Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ:నిర్మాత చినబాబు

Sat 31st Oct 2015 07:25 PM
tripura movie,november 6th release,chinababu,rajakiran  సినీజోష్ ఇంటర్వ్యూ:నిర్మాత చినబాబు
సినీజోష్ ఇంటర్వ్యూ:నిర్మాత చినబాబు
Advertisement

స్వాతి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో క్రేజీ మీడియా పతాకంపై రాజకిరణ్ దర్శకత్వంలో చినబాబు నిర్మిస్తున్న చిత్రం త్రిపుర. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 6 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. 

త్రిపుర ఎలా ఉండబోతోంది..?

పల్లెటూరు లో ఉండే అమాయకపు అమ్మాయి స్వాతి కి వచ్చే కలలన్నీ నిజమవుతుంటాయి. దాంతో తన సమస్యను పరిష్కరించుకోవడానికి ట్రీట్మెంట్ కోసం సిటీ వస్తుంది. అక్కడ నవీన్ చంద్రను ప్రేమించి వివాహం చేసుకుంటుంది. తనకు గతంలో వచ్చిన కలలో నవీన్ కూడా ఉంటారు. ఇలాంటి అంశాలతో త్రిపుర చిత్రాన్ని తెరకెక్కించాం.

స్వాతిని దృష్టిలో పెట్టుకొనే కథను సిద్ధం చేసారా..?

లేదు.. గీతాంజలి సినిమా తరువాత రాజకిరణ్, నేను కలసి ఓ సినిమా చేయాలనుకున్నాం. కథ రెడీ చేయకముందే త్రిపుర అనే టైటిల్ పెట్టేశాం. కథ రాసుకున్న తర్వాత స్వాతి అయితే పాత్రకు న్యాయం చేస్తుందని అంతా భావించాం. ఆమెను కలిసి స్టొరీ చెప్పగానే ఓకే చెప్పేశారు. మరో హీరోయిన్ ను పెట్టుకోవాలనే ఆలోచన కూడా మాకు రాలేదు. స్వాతి అంతే అద్బుతంగా నటించింది.

గీతాంజలి, త్రిపుర సినిమాల మధ్య తేడా ఏంటి..?

గీతాంజలి సినిమా హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాం. త్రిపుర.. థ్రిల్లర్ కామెడీ, కుటుంబ కథా చిత్రం. పెళ్లికి ముందు, తర్వాత జీవితం ఎలా ఉంటుంది? భార్యాభర్తల మధ్య అలకలు, ప్రేమానురాగాలు.. ఇలా నవరసాలు ఉన్న చిత్రమిది. దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. సప్తగిరి చేసిన వినోదం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.     

సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరగడానికి కారణం..?

గీతాంజలి సినిమా తర్వాత రాజకిరణ్ దర్శకత్వం వహిస్తున చిత్రం కావడం, కోన వెంకట్, వెలిగొండ స్క్రీన్ ప్లే.. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. అలానే స్వాతి ఇంతకముందు నటించిన రెండు చిత్రాలు హిట్ కావడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ పెరిగింది. 

సినిమా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నారని విన్నాం..?

మొదట మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, ఇప్పుడు ఖర్చుపెట్టిన బడ్జెట్ ఒకటి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించాం. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్ వేశాం. హంపి, బాదామిలలో రెండు పాటలను షూట్ చేసాం. కథను నమ్మి ఖర్చు పెట్టం. అంచనాలు బాగుండడంతో బిజినెస్ బాగా జరిగింది. శాటిలైట్ హక్కులను మూడున్నర కోట్లకు కొన్నారు.  

ఎన్ని ధియేటర్లలో విడుదల చేస్తున్నారు..?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600లకు పైగా ధియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఓవర్సీస్ ప్రేక్షకులలో కూడా చిత్రంపై మంచి అంచనాలున్నాయి. నైజాంలో శ్రీమంతుడు, రుద్రమదేవి చిత్రాలను విడుదల చేసిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ త్రిపుర ను పంపిణీ చేస్తుంది. చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మా చిత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి అంచనాలతో విడుదల కావడం సంతోషంగా ఉంది.    

తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయకపోవడానికి కారణం..?

తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న విడుదల చేయాలనేది మా ప్లాన్. అయితే తెలుగులో కంచె, బెంగాల్ టైగర్, అఖిల్, శంకరాభరణం తదితర చిత్రాల విడుదల తేదీలలో మార్పులు చోటు చేసుకున్నాయి. లక్కీగా థియేటర్లు లభించాయి. బిజినెస్ అంతా ముందే పూర్తవడంతో 6న విడుదల చేస్తున్నాం. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ఇంకా డిసైడ్ అవ్వలేదు. స్వాతి ఒప్పుకుంటే మళ్లీ ఆమెతో సినిమా చేయడానికి రెడీ. త్రిపుర తరహాలో మరో చిత్రం నిర్మించాలనుకుంటున్నా.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.  

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement