Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-సంపత్ నంది!

Mon 07th Dec 2015 05:12 PM
sampath nandi interview,bengal tiger movie,sampath nandi interview about bengal tiger,raviteja  సినీజోష్ ఇంటర్వ్యూ-సంపత్ నంది!
సినీజోష్ ఇంటర్వ్యూ-సంపత్ నంది!
Advertisement
Ads by CJ

తొలి సినిమా 'ఏమైంది ఈ వేళ'తో యూత్ ను 'రచ్చ' సినిమాతో మాస్ ను అలరించిన దర్శకుడు సంపత్ నంది నుండి రాబోతున్న మరో చిత్రం 'బెంగాల్ టైగర్'. రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్లు. కె.కె.రాధామోహన్ నిర్మాత. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిశంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది తో సినీజోష్ ఇంటర్వ్యూ..

బెంగాల్ టైగర్ సినిమా ఎలా ఉండబోతోంది..?

చిన్నప్పటి నుండి మాస్ సినిమాలు చూస్తూ.. పెరగడం వలన నా సినిమాల్లో కూడా మంచి కథతో పాటు మాస్ ఎలిమెంట్స్ ఉండాలనుకుంటాను. అదే విధంగా యాక్షన్ ఎంటర్టైనర్ గా 'బెంగాల్ టైగర్' చిత్రాన్ని రూపొందించాను. మంచి కథ, కథనంతో ఉండే ఈ చిత్రం రవితేజ గారి అభిమానులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. 

'బెంగాల్ టైగర్' కలకత్తా బ్యాక్ డ్రాపేనా..?

బెంగాల్ టైగర్ జాతికి తెలివిగా ఎదుటి వారిని ఎదుర్కొనే సత్తా ఉంటుంది. మా హీరో కూడా అలానే ఎదుటివారిని ఎదుర్కొంటాడు. అందుకే 'బెంగాల్ టైగర్' అనే టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నాం. స్వచ్చమైన తెలుగు బ్యాక్ డ్రాప్ కు చెందిన చిత్రం. 

రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

కథ పరంగా, పాత్ర పరంగా ఈ సినిమా ఎవరు చూసిన రవితేజ గారు 'బెంగాల్ టైగర్' కు యాప్ట్ అనుకుంటారు. ఆయన ఎనర్జీకు పవర్ హౌస్ లాంటి వారు. ఏ డైలాగ్ ఇచ్చినా.. తన బాడీ లాంగ్వేజ్ కు ఆప్ట్ చేసుకొని పక్కింటి కుర్రాడిలా చెప్పేస్తుంటారు. రవితేజ గారికి దర్శకత్వ శాఖలో పని చేసిన అవగాహన ఉండడం వలన ఆయనతో పని చేయడం కష్టంగా అనిపించలేదు. అయితే ఆయన నటించిన ఏ సినిమాలు తీసుకున్న అన్నింటిలో లుక్ ఒకే విధంగా ఉంటుంది. సో.. నా సినిమాలో మాత్రం కథతో పాటు ఆయన లుక్ మీద కూడా ఫోకస్ చేయాలనుకున్నాను. రవితేజ గారు కూడా ఒప్పుకోవడంతో ఆయనను డిఫరెంట్ లుక్ తో చూపించాను. 

'రచ్చ' తరువాత మరోసారి తమన్నా ను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం..?

'ఆవారా' సినిమా చూసినప్పుడు 'అరెరె వాన' పాటలో తమన్నా నాకు బాగా నచ్చింది. రచ్చ సినిమాకు తనను సంప్రదించడానికి కారణం కూడా ఆ పాటే. తమన్నా చాలా అందంగా ఉంటుంది. అంతే అందంగా 'రచ్చ' సినిమాలో చూపించాను. ఇప్పుడు 'బెంగాల్ టైగర్' చిత్రంలో చూపించబోతున్నాను. ఆ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఈ చిత్రంలో తమన్నాతో పాటు రాశి ఖన్నా కూడా ఉంటుంది. సినిమాలో వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నిజ జీవితంలో కూడా వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. దానికి బేస్ బెంగాల్ టైగరే.. ఈ సినిమాలో రాశిఖన్నా హోం మినిస్టర్ కూతురు. చాలా తెలివైన అమ్మాయి. హోం మినిస్టర్ కు కూడా సలహాలు ఇస్తూ.. ఉంటుంది. కేవలం పాటలు, రొమాన్స్ కోసమే హీరోయిన్స్ కాకుండా.. కథను ముందుకు తీసుకువెళ్ళడానికి హెల్ప్ చేసే విధంగా హీరోయిన్స్ క్యారెక్టర్స్ డిజైన్ చేసాను.

పెద్ద బడ్జెట్ సినిమాలో భీమ్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడంలో రిస్క్ అనిపించలేదా..?

భీమ్స్ నా ఫ్రెండ్ అని ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోలేదు. భారీ బడ్జెట్ సినిమాలో తనను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకొని రిస్క్ చేయలేను. కాని తన ట్యూన్స్ లో మట్టి వాసన, తెలియని స్వచ్చత ఉంటుంది. నా సినిమా ద్వారా తన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాను. నా మొదటి సినిమాకు తీసుకోవడం కుదరలేదు. బెంగాల్ టైగర్ చిత్రానికి భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ బ్లాక్ బాస్టర్ గా నిలించింది. కమర్షియల్ గా తనకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. నా సినిమాల్లో ట్యూన్స్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తానో.. అలానే థీమ్ మ్యూజిక్ కు కూడా ఇస్తాను. థీమ్ మ్యూజిక్ ను హమ్ చేసుకుంటూ.. సీన్స్ రాసుకుంటాను. 

'అత్తారింటికి దారేది' తరువాత బొమన్ ఇరాని నటిస్తున్న మరో తెలుగు చిత్రమిది. ఆయనను ఎలా ఒప్పించారు..?

ఈ సినిమాలో బొమన్ గారిది ముఖ్యమైన పాత్ర. ఆయనతో మాట్లాడాలనుకున్నప్పుడు ఫారెన్ లో ఉన్నారు. తిరిగి రావడానికి నెల రోజులు పట్టింది. వచ్చిన వెంటనే కథ చెప్పాలని చాలా ప్రిపేర్ అయ్యాను. మన భాష కాదు, నేను చేసింది కూడా రెండు సినిమాలే సో.. కథతోనే ఆయనను ఇంప్రెస్ చేయాలని కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ చేసాను. నేను నేరేషన్ ఇచ్చిన 15 నిమిషాల్లోనే బొమన్ గారికి కథ నచ్చడంతో ఓకే చెప్పేశారు. వరల్డ్ సినిమా గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన చదవని పుస్తకం లేదు. నడుస్తున్న ఎన్ సైక్లోపీడియా. టెక్నికల్ గా ఎన్నో విషయాలు తెలిసిన మనిషి. నా కెరీర్ ఆరంభంలోనే అలాంటి వ్యక్తితో కలిసి పని చేయడం అద్రుష్టంగా భావిస్తున్నాను.

మీ నిర్మాత గురించి చెప్పండి..?

రాధామోహన్ గారితో ఏమైంది ఈ వేళ సినిమాకు కలిసి పని చేసాను. ఆ సినిమా సక్సెస్ అయ్యి రీమేక్ రైట్స్ అమ్మాకానికి పెట్టినప్పుడు డబ్బు విషయంలో ఆయనకు నా మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదు. కాని నన్ను ఇంటికి పిలిచి రీమేక్ రైట్స్ అమ్మగా వచ్చిన డబ్బని చెప్పి యాభై శాతం నాకిచ్చారు. ఈరోజుల్లో అలాంటి మనుషులు ఎక్కడుంటారు. అలాంటి వ్యక్తులు మన చుట్టూ.. ఉండాలని కోరుకుంటాం. అయితే ఈ సినిమాకు ఆయన ప్రొడ్యూసర్ గా చేసారంటే దానికి రవితేజ గారికే థాంక్స్ చెప్పాలి. రవితేజ గారితో సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. కాని నా మాట మీద రాధామోహన్ గారిని కలిసి ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగలరని నమ్మి నిర్మాతగా ఓకే చేసారు. ఇప్పుడు రాధామోహన్ గారు చేసిన ఈ ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది.  

పవన్ కళ్యాన్ గారికి నాకు మధ్య ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అన్నారు.. మరి ఇప్పుడు కళ్యాణ్ ఫోన్ చేస్తూ ఉంటారా..?

అప్పటికి.. ఇప్పటికీ.. ఎప్పటికీ మా మధ్య రిలేషన్ ఒకే విధంగా ఉంటుంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా నేను చేయకపోవడానికి కారణం పరిస్థితులే కాని వ్యక్తులు కాదు. పవన్ గారి కోసం ఒక కథ రాసుకుంటున్నాను. ఆయనకు కూడా వినిపిస్తాను. ఓకే చెప్తే త్వరలోనే మా కాంబినేషన్ లో సినిమా ఉంటుంది. 

ఈ సినిమాలో మీ గురువుగారికి మంచి రోల్ ఇచ్చినట్లున్నారు..?

పోసాని గారితో కలిసి పని చేసిన రోజులు ఎప్పటికి మర్చిపోలేను. ఈ సినిమాలో ఆయన సెలబ్రిటీ శాస్త్రి అనే పాత్రలో కనిపిస్తారు. నేను ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు పోసాని గారిని కలిసాను.  చదువు పూర్తయ్యాక కలవమని చెప్పారు. ఆ మూడు సంవత్సరాల్లో ఆయనను ఏదోక విధంగా ఫాలో అవుతూనే ఉన్నాను. చదువు పూర్తయ్యాక వెళ్లి కలవగా.. పోసాని గారు నన్ను గుర్తుపట్టలేదు. మరలా గుర్తుచేసుకొని అసిస్టెంట్ గా జాయిన్ చేసుకున్నారు. జాయిన్ అయిన రెండో రోజు నుండే సీన్లు రాయడం మొదలుపెట్టాను. మాటలు రాయడం, స్క్రీన్ మీద సీన్స్ పండిచడం వంటి విషయాలన్నీ పోసాని గారి దగ్గర నుండే నేర్చుకున్నాను. 

నిర్మాతగా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా..?

'గాలిపటం' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాను. ఆ తరువాత మరే సినిమాను ప్రొడ్యూస్ చేయలేదు. నా డైరెక్షన్ లో ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు నేను ప్రొడ్యూస్ చేయడం కష్టం. రెండు పనులు ఒకేసారి చేయలేను. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ ఉంటే చేస్తాను. రెండు కాన్సెప్ట్స్ విన్నాను. త్వరలోనే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..? 

ప్రస్తుతానికి 'బెంగాల్ టైగర్' రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. మరే ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ