అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం 'సైజ్ జీరో'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సోనాల్ చౌహాన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమాలో మీ పాత్ర గురించి..?
ఈ చిత్రంలో సిమ్రన్ అనే ఎన్నారై అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. ఒక ఎన్.జి.ఓ లో పని చేస్తూ.. ఉండే తను స్వచ్చ్ భారత్, స్వచ్చ్ హైదరాబాద్ కోసం ఇండియా వస్తుంది. ఒక అందమైన పాత్ర అది. సినిమాలో చాలా కీలకమైనది. ఇదొక ట్రైయాంగల్ లవ్ స్టొరీ.
నిజజీవితంలో జీరో సైజ్ మెయిన్టైన్ చేస్తారా..?
నాకు జీరో సైజ్ మెయిన్టైన్ అసలు నచ్చదు. డైట్ కూడా ఫాలో అవ్వను. హైదరాబాద్ బిరియాని అంటే బాగా ఇష్టం. వ్యాయామం మాత్రం చేస్తాను.
ఈ పాత్ర అంగీకరించడానికి కారణం..?
ఎన్నారై గర్ల్ అంటే చాలా ఫాస్ట్ గా ఉంటారు. మంచి వాళ్ళు కాదనే ఒపీనియన్ అందరిలో ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర వాటన్నింటిని బ్రేక్ చేసే విధంగా ఉంటుంది. కేవలం అమ్మాయిలు వేసుకునే బట్టల బట్టి వారి క్యారెక్టర్ ను నిర్ణయించకూడదు. నాకు ఈ పాయింట్ బాగా నచ్చడంతో సినిమాలో నటించడానికి ఓకే చేసాను. అలానే పివిపి గారి బ్యానర్ లో పని చేసే అవకాసం రావడంతో సంతోషపడ్డాను. మంచి ప్రొడక్షన్. క్వాలిటీ ఫిల్మ్స్ తీస్తారు.
స్వీటీ, ఆర్య లతో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
పేరుకు తగ్గట్లుగా తను నిజంగా చాలా స్వీట్. తనతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే ఆర్య తమిళంలో పెద్ద స్టార్ అయినా.. సెట్స్ లో ఫన్నీగా ఉండేవాడు. హెల్ప్ ఫుల్ కో యాక్టర్.
ఎలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టపడతారు..?
నేను నటించే ప్రతి పాత్ర భిన్నంగా ఉండాలనుకుంటాను. 'లెజెండ్' సినిమాలో టిపికల్ హీరోయిన్ పాత్రలో కనిపిస్తే.. 'పండగ చేస్కో' లో పొగరుగా ఉండే ఎన్నారై పాత్రలో కనిపిస్తాను. ఒకే రకమైన పాత్రల్లో నటిస్తే బోర్ ఫీల్ అవుతాను. అందుకే డిఫరెంట్ గా ఉండేలా సెలెక్ట్ చేసుకుంటాను.
డైరెక్టర్ ప్రకాష్ గురించి చెప్పండి..?
తనొక సెన్సిబుల్ ఫిలిం మేకర్. నేను ఈ సినిమాలో అంగీకరించడానికి ఒక కారణం కూడా అదే. ఆయన సినిమాను ట్రీట్ చేసే విధానం నాకు బాగా నచ్చుతుంది. నాకు స్క్రిప్ట్ ఎలా నేరేట్ చేసారో.. అదే విధంగా సినిమా చేశారు.
గోల్డ్ కాంటెస్ట్ సంగతేంటి..?
రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాను పైరసీ చేసేస్తున్నారు. దాన్ని అరికట్టడానికి మొదట స్టెప్ తీసుకోవడానికే ఈ గోల్డ్ కాంటెస్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. దీని ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
ప్రస్తుతానికి తెలుగులో 'డిక్టేటర్' సినిమాలో నటిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.