కూడా క్లారిటీ వస్తుంది. వెంటనే ప్రాజెక్ట్ మొదలుపెట్టేస్తాను. 'లోఫర్' సినిమా 65 రోజుల్లో పూర్తి చేశాను.
నా హీరోయిన్లందరూ.. బాలీవుడ్ వాళ్ళే..
బొంబాయి అమ్మాయిలకు తెలుగు భాష ఏలియన్ లాంటిది. నా హీరోయిన్లందరూ బాలీవుడ్ వాళ్ళే. వారికి డబ్బింగ్ కష్టంగా ఉన్నా.. మేము ట్రైనింగ్ ఇస్తాం కదా.. దిశా పటాని కూడా ఈ సినిమాలో బాగా నటించింది. తనకి బాలీవుడ్ లో ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చింది.
చిరు ఫ్యాన్స్ కు తెలియదు కదా..
చిరంజీవి గారి అభిమానులు నా మీద సీరియస్ అయ్యారట. చిరంజీవి గారికి నాకు మధ్య ఉన్న స్నేహం వాళ్లకు తెలియదు కదా.. నేను ఆయనను కలిసి మాట్లాడాను. 150 కాకపోతే 151 లేదా 152 ఏదైనా చిరంజీవి గారితో ఖచ్చితంగా సినిమా చేస్తాను.
పవన్ ఫ్యాన్స్ కు సెన్స్ లేదనుకుంటారు..
రీసెంట్ గా జరిగిన 'లోఫర్' ఆడియో ఫంక్షన్ లో అందరూ చాలా ఇరిటేట్ ఫీల్ అయ్యారు. ప్రభాస్, నేను కూడా చాలా ఇరిటేట్ అయ్యాం. ఒక ఫంక్షన్ పెట్టుకొని మా సినిమా గురించి చెప్పుకోవాలనుకుంటాం. కాని అక్కడ పవన్ అభిమానులు మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. దాని వలన పవన్ కళ్యాన్ గారికే చెడ్డ పేరు వస్తుంది. కళ్యాణ్ గారి చెప్పిన వారి ఫ్యాన్స్ వింటారో లేదో తెలియదు కాని కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలి. లేదంటే పవన్ ఫ్యాన్స్ కు కామన్ సెన్స్ లేదనుకుంటారు.
సునీల్ వర్క్ అంటే ఇష్టం..
సునీల్ కశ్యప్ మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు. 'జ్యోతిలక్ష్మి' సినిమాకు పని చేసాడు. ఇప్పుడు 'లోఫర్' సినిమాకు వర్క్ చేసాడు. నా నెక్స్ట్ సినిమాకు కూడా తననే కన్ఫర్మ్ చేశాను. మంచి టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్.
బీచ్ లో కూర్చోవడం కంఫర్ట్..
ఇంతకముందు ఇక్కడే కథలు రాసుకునేవాడ్ని. డబ్బులు వచ్చాక బ్యాంకాక్ వెళ్లి రాస్తున్నాను(నవ్వుతూ..) నాకు బీచ్ లో కూర్చొని కథలు రాయడం కంఫర్ట్ గా ఫీల్ అవుతాను. వైజాగ్ బీచ్ లో రాయనివ్వరు కదా అందుకే బ్యాంకాక్ వెళ్తాను. అది నాకు సొంతూరులా అనిపిస్తుంది. ఇండియాకు వస్తేనే ఫారెన్ లా ఫీల్ అవుతాను.
సి.కళ్యాణ్ గారితో రెండోసారి చేస్తున్నా..
సి.కళ్యాన్ గారితో నాకు ఇది రెండో చిత్రం. ఫస్ట్ కాపీ చూసిన తరువాత నాకు ఫోన్ చేసి సినిమా సూపర్ హిట్, హ్యాపీగా ఉండండి అని చెప్పారు.
మహేష్ కు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నా..
మహేష్ బాబు కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాను. చాలా పెద్దగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అందులో మరో పెద్ద హీరో కూడా ఉంటాడు.
'రోగ్' మొదలయ్యింది..
'రోగ్' షూటింగ్ మొదలుపెట్టేశాం. తెలుగు, కన్నడ రెండు భాషల్లో సినిమాను చిత్రీకరిస్తున్నాం.
గురువుగారి ఫీడ్ బ్యాక్ నాకు హెల్ప్ అవుతుంది..
రామ్ గోపాల్ వర్మ గారు నా సినిమాలు చూసి ఫీడ్ బ్యాక్ ఇస్తూ.. ఉంటారు. ఆయన ఇచ్చిన సలహాలన్నీ నాకు ఉపయోగపడ్డాయి.
ఆకాష్ సినిమా అప్పుడే ఉంటుంది..
నా కొడుకు ఆకాష్ మరో సినిమాలో నటించడానికి కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.