ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విజయవాడలో సమావేశమయ్యారు. రెండు గంట సుధీర్గ చర్చ అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ.. ''అమరావతి శంకుస్థాపనకు రాలేకపోయాను. ముఖ్యమంత్రి గారికి శుబాకాంక్షలు తెలిపేందుకే ఇక్కడకు వచ్చాను. నా దృష్టికి వచ్చిన సమస్యల గురించి ముఖ్యమంత్రి గారితో చర్చించాను. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాల్లో గిరిజనుల జీవితాలు దెబ్బతినకుండా చూడాలని కోరాను. ప్రత్యేక హోదా కోసం చర్చించాను. ప్రధాని నుండి తుది ప్రకటన వచ్చాక స్పందిస్తాను. అనేక సమస్యల గురించి ముఖమంత్రి గారితో మాట్లాడగా.. ఆయన సానూకులంగా స్పందించారు. బి.జె.పి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే. ప్రజలకు చెడు జరిగితే మాట్లాడానికి వెనుకాడను. కేంద్రానికి డెడ్ లైన్ పెట్టే స్థాయి నాకు లేదు. ఆందోళనలు కేంద్రం ఏ మాత్రం పట్టించుకోదు. ప్రస్తుతం మా పార్టీ తరపున ఎన్నికల్లో పాల్గోనట్లేదు. జనసేన పార్టీను రాజకీయ పార్టీగా మార్చే స్థోమత నాకు లేదు. 2019 నుండి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ ఎన్నికల్లో దిగుతుంది'' అని చెప్పారు.