Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-రామ్మోహన్(తను నేను)

Wed 25th Nov 2015 12:04 AM
rammohan interview,thanu manu director raammohan,interview about thanu manu  సినీజోష్ ఇంటర్వ్యూ-రామ్మోహన్(తను నేను)
సినీజోష్ ఇంటర్వ్యూ-రామ్మోహన్(తను నేను)
Advertisement
Ads by CJ

సంతోష్ శోభన్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో సన్ షైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్మోహన్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'తను నేను'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత రామ్మోహన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాల్లోకి రావడానికి కారణం ఏంటి..?

నేను ఎం.బి.ఏ పూర్తి చేసి ఒక బిజినెస్ చేసేవాడిని. ఆ సమయంలో సురేష్ గారితో పరిచయం ఏర్పడింది. ఎం.బి.ఏ కంప్లీట్ చేశావు. మా స్టూడియోలో హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగారు. అలా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. సినిమాకు సంబంధించిన ఏ,బి,సి,డీ లు అన్నీ సురేష్ గారి దగ్గరే నేర్చుకున్నాను. ఇక ప్రొడక్షన్ విలువల గురించి, కథల గొప్పతనం గురించి రామానాయుడు గారి నుండి తెలుసుకున్నాను. 2008 లో సినిమా చేయాలనుకుంటున్నప్పుడు మోహన్ కృష్ణ చెప్పిన కథ నచ్చడంతో నాని హీరోగా 'అష్టా చమ్మా' చిత్రాన్ని నిర్మించాను. ఆ తరువాత 'గోల్కొండ హై స్కూల్','ఉయ్యాలా జంపాలా' చిత్రాలు చేసాను. 

నిర్మాతగా ఉన్న మీరు డైరెక్టర్ గా ఎందుకు మారుతున్నారు..?

నిజానికి ఈ సినిమా కథను రామోజీఫిలిం సిటీ లో చదువుకునే ఓ కుర్రాడిది. తను అమెరికా వెళ్ళాల్సి రావడంతో ఈ కథను అమ్మేసి వెళ్ళిపోయాడు. నాకు కథ బాగా నచ్చడంతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇద్దరు,ముగ్గురు దర్శకులను కూడా కలిసాను. అయితే ఈ కథ నాకు నచ్చినంతగా వారికి నచ్చకపోవడం వలనో.. ఇతరత్రా కారణాల వలనో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఇంక నేనే డైరెక్ట్ చేయాలని సురేష్ బాబు గారికి చెప్పాను. రానా వెంటనే మీరే చేయండి అని చెప్పాడు. సురేష్ బాబు గారి సపోర్ట్ తో సినిమాను పూర్తి చేసాను.

కొత్త హీరోతో కలిసి వర్క్ చేయడం కష్టంగా అనిపించలేదా..?

ఒక నిర్మాతగా కొత్త హీరో అయిన నాని తో, రాజ్ తరుణ్ తో, అలానే హీరోయిన్ అవికాతో సినిమాలు చేసాను. వారంతా నా కుటుంబంలా కలిసి ఉంటారు. ఈ సినిమాలో హీరోగా చేసిన సంతోష్ తో నేను ఇదివరకే 'గోల్కొండ హై స్కూల్' సినిమా చేసాను. అప్పటికి తన వయస్సు 13 నుండి 14 ఏళ్ళు ఉంటుంది. ఆ వయసులోనే తన ఎమోషన్స్, స్క్రీన్ ప్రెజన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'తను నేను' సినిమా ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు సంతోష్ ని చూసి వెంటనే ఓకే చేసాను.

రవిబాబు గారి పాత్ర గురించి..?

ఈ సినిమాలో రవిబాబు గారు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. తన కూతురిని అమెరికా పంపాలనుకుంటాడు కాని ఆ అమ్మాయి ప్రేమించే కుర్రాడికి అమెరికా వెళ్ళాలనే ఆసక్తి ఉండదు. వీరి మధ్య జరిగే సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాను. రవిబాబు గారితో కలిసి వర్క్ చేయడానికి మొదట్లో చాలా టెన్షన్ పడేవాడిని. చాలా సీన్స్ లో ఆయన నన్ను గైడ్ చేసేవారు.

యంగ్ హీరోస్ తోనే సినిమాలు చేస్తారా..?

స్క్రిప్ట్స్ కు తగ్గట్లుగా స్టార్స్ ను ఎంపిక చేసుకుంటాం. 'సోగ్గాడే చిన్నినాయన' కథ ఐడియాను కళ్యాన్ కృష్ణ చెప్తే నేను అది డెవలప్ చేసి ఇచ్చాను. యంగ్ హీరోస్ తో సినిమాలు చేయాలనుంది కాని ఈ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే అప్రిసియేషన్ బట్టి ఆలోచిస్తాను.

డైరెక్టర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..?

ఈ చిత్రాన్ని 33 రోజుల్లో కంప్లీట్ చేసేసాం. మూడు సంవత్సరాలుగా స్క్రిప్ట్ పై అవగాహన ఉండడం వలన నాకు ఏం కావాలో బాగా తెలుసు. ప్రతి ఫ్రేం నా మైండ్ లో ఉండేది. ఆర్టిస్టులతో 45 రోజులు రిహార్సల్స్ చేయించాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

విశ్వదేవ్ అనే కొత్త హీరోతో 'పిట్టగోడ' అనే సినిమాను నిర్మిస్తున్నాను. పునర్నవి భూపాలం హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ద్వారా అనుదీప్ అనే దర్శకుడ్ని పరిచయం చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ