Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-రాజ్ తరుణ్!

Tue 17th Nov 2015 05:50 PM
raj tarun interview,kumari 21f,sukumar,devisriprasad  సినీజోష్ ఇంటర్వ్యూ-రాజ్ తరుణ్!
సినీజోష్ ఇంటర్వ్యూ-రాజ్ తరుణ్!
Advertisement
Ads by CJ

హేబా పటేల్, రాజ్ తరుణ్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న చిత్రం 'కుమారి 21 ఎఫ్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా ఎలా ఉండబోతోంది..?

ఈ తరానికి చెందిన ఓ ప్రేమ కథే 'కుమారి 21ఎఫ్'. అందరూ అనుకుంటున్నట్లు ఇది అడల్ట్ కంటెంట్ ఉన్న  సినిమా కాదు. అమ్మాయిలను కించపరిచే విధంగా అస్సలు ఉండదు. సుకుమార్ గారు అమ్మాయిలకు గౌరవం ఇస్తారు. వారిని కించపరిచే విధంగా కాకుండా.. వారిని సపోర్ట్ చేస్తూ ఈ సినిమా తీశారు. ఆరు నుండి అరవై సంవత్సరాల వయసు వరకు అందరూ చూడగలిగే చిత్రం.

సెన్సార్ సభ్యులు సినిమా చూసి ఏమన్నారు..?

విజువల్ గా ఎలాంటి కట్స్ చెప్పలేదు. కొన్ని చోట్ల ఆడియో కట్స్ చెప్పారు. సెన్సార్ రిపోర్ట్ ఏ సర్టిఫికేట్ వచ్చింది. కాని ఫ్యామిలీతో కలిసి చూడగలిగే చిత్రమిది.

సినిమాలో మీ పాత్ర గురించి..?

మొదట ఈ సినిమా కథ విన్నప్పుడు కథలో ఉన్న ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాను. 'ఉయ్యాలా జంపాలా','సినిమా చూపిస్తా మావా' చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హైపర్ గా ఉండకుండా ఒదిగి ఉండే క్యారెక్టర్. నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర. సుకుమార్ గారు రాసిన డైలాగ్స్  నేను చెప్పడం, రత్నవేలు గారి ఫోటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమాలో నటించడం నాకు ఎంతో గర్వంగా ఉంది.

సుకుమార్ గారు హీరోను నెగెటివ్ షేడ్స్ లో ప్రెజంట్ చేస్తారు. మీ పాత్ర కూడా అలా ఉంటుందా..?

సుకుమార్ గారు డైరెక్ట్ చేసిన 100% లవ్ సినిమాలో హీరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి కాని క్లైమాక్స్ వచ్చేసరికి పాత్రను జస్టిఫై చేస్తారు. ఈ సినిమాలో నేను ప్రేమించే అమ్మాయి నాతోనే ఉండాలనుకుంటాను. వేరే వారితో మాట్లాడితే తట్టుకోలేను. రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కాని నెగెటివ్ షేడ్స్ ఉండవు.

మీ రెమ్యునరేషన్ బాగా హైక్ చేస్తున్నారని విన్నాం..?

'సినిమా చూపిస్తా మావా','కుమారి 21 ఎఫ్', నెక్స్ట్ సినిమా ఇంకొకటి షూటింగ్స్ ఒకేసారి చేశాం. ఇప్పటివరకు నా రెమ్యునరేషన్ పెంచలేదు. నాకు పెంచాలని ఉంది కాని ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక ఆలోచిస్తాను. 

సునీల్ గారికి కథ రెడీ చేస్తున్నారా..?

నేను ఖాళీగా ఉంటే స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఉంటాను. సునీల్ అన్న నాకు బాగా క్లోజ్. ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు స్టొరీ రెడీ చెయ్యు.. సినిమా చేద్దామని సరదాగా చెప్తూ ఉంటాడు. నాకు బన్నీ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన కోసం కూడా కథలు రాసుకుంటాను. కాని సీరియస్ గా మాత్రం ఏ కథ సిద్ధం చేయలేదు. సునీల్ అన్న మంచి రైటర్. తను చెప్పే లైన్స్ వింటే ఖచ్చితంగా సినిమా చేయాలనిపిస్తుంది.

హేబా పటేల్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

టైటిల్ కు తగ్గట్లుగా సినిమా కూడా అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాని అన్ని పాత్రలకు సమాన ప్రాముఖ్యత ఉంటుంది. హేబా ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. మోడరన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. చాలా బాగా నటించింది. ఈ చిత్రంతో తనకు మంచి బ్రేక్ వస్తుంది.

రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ గారిపై మీరు ట్విట్టర్ లో చేసిన ట్వీట్స్ గురించి..?

నిజానికి ఆ ట్వీట్స్ చేసింది నేను కాదు. ఆ సమయంలో నేను వర్మ గారు ఒకేచోట ఉన్నాం. నా ఫోన్ తీసుకొని ఆయనే ట్వీట్స్ చేసారు. ఒక డైరెక్టర్ గురించి నేను అలా ఎందుకు మాట్లాడతాను. 

లాంటి కథలు రాయడానికి ఇష్టపడతారు..?

రీసెంట్ గా 'రాక్ స్టార్' సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాంటి పాత్రల్లో నటించాలనుంది. కథలు అంటే.. నేనొక రోడ్ మూవీ రాయాలనుకుంటున్నాను. కామెడీతో పాటు మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాను.  

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

'కుమారి 21 ఎఫ్' కాకుండా మరో సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మారుతి గారు నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. నాగేశ్వర్ రెడ్డి గారు డైరెక్ట్ చేస్తున్న మరో పంజాబీ రీమేక్ సినిమాలో నటించనున్నాను. మంచు విష్ణు గారు ఆ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ వంశీ గారితో కూడా సినిమా చేయడానికి అంగీకరించాను. 'లేడీస్ టైలర్' సినిమాకు సీక్వెల్ అని చెప్పొచ్చు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ