Advertisementt

అదరహో అనిపిస్తున్న బాలకృష్ణ..!

Sun 11th Oct 2015 04:05 AM
balakrishna,hindupuram,mla,tdp  అదరహో అనిపిస్తున్న బాలకృష్ణ..!
అదరహో అనిపిస్తున్న బాలకృష్ణ..!
Advertisement
Ads by CJ

సినీతారలు రాజకీయాల్లోకి అడుగెట్టడం ఎప్పటినుంచో జరుగుతున్నదే. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారు తమ సినిమాల్లోనే బిజీగా ఉండి.. నియోజకవర్గ సమస్యలను పట్టించుకోరనే అపవాదు కూడా వారిపై ఉంది. అయితే సినిమాల్లోనే కాకుండా తన నియోజకవర్గం హిందూపురంలో కూడా ఓటర్లతో  బాలయ్య బాబు శేభాష్‌ అనిపించుకుంటున్నారు.

టీడీపీ తరఫున బాలయ్యబాబు రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలోల ఆయన అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అందరి మాదిరిగానే ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని మొదట్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు, స్థానికులు కూడా పలుమార్లు ఈ విషయమై ఆందోళన చేశారు. దీంతో మేల్కొన్న బాలకృష్ణ ఇక నెలలో కనీసం నాలుగు రోజులపాటు తన సొంత నియోజకవర్గంలోనే గడుపుతున్నారు. అంతేకాకుండా తనకున్న పరపతితో ప్రజాసమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. దీంతో ప్రజల్లో ఆయనపై అభిమానం పెరిగింది. ఆ జిల్లాలో మిగితావారికంటే కూడా బాలకృష్ణ పనితీరు చాలా మెరుగ్గా ఉందని ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కూడా బాలకృష్ణకు పాస్‌ మార్కులు వచ్చినట్లు సమాచారం. అటు తన సినిమాలు ఇటు తన కుటుంబ వ్యవహారాలకుతోడు తన నియోజకవర్గ అభివృద్ధిని కూడా బాలకృష్ణ సమర్థవంతంగా నిర్వహిస్తూ అదరహో అనిపిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ