Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-దేవిశ్రీప్రసాద్

Mon 23rd Nov 2015 08:05 PM
devisriprasad interview,kumari 21f movie,devisri prasad,devisri kumari 21f interview,sukumar  సినీజోష్ ఇంటర్వ్యూ-దేవిశ్రీప్రసాద్
సినీజోష్ ఇంటర్వ్యూ-దేవిశ్రీప్రసాద్
Advertisement
Ads by CJ

'మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ సాగిస్తున్న నాకు పెద్ద పెద్ద బ్యానర్ల నుండి హీరోగా పని చేయమని ఆఫర్లు వస్తున్నాయంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్''. రీసెంట్ గా తను మ్యూజిక్ చేసిన 'కుమారి 21 ఎఫ్' చిత్రం మంచి సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ సినిమా గురించి విలేకర్లతో ముచ్చటించారు.

పవర్ ఆఫ్ త్రీ టెక్నీషియన్స్..

ఈ సినిమా సక్సెస్ తో చాలా సంతోషంగా ఉంది. పెద్ద హీరోలతో, పెద్ద టెక్నీషియన్స్ తో చాలా సినిమాలు చేశాను. సుకుమార్, రాండీ, నేను కూడా చాలా సినిమాలు చేశాం. కాని ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది. ముగ్గురు టెక్నీషియన్స్ మనసు పెట్టి సినిమా తీస్తే ఎంత బాగా ప్రేక్షకులకు రీచ్ అవుతుందో.. ఈ చిత్రం ద్వారా ప్రూవ్ అయింది. మా నమ్మకం నిజమయ్యింది. 

మొదట కొంచెం డౌట్ ఉండేది..

ఒక బోల్డ్ సబ్జెక్టు తీసుకొని సుకుమార్ గారు సినిమా చేయాలనుకున్నప్పుడు నాకు కొంచెం డౌట్ ఉండేది. క్లైమాక్స్ రెగ్యులర్ గా కాకుండా భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులు కనెక్ట్ అయితే ఓకే కాని నచ్చకపోతే మాత్రం రిజల్ట్ ఏమవుతుందో అని భయమేసేది. సుకుమార్ మాత్రం తన స్క్రిప్ట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండేవాడు. సినిమా రీరికార్డింగ్ చేసినపుడు చూస్తే నేను ఎమోషనల్ అయ్యాను. సినిమాలో లెటర్ చదివే సీన్ కోసం చాలా కష్టపడి వర్క్ చేశాం. ప్రస్తుతం ఉన్న యువత ఎదుర్కొనే సమస్యలను ఈ చిత్రంలో చూపించాం. కాని ఈ విషయాల గురించి పబ్లిక్ గా డిస్కస్ చేసే స్వేచ్చ లేదు. అమ్మాయిల కంటే అబ్బాయిలకు లిబర్టీ ఎక్కువ ఉంటుంది. పెళ్లి ఫిక్స్ అయిన తరువాత అబ్బాయి తన చేసుకోబోయే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా..? అని ఆలోచిస్తున్నాడు. నమ్మకం అనేది చాలా ఇంపార్టంట్. ఇద్దరినీ సమాన దృష్టితో చూడాలి. అదే కాన్సెప్ట్ ను తీసుకొని అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా చేశారు.

నేను అలా ఆలోచించను..

నాకు నచ్చిన వారితో స్నేహం చేస్తాను. వారి వల్ల నాకు నష్టం జరుగుతుందా..? లాభం జరుగుతుందా..? అని లెక్కలు వేసుకొని స్నేహం చేయను. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చేసేదే స్నేహం. 

ప్రతిది నాకు మొదటి చిత్రమే..

సుక్కు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. అంత నమ్మకం పెట్టుకున్నందుకు మంచి మ్యూజిక్ చేయడం నా బాధ్యత. ప్రతి సినిమాను మొదటి చిత్రంగా భావించి పని చేస్తాను. సుక్కు తన సినిమా కాన్సెప్ట్ ను పాట రూపంలో చెప్పాలనుకుంటాడు. నా దృష్టిలో పాటకు లిరిక్స్ చాలా ముఖ్యం. బహుసా లిరిసిస్ట్ కొడుకును కావడం వల్లనే అనుకుంటా.. భావం మీదే పాట ఆధారపడి ఉంటుంది. సాంగ్ లో క్రియేటివిటీ కోసం ఎక్కువగా కష్టపడకూడదు. పని పట్ల ప్యాషన్ తో చేయాలి. 

ప్రతాప్ బాగా డైరెక్ట్ చేశాడు.. 

సుక్కు దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. తను అనుకున్న ప్రతి ఐడియాను సినిమాగా చేయడానికి చాలా సమయం పట్టేస్తుంది. అందుకే తనను బాగా అర్ధం చేసుకున్న ప్రతాప్ ను ఈ సినిమా డైరెక్ట్ చేయమని చెప్పాడు. సుక్కు ఎంత అందంగా రాశాడో.. ప్రతాప్ అంత బాగా డైరెక్ట్ చేశాడు. 

అలా వేరియేషన్ చూడను.. 

పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా చూడను. కథ నచ్చితే సినిమా ఒప్పుకుంటాను. 'కరెంట్' సినిమా షూటింగ్ సమయంలో కూడా చిన్న సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటని..? చాలా మంది అడిగారు. ఆ సినిమా కూడా సుక్కునే సజెస్ట్ చేశాడు. ఇంకా టైం దొరకక పోవడం వలన చాలా సినిమాలు చేయలేకపోయాను. 'అభి' సినిమా ఆబ్లిగేషన్ మీద చేశాను. అయితే ఆ సినిమాలో ఉన్న 'వంగతోట..కాడా' సాంగ్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అల్లు అరవింద్ గారికి ఆ పాట బాగా నచ్చిందని ప్రత్యేకంగా చెప్పారు. శ్రీనువైట్ల గారు కూడా చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడకుండా ఒకే రకంగా మ్యూజిక్ చేస్తావని అప్రిషియేట్ చేశారు.

ఎన్టీఆర్ ఫస్ట్ కాల్ చేశారు..

ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ముందురోజు చూసి ఫోన్ చేసి బావుందని చెప్పారు. అలానే రవితేజ, బన్నీ, మహేష్ అందరూ చెప్పారు. సుక్కు సినిమాను డిఫరెంట్ గా నేరేట్ చేస్తారు. 100%లవ్ లో ఇంఫాక్చువేషన్ కాన్సెప్ట్ ఎలా కనెక్ట్ అయిందో.. ఈ సినిమాలో మెచ్యురిటీ కాన్సెప్ట్ అంత బాగా కనెక్ట్ అయింది.

హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి..

సినిమాల్లో హీరోగా నటించమని చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించమని అడుగుతున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు, జ్ఞానవేల్ రాజ ఇలా పెద్ద పెద్ద బ్యానర్ల నుండి ఆఫర్స్ వస్తున్నాయి.

100%లవ్ లో చేయమని అడిగారు..

హాలీవుడ్ లో ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ నటులుగా మారారు. నాకు కూడా నటించాలనుంది కాని స్క్రిప్ట్ బాగా నచ్చాలి. నా బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు తెలుసు. కాబట్టి వారికి నచ్చే విధంగా ఎంట్రీ ఇవ్వాలి. 100%లవ్ సినిమాలో హీరోగా నటించమని మొదట నన్నే అడిగారు. కాని ఇన్నోసెంట్ గా ఉండే అబ్బాయి అయితే సూట్ అవుతాడని చెప్పాను. ఇలా నాకు వచ్చిన ఆఫర్స్ అన్నీ వేరే వాళ్ళయితే బావుంటారని సజెస్ట్ చేసేవాడిని.

ముసలివాళ్ళకు కూడా నచ్చుతుంది..

నేను బయట షోస్ ఇవ్వడానికి వెళ్ళినపుడు 60, 70 సంవత్సరాల వాళ్ళు నా దగ్గరకి వచ్చి నీ మ్యూజిక్ బావుంటుంది.. పాటలకు మేము కూడా డాన్సు చేస్తామని చెప్తుంటే చాలా సంతోషపడేవాడిని. 

ప్లాన్ చేసి చేయలేదు..

ఈ సినిమాలో బ్యాంకాక్ పాటకు, లిరిక్స్, కోరియోగ్రఫీ నేనే చేశాను. కాని ఏది ప్లాన్ చేసి చేయలేదు. అలా కుదిరిపోయింది. బ్యాంకాక్ లో పాట కాకుండా బ్యాంకాక్ కోసం పాట ఉంటె బావుంటుందని బ్యాంకాక్ అనే పాట రాసాను.

కాపీ చేయడం నచ్చదు..

'దేవి' సినిమా తరువాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. అన్నీ సెమి ఫాంటసీ చిత్రాలు కావడంతో ఒప్పుకోలేదు. ఒకే జోనర్ కు ఫిక్స్ అయ్యి మ్యూజిక్ చేస్తే బ్రాండ్ వేసేస్తారని ఆ సమయంలో చాలా గ్యాప్ తీసుకున్నాను. ఒక ఫేమస్ డైరెక్టర్ నన్ను పిలిచి రెండు ఇంగ్లీష్ సినిమా పాటలు వినిపించి అదే మ్యూజిక్ కావాలని చెప్పారు. నేను చేయలేను సర్ అని చెప్పేసాను. వెంటనే ఆయన ఇంత ఆటిట్యూడ్ పనికిరాదు దేవి అని చెప్పారు. సినిమా నచ్చకపోతే వొదిలేస్తాను కాని కాపీ మాత్రం కొట్టను. నాకు తెలిసి కాపీ చేయడం నేరం.

నా ట్యూన్స్ చాలా కాపీ చేశారు..

'రింగ రింగ' సాంగ్ కన్నడలో ఎలాంటి మార్పు చేయకుండా కాపీ చేశారు. అలానే శ్రీలంక లో చాలా పాటలు కాపీ చేశారు. 

మ్యూజిక్ సిట్టింగ్స్ కు ఫారెన్ వెళ్ళను..

నా స్టూడియో లో కూర్చునే మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటాను. సిట్టింగ్స్ కోసం ఫారెన్ వెళ్ళను. టీం నచ్చితే సరదాగా వెళ్తాను అంతే. 'అత్తారింటికి దారేది' సినిమా కోసం అబ్రాడ్ వెళ్లాను. మూడు రోజుల్లో మూడు పాటలను కంపోజ్ చేశాను. 

'నాన్నకు ప్రేమతో' మంచి స్క్రిప్ట్..

'నాన్నకు ప్రేమతో' సినిమా పక్కగా స్క్రిప్ట్ రాసుకొని షూట్ చేస్తున్నాం. 5 నుండి 6 పాటలు ఉంటాయి. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. సినిమా గురించి ఆడియన్స్ కంటే ఎన్టీఆర్ ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. 'నువ్వు, సుకుమార్ గారు ఇరగదీస్తారు' నాకు తెలుసు అని ఫోన్ పెట్టేసాడు. సినిమాలో కొన్ని సీన్స్ అధ్బుతంగా ఉంటాయి.

పవన్ కళ్యాన్ కాల్ చేసి చెప్పారు..

ప్రస్తుతం 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా చేస్తున్నాం. ఒక పాటకు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి 'నువ్వు చేసిన పాట అదిరిపోయింది.. నేను దానికి డబల్ డాన్సు చేసి చూపిస్తా చూడు' అనగానే షాక్ అయ్యాను. ఆరోజు సెట్ లో ఆయన చాలా జోష్ తో ఉన్నారు. మెలోడీ సాంగ్ ఒకటి విని అప్రిషియేట్ చేస్తూ.. పెద్ద మెసేజ్ చేశారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ