Advertisementt

బాబు ఆహ్వానిస్తున్నారు.. కేసీఆర్‌ వెళతారా..?

Sun 11th Oct 2015 03:26 AM
amaravathi,shankusthapana,kcr,chandrababu,invitatation  బాబు ఆహ్వానిస్తున్నారు.. కేసీఆర్‌ వెళతారా..?
బాబు ఆహ్వానిస్తున్నారు.. కేసీఆర్‌ వెళతారా..?
Advertisement

ఏపీ రాజధాని అమరావతి శంఖుస్థాపనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు అదేస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతోసహా నరేంద్రమోడీ, ఇతర రాష్ట్రాల సీఎంలను కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు. ఇక శంఖుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందుతుందా..? లేదా..? అనే అనుమానాలున్నాయి. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్‌కు స్వయంగా తానే ఆహ్వాన పత్రికను అందిస్తానని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

మొదటినుంచి అంతంతగానే ఉన్న చంద్రబాబు, కేసీఆర్‌ల సంబంధబంధవ్యాలు ఓటుకు నోటు కేసుతో మరింత దిగజరాయి. ఈ కేసుతో ఆ రెండు పార్టీల మధ్యే కాకుండా రెండు రాష్ట్రాల నడుమ కూడా విభేదాలు తలెత్తాయి. అయితే రాజధాని శంఖుస్థాపనకు కేసీఆర్‌ను తానే స్వయంగా ఆహ్వానిస్తానని చెప్పి చంద్రబాబు అందరికీ షాక్‌నిచ్చారు. సీఎంలు, పెద్ద బిజినెస్‌మ్యాన్లను మినహాయించి మిగితా వారిని ఆహ్వానించే బాధ్యతను ఆయన తన మంత్రివర్గానికి అప్పజెప్పినట్లు సమాచారం. త్వరలోనే చంద్రబాబు స్వయంగా సీఎం కేసీఆర్‌ ఇంటికి వెళ్లి ఆయన్ను రాజధాని శంఖుస్థాపనకు రావాల్సిందిగా కోరుతారని సమాచారం. మరి ఈ ఆహ్వానానికి సీఎం కేసీఆర్‌ ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజధాని శంఖుస్థాపనకు సీఎం కేసీఆర్‌ వెళితే రెండు రాష్ట్రాల నడుమ సంబంధబంధవ్యాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సెటిలర్స్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్న కేసీఆర్‌కు ఇది కలిసొచ్చే పరిణామమే. అయితే చివరి క్షణం వరకూ తాను ఏం చేసే విశయమై స్పష్టత ఇచ్చే అలవాటు లేని కేసీఆర్‌ ఈ ఆహ్వాన ప్రతిపాదనకు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement