Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-సయేషా(అఖిల్)

Wed 11th Nov 2015 08:58 PM
sayyeshaa,akhil movie,akkineni akhil,vinayak  సినీజోష్ ఇంటర్వ్యూ-సయేషా(అఖిల్)
సినీజోష్ ఇంటర్వ్యూ-సయేషా(అఖిల్)
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్, సయేషా జంటగా నటిస్తున్న చిత్రం 'అఖిల్'. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ సయేషాతో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా ఎలా ఉండబోతోంది..?

అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన ప్యాకేజ్డ్ ఫిలిం ఇది. రొమాన్స్, సాంగ్స్, ఫైట్స్ అన్ని ఉంటాయి. ప్రతిది కథకు లింక్ అయ్యి ఉంటుంది. కామెడీ ప్రేక్షకులకు బాగా అలరిస్తుంది. ఈ చిత్రంలో దివ్య అనే ఒక అమాయకపు స్వీట్ గర్ల్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. 

మొదటి సినిమా తెలుగులో చేస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు..?

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. నిజానికి నా మొదటి సినిమా హిందీలో చేయాల్సింది కాని ఆ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వస్తుండడం వలన తెలుగులో చేసిన సినిమా మొదట రిలీజ్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది. ఈ ఇండస్ట్రీ ద్వారా పరిచయమవ్వడం చాలా సంతోషంగా ఉంది.

అఖిల్ తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది..?

అఖిల్ బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. సపోర్టివ్ కో యాక్టర్. తనలో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంత కాన్ఫిడెన్స్ నేను ఎవరి దగ్గర చూడలేదు. మంచి డాన్సర్. బాగా పెర్ఫార్మ్ చేసాడు.

నటనలో, డాన్సులో ఏమైనా శిక్షణ తీసుకున్నారా..?

ప్రత్యేకంగా ఫార్మల్ గా ఏ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కు వెళ్ళలేదు. ఒకరు ఇంటికి వచ్చి నాకు యాక్టింగ్ గురించి డిస్కస్ చేసేవారు. చిన్నప్పుడు డాన్సుల్లో శిక్షణ తీసుకున్నారు. కథక్, ఒడిసి ఇలా కొన్ని రకాల డాన్సులు వచ్చు. నాకు డాన్స్ చేయడమంటే చాలా ఇష్టం. డాన్స్ కు ప్రాముఖ్యత ఇచ్చే పాత్రల్లో నటించాలనుంది. 'అఖిల్' సినిమాలో రెండు సాంగ్స్ లో బాగా డాన్సు చేసే ఛాన్స్ దొరికింది.

సినిమా విషయంలో ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా..?

వినాయక్ గారు ''నువ్వు కంఫర్ట్ గా ఉంటేనే ఏదైనా చేయగలవు.. సో.. ముందు నీ కంఫర్ట్ చూస్కో.. తరువాతే ఏదైనా..'' అని చెప్పారు. ఆయన మంచి ప్యాషన్ ఉన్న డైరెక్టర్. వినాయక్ గారితో కలిసి మరిన్ని సినిమాలు చేయాలనుంది.

ఎలాంటి చిత్రాల్లో నటించాలనుంది..? 

నా దగ్గర నేను పనిచేయాలనుకున్న డైరెక్టర్స్ లిస్టు ఉంది. డిఫరెంట్ రోల్స్, పెద్ద డైరెక్టర్స్, మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాల్లోనే నటిస్తాను. రాజమౌళి, మణిరత్నం లాంటి దర్శకుల చిత్రాల్లో నటించాలనుంది.

రోల్ మోడల్స్ ఎవరైనా ఉన్నారా..?

మా అమ్మే నాకు రోల్ మోడల్. చాలా మంది నటన నాకు నచ్చుతుంది. ఒక్కరి పేరు చెప్పడమంటే చాలా కష్టం.

తెలుగులో ఏమైనా సినిమాలు చూసారా..?

ఈ సినిమాలో నటించక ముందు వరకు నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. హిందీలో డబ్ అయిన కొన్ని సినిమాలు మాత్రమే చూసాను. రీసెంట్ గా 'శ్రీమంతుడు','బాహుబలి' సినిమాలు చూసాను. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టాలెంటెడ్ హీరోస్ తో కలిసి వర్క్ చేయాలనుంది.

గ్లామరస్ పాత్రల్లో నటిస్తారా..?

ఖచ్చితంగా నటిస్తాను. హీరోయిన్స్ గ్లామరస్ గానే కనిపించాలి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో ఉన్నాయి. ప్రస్తుతం అజయ్ దేవగన్ గారితో 'శివాయ్' అనే హిందీ సినిమాలో నటిస్తున్నాను. నవంబర్ 6 నుండి ఆ సినిమా షూటింగ్ మొదలయ్యింది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ