Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-రామ్ చరణ్

Sun 11th Oct 2015 05:50 AM
brucelee movie,ram charan interview,sreenuvaitla  సినీజోష్ ఇంటర్వ్యూ-రామ్ చరణ్
సినీజోష్ ఇంటర్వ్యూ-రామ్ చరణ్
Advertisement
Ads by CJ

గోవిందుడు అందరివాడేలే లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమా తరువాత రామ్ చరణ్ శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రం బ్రూస్ లీ. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా ఎలా ఉండబోతోంది..?

ఇదొక కుటుంబ కథా చిత్రం. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సినిమా మొత్తం రిలేషన్షిప్స్ మెయిన్టైన్ చేస్తూ.. చూపించారు. తండ్రికూతుర్ల బందాన్ని కూడా బాగా చూపించారు. సినిమాలో నా పాత్ర పేరు కార్తిక్. కుటుంబంతో కనెక్ట్ అయ్యి ఉండే తను ఓ స్టంట్ మాస్టర్ గా పని చేస్తూ ఉంటాడు. అలా సాగిపోతున్న తన జర్నీలో తన ప్రొఫెషన్ ఎలాంటి మలుపు తిప్పిందనేదే ఈ సినిమా కథ. లవ్ స్టొరీ కథలో భాగం మాత్రమే.. ముఖ్యంగా ఇదొక ఫ్యామిలీ డ్రామా..

వరుసగా కుటుంబ కథా చిత్రాల్లో నటించడానికి కారణం..?

కావాలని ప్రత్యేకంగా నేను అలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. గోవిందుడు అందరివాడేలే ఫ్యామిలీ ఎంటర్టైనర్. బ్రూస్ లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నా నెక్స్ట్ మూవీ తని ఒరువన్ లో అసలు ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉండవు. అది కూడా నేను ప్లాన్ చేసింది కాదు. 

లుక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు..?

నేను సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాను అంటే మాత్రం ఆ క్రెడిట్ అంతా శ్రీనువైట్ల గారికే చెందుతుంది. ఈ సినిమాకు షార్ట్ హెయిర్ లో కనిపించాలా..? లేక లాంగ్ హెయిర్ లో కనిపించాలా..? అని ఆలోచిస్తున్నప్పుడు శ్రీనువైట్ల గారు చిరుత షూటింగ్ టైం లో నేను దిగిన ఫోటోలు పంపించి దానికి దగ్గరగా ఉండే లుక్ కావాలన్నారు. నాకు హెయిర్ అప్పుడు ఒత్తుగా ఉండేది ఇప్పుడు లేదు సర్ అని చెప్పాను(నవ్వుతు..).   

సినిమా ఎవరితో చూడబోతున్నారు..?

నేను మొదట చెప్పినట్లు సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు అంటే అక్టోబర్ 15న బ్లైండ్ స్కూల్ లో అంధ విద్యార్ధులతో కలిసి సినిమా చూస్తాను. వారు హీరో ఎవరు..? డైలాగ్స్ ఎవరు చెబుతున్నారు..? అనే విషయాలను గుర్తించగలరు.

చిరంజీవి గారు నటిస్తున్న 150వ చిత్రం అనుకోవచ్చా..?

మొదట ఒక ఫైట్ సీన్ కోసం నాన్నగారిని నటించమని అడగడానికి అత్యాస అనిపించింది. ఆయన 150వ చిత్రం నిర్మాతగా నేను ఒప్పుకోలేదు. కాని మా టీం నాన్నగారిని అప్రోచ్ అవ్వగానే ఆయన ఓకే చెప్పారు. శ్రీనువైట్ల గారు ఓ పాట కూడా చేయించాలనుకున్నారు. కాని నేను గట్టిగా వద్దని చెప్పేసా.. నాన్నగారు ఉన్న జోష్ లో సాంగ్ కి కూడా ఓకే చెప్పేసేవారు. ఈ సినిమాలో ఆయనది కేవలం అతిథి పాత్ర మాత్రమే. 150వ చిత్రంగా కన్సిడర్ చేయొద్దు. బ్రూస్ లీ రిలీజ్ అయ్యే సమయానికి నాన్నగారి 150వ చిత్రం గురించి అధికార ప్రకటన చేస్తాం. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ గా ఉండే ఓ సందేశాత్మక చిత్రాన్ని చేయాలనుకుంటున్నాం. 

నిద్ర లేకుండా షూటింగ్ చేసారని విన్నాం..?

అవునండీ.. 24 గంటల్లో ఓ నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేవాళ్ళం. బ్రూస్ లీ సాంగ్ షూటింగ్ కేవలం రెండే రోజుల్లో కంప్లీట్ చేసాం. అసలు ఆ సాంగ్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసామో.. ఎప్పుడు కంప్లీట్ చేసామో కూడా గుర్తులేదు. రోబో లాగా పని చేసాం. రోజు లంచ్ తరువాత షూటింగ్ మొదలుపెట్టి అర్దరాత్రి 2 గంటలకు ముగించేవాళ్ళం. అయినా క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా తీసాం. ఆ క్రెడిట్ అంతా మనోజ్ పరమహంస గారికే చెందుతుంది. అతి తక్కువ సమయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో సినిమా తీసారు.  

షారుఖాన్ గారు షూటింగ్ కు రావడం ఎలా అనిపించింది..?

షూటింగ్ చివరి రోజు రాత్రి రెండు గంటల సమయంలో ఆయన సెట్ కి వచ్చారు. అందరం సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాం. డాన్సులు అన్ని చూసి ఎంజాయ్ చేసారు.

మొదటిసారి కామెడీ సినిమాలో నటిస్తున్నట్లున్నారు..?

ఇది మొత్తం కామెడీ సినిమా అయితే కాదు. స్ట్రాంగ్ పాయింట్ ను శ్రీనువైట్ల గారి స్టైల్ లో ట్రీట్ చేసారు. కథ పరంగా వెళ్తూ ప్రతి సన్నివేశాన్ని ఎంటర్టైనింగ్ గా చూపించాం. నేను ఎప్పుడు చేసే దానికంటే రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఇందులో కామెడీ చేసాను. ఫోర్స్డ్ కామెడీ, ఫోర్స్డ్ యాక్షన్ సినిమాలో ఉండవు. శ్రీనువైట్ల గారి కథను మంచి స్క్రీన్ప్లే తో కోనవెంకట్ గారు తీర్చిదిద్దారు. బ్యాంకాక్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ బావుంటాయి. ఒక్కరి కష్టం అని చెప్పలేం. టీం ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా.

మ్యూజిక్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..?

సినిమాలో 5 పాటల్లో 4 పాటలు మంచి హిట్ అయ్యాయి. యునానిమస్ గా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్ మ్యూజిక్ కు మరి నేను డాన్సు పరంగా జస్టిఫై చేసానో లేదో.. తెలియదు.

నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి విడుదల చేయడానికి ఏమైనా కారణాలున్నాయా..?

సినిమాను ప్రారంభించిన మొదటిరోజే రిలీజ్ డేట్ చెప్పేసామనే తొందరలో అయితే సినిమా చేయలేదు. అనుకున్న డేట్ కే రావాలని ఎవరిని తొందర పెట్టలేదు. సంతోషంగా షూటింగ్ చేసుకుంటూ వెళ్లాం. ఒకవేళ రిలీజ్ లేట్ గా చేయాలనుకుంటే ఇంకో రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకునేవాళ్ళం.

రుద్రమదేవి కోసం సినిమా ఏమైనా వాయిదా వేసే అవకాశాలున్నాయా..?

మేము ఎవరి మీద పడలేదు. వాళ్ళే మా మీద పడ్డారు. మేము చెప్పిన సమయానికే సినిమా రిలీజ్ చేస్తున్నాం. నేను ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయలేదు. బాహుబలి సమయానికి శ్రీమంతుడు సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి రాజమౌళి గారు శ్రీమంతుడు టీం కి ఫోన్ చేసి సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయమని అడిగారు. శ్రీమంతుడు టీం కిక్2 సినిమాను పోస్ట్ పోన్ చేయమని వాళ్ళని అడిగారు. అలానే ఆగడు సినిమా రిలీజ్ సమయంలో గోవిందుడు అందరివాడేలే వాయిదా వేయమని శ్రేనువైట్ల గారు అడిగిన వెంటనే ఆయన చెప్పినట్లే చేసాం. కాని ఇప్పుడు మాత్రం కుదరట్లేదు. నెక్స్ట్ నుంచి ముందు ఎవరు రిలీజ్ డేట్ చెప్తారో.. వారి సినిమాకు 15 రోజులు ముందు, తరువాత ఏ సినిమాలు రిలీజ్ కాకుండా ఉండేలా అందరు జాగ్రత్త పడితే ఇండస్ట్రీ ఆరోగ్యకరంగా ఉంటుంది.

మీరే స్టైలిష్ గా కూడా చూసుకున్నారంట..?

నిజానికి స్టైలిష్ కోసం ఎదురు చూసే అంత సమయం నాకు లేదు. అందుకే ఈ సినిమాకు స్టైలిష్ గా కూడా నేనే వ్యవహరించాను. 

శ్ర్రేనువైట్ల గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

ఆయన సినిమాలు ఉన్నట్లుగానే ఆయన కూడా చాలా జోవియల్ గా ఉంటారు. పెద్ద డైరెక్టర్ అనే గర్వం, మొండితనం ఆయనలో ఉండవు. 

ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాకు బ్రూస్ లీ టైటిల్ ఎంత వరకు ఓకే అనుకుంటున్నారు..?

ఈ సినిమా టైటిల్ పెట్టినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ దూరమవుతరేమో అనే భయముండేది. కాని ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత వారికే ఎక్కువగా నచ్చుతుంది. శ్రీనువైట్ల గారి మీద నమ్మకంతో టైటిల్ పెట్టాం.  

ఫ్లూట్ స్టెప్ అందరిని బాగా ఆకర్షిస్తుంది..!

నిజం చెప్పాలంటే నాకు అసలు ఆ స్టెప్ వేయడం ఇష్టం లేదు. డైరెక్టర్ గారు డాన్సు మాస్టర్ బలవంతంగా నాతో స్టెప్ వేయించారు. రొటీన్ గా ఫ్లూట్ సాంగ్ కు ఫ్లూట్ స్టెప్ వేయాలా..? అనిపించింది. కన్విన్స్ అయ్యి డాన్సు చేసాను. ఫైనల్ గా అదే అందరికి నచ్చుతుంది.

పవన్ కళ్యాణ్ నిర్మాతగా మీ సినిమా ఎప్పుడు ఉంటుంది..?  

బాబాయ్‌ ప్రస్తుతం సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఆ సినిమా వివరాలను ప్రకటిస్తాం. ప్రస్తుతమయితే ఇద్దరు ముగ్గురు రచయితల సమక్షంలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

మీ ఫ్యామిలీ లో మల్టీస్టారర్ ఎప్పుడు ఉంటుంది ..?

ఖచ్చితంగా చేస్తాం. అది నేను బన్నీ అవ్వొచ్చు.. లేదా మరొకరితో అయిన అవ్వొచ్చు. కథ నచ్చితే డెఫినిట్ గా చేస్తాం.

ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారా..?

నాన్నగారు చేయబోయే 150 సినిమా నుండి కొణిదల ప్రొడక్షన్ కంపెనీ అనే సంస్థ స్థాపించి పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అది కాకుండా వైట్ హార్స్ పేరిట మరో ప్రొడక్షన్ కంపెనీ మొదలు పెట్టి రెండు,మూడు కోట్ల బడ్జెట్ లో సినిమాలు తీసి కొత్త దర్శకులకు, నటీనటులకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

డిసెంబర్ నుండి తని ఒరువన్ షూటింగ్ మొదలు కానుంది. సురేందర్ రెడ్డి దాన్ని డైరెక్ట్ చేయనున్నారు, దాని తరువాత గౌతం మీనన్ తో మరో సినిమా చేయనున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ