Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-వరుణ్ తేజ్

Tue 20th Oct 2015 09:31 AM
varun tej interview,kanche movie,krish,pragnajaiswal  సినీజోష్ ఇంటర్వ్యూ-వరుణ్ తేజ్
సినీజోష్ ఇంటర్వ్యూ-వరుణ్ తేజ్
Advertisement
Ads by CJ

ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన మెగా హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

క్రిష్ తో చేయాల్సింది..

కంచె సినిమా కథ నేను మొదటి సినిమాలో నటించక ముందు నుండే తెలుసు. నిజానికి నా మొదటి సినిమా క్రిష్ గారితో చేయాల్సింది కాని కుదరలేదు. నా సన్నిహితులు కొందరు కమర్షియల్ సినిమాల్లో నటించమని సలహాలు ఇచ్చారు. కంటెంట్ ఉన్న సినిమాల్లోనే నటించాలనుకున్నాను. రెగ్యులర్ గా కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకుంటున్నాను. 

భాష విషయంలో శ్రద్ధ పెట్టా..

దూపాటి హరిబాబు అనే ఓ కుర్రాడు కాలేజీ లో చదువుకుంటూ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తన జర్నీను ఈ సినిమాలో చూపించారు. ఇదొక పీరియాడిక్ ఫిలిం కనుక భాష మీద పట్టు రావాలని యాక్సెంట్ విషయంలో కేర్ తీసుకున్నాను. సైనికుడిలా కనిపించడానికి ట్రైనింగ్ తీసుకున్నాను. ఎందఱో మిలిటరీ పర్సన్స్ ను కలుసుకున్నాను. యుధ్హ నేపధ్యంలో వచ్చిన హాలీవుడ్ సినిమాలు చూసాను. ఈ సినిమా యుద్ధంతోనే మొదలవుతుంది. ఒక వైపు యుద్ధాన్ని చూపిస్తూ.. మరోవైపు విలేజ్ పార్ట్ ను చూపిస్తాం. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. 

బాబాయి ఎక్కువగా ఉపయోగించేవారు..

నాకు చిన్నప్పటినుండి గన్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. బాబాయి తన సినిమాల్లో ఎక్కువగా గన్స్ వాడేవారు. ఆ ప్రభావం కూడా నాపై ఉండేది. ఈ సినిమాలో సుమారుగా 30 నుండి 35 కేజీల బరువుండే గన్ ను సినిమా మొత్తం నా భుజాలపై వేసుకొని మోస్తూనే ఉంటాను. ఫిజికల్ గా చాలా స్ట్రెయిన్ అయ్యేవాడిని. కాని గన్ పట్టుకుంటే మాత్రం ఆథెంటిక్ ఫీల్ వచ్చేది. 1932 లో తయారు చేసిన గన్ ను ఉపయోగించాం.

టాలెంట్ లేకపోతే ఎవరు చూడరు..

నాకు ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లో నటించడమంటే ఇష్టం. ఐదారు సంవత్సారాల తరువాత అలాంటి సినిమాలు చేయలేనేమో. అందుకే కెరీర్ మొదట్లోనే అలాంటి స్క్రిప్ట్స్ లో నటిస్తున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది కమర్షియల్ సినిమాల్లో నటించు. ఎక్స్పెరిమెంటల్ సినిమాలు వర్కవుట్ కావని భయపెట్టారు కూడా.. సినిమాకు కథ అనేది చాలా ముఖ్యం. కంటెంట్ బావుంటే ఎవరైనా చూస్తారు. బ్యాక్ గ్రౌండ్ ఉందని ఒకటి రెండు సినిమాలు మాత్రమే చూస్తారు. టాలెంట్ లేకపోతే ఎవరు చూడరు. అందుకే ముందు నటునిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. దాని కోసం ఎంత హార్డ్ వర్క్ అయిన చేస్తాను.

వాళ్ళ సలహాలు పాటించా..

ముకుంద సినిమా చూసి పెదనాన్న, బాబాయి లు నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. పెదనాన్న అయితే నువ్వు డాన్సు ఇంత బాగా చేస్తావనుకోలేదని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ను ఈ సినిమాలో ఇంప్లిమెంట్ చేసాను. బాబాయ్ ఎప్పుడూ.. నీ ప్యాషన్ ఫాలో అవ్వని చెబుతుంటారు.

హార్ట్ ఎటాక్ నేనే చేయాల్సింది..

పూరి గారితో ప్రస్తుతం చేస్తుంది కమర్షియల్ సినిమానే. ఆయన మొదట నాకు హార్ట్ ఎటాక్ మూవీ కథ చెప్పారు. ఆ సినిమా కూడా నేనే చేయాల్సింది కాని మొదటి సినిమాగా అది కరెక్ట్ కాదని భావించాం. అప్పుడు నితిన్ ఓకే చేసాడు. అలానే ఇప్పుడు నేను పూరి గారి డైరెక్షన్ లో చేస్తున్న కథ నితిన్ చేయాల్సింది కాని నేను చేస్తున్నాను. సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. లోఫర్, మా అమ్మ సీతామహాలక్ష్మి వంటి టైటిల్ అనుకుంటున్నాం. మరో టైటిల్ కూడా వచ్చి చేరొచ్చు. త్వరలోనే తెలియజేస్తాం. మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో ఉందే సినిమా. 

రోప్ సహాయం లేకుండా చేశా..

ఈ సినిమాలో ఓ సన్నివేశంలో రెండు ఫ్లోర్ ల నుండి దూకాలి. నా హైట్ నాకు హెల్ప్ చేసింది(నవ్వుతు..) కాని సెకండ్ ఫ్లోర్ ఎక్కి చూసినప్పుడు ఇంకా డెప్త్ ఉందే.. అనుకున్నాను. క్రిష్ యాక్షన్ చెప్పగానే పైనుండి దూకేసా.. ఎలాంటి రోప్ సహాయం తీసుకోలేదు. ఆ సీన్ రెండు సార్లు చేయాల్సి వచ్చింది. రెండోసారి సులభంగా చేసేసాను.

నిహారిక మొదట పెదనాన్నకే చెప్పింది..

నేను షూటింగ్ లో ఉన్నప్పుడు నిహారిక నాకు ఫోన్ చేసి హీరోయిన్ గా చేయాలనుకుంటున్నాను.. నువ్వేం అంటావని అడిగింది. అప్పటివరకు టివి షోస్ చేసే తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి ఉందననుకోలేదు. తనకు అంత ప్యాషన్ ఉన్నప్పుడు ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో అందరం ఒప్పుకున్నాం. తను మొదట నటిగా మారలనుందని పెదనాన్నకే చెప్పింది. మా నాన్నగారితో నిహారిక ను హీరోయిన్ గా చేయొద్దని చాలా మంది చెప్పారు. కొందరైతే ఇంటికొచ్చి మరీ మాట్లాడారు. మెగాభిమానులు కూడా కొందరికి నిహారిక రావడం ఇష్టం లేదు. అభిమానులే మాకు వెన్నెముక. ఎప్పటినుండో మమ్మల్ని ఆదరిస్తూ.. వస్తున్నారు. పెదనాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అభిమానులను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేయాలని.

క్రిష్ నాకు మంచి ఫ్రెండ్..

క్రిష్ నాకు మంచి స్నేహితుడు. తన సినిమాలంటే చాలా ఇష్టం. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించాడు. సెట్స్ లో ఎప్పుడూ ఉత్సాహంతో ఉంటాడు. తా ఉత్సాహమే మాకు ఎనర్జీ ఇస్తుంది.

ప్రజ్ఞ తో కంఫర్టబుల్ వర్క్..

ప్రజ్ఞ తో చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేసాను. మా ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా సెటిల్డ్ గా ఉంటుంది. మేము ఇద్దరం పరిచయమవ్వడమే సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ తో ఇంట్రడ్యూస్ అయ్యాం.

కథలో వచ్చే పాటలు..

ఆడియో కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విన్న వారందరూ బావుందని చెబుతున్నారు. కథలో భాగంగా పాటలు ఉంటాయి. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్.. 

చాలా కథలు విన్నాను. వింటున్నాను. క్రిష్ కూడా ఓ కథ చెప్పాడు. ఆ సినిమా కూడా చేసే చాన్సస్ కూడా ఉన్నాయంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ