Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: రకుల్ ప్రీత్ సింగ్

Fri 09th Oct 2015 04:04 AM
  సినీజోష్ ఇంటర్వ్యూ: రకుల్ ప్రీత్ సింగ్
సినీజోష్ ఇంటర్వ్యూ: రకుల్ ప్రీత్ సింగ్
Advertisement

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకెళ్తున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఆమె శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించిన బ్రూస్ లీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 10న రకుల్ పుట్టినరోజు సందర్భంగా విలేకర్లతో చిత్ర విశేషాల గురించి ముచ్చటించారు.

బ్రూస్ లీ విశేషాలు మీ మాటల్లో..?

ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలన్నింటిలో చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం బ్రూస్ లీ. ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఇందులో రియా అనే వీడియో గేమ్స్ డిజైన్ చేసే అమ్మాయి పాత్రలో కనిపించనున్నాను. స్టంట్ మాస్టర్ అయిన హీరో మీద గేమ్ డిజైన్ చేస్తాను. ఆలోచించకుండా మాట్లాడుతూ ఉండే క్యారెక్టర్. నా స్టుపిడిటీ తో ప్రేక్షకులను నవ్విస్తాను. బ్రూస్ లీ ఒక పవర్ ప్యాకెడ్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. 

సాంగ్స్ లో చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు..?

నేను అలా కనిపిస్తున్నానంటే ఫస్ట్ క్రెడిట్ నా జిమ్ కే చెందుతుంది. శ్రీనువైట్ల గారి విజువలైజేషన్, నా స్టైలిష్ సహాయంతో నేను అందంగా కనిపిస్తున్నాను. గ్లామరస్ గా ఉంటాను కానీ ఎక్కడా వల్గారిటీ ఉండదు. 

సినిమాలో సాంగ్స్ కోసం హార్డ్ వర్క్ చేసారంట..?

సినిమాలో లుక్ కొత్తగా కనిపించాలని సుమారుగా 15 నుండి 20 రోజులు దానిపై చాలా వర్క్ చేసాం. పాటలు ఇంటర్నేషనల్ లెవెల్ లో కనిపించాలాని జాగ్రత్తలు తీసుకున్నాం. రెండు పాటల కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసాం. 

చరణ్ తో డాన్స్ చేయడం కష్టంగా అనిపించలేదా..?

చరణ్ డాన్స్ చూస్తుంటే తన శరీరంలో బోన్స్ లేవేమో అనిపిస్తుంది. మొదట తనతో డాన్స్ చేయాలంటే చాలా భయమేసేది. తను రిహార్సల్స్ అవసరం లేకుండానే డాన్స్ చేసేస్తాడు. నేను రెండు రోజుల ముందు నుండి రిహార్సల్స్ చేసేదాన్ని. చరణ్ స్టార్ హీరో అయినా తనలో ఎలాంటి యారోగన్స్ లేదు. మంచి హ్యూమర్ ఉన్న పర్సన్. తన నుండి చాలా నేర్చుకున్నాను.

మీకు మార్షల్ ఆర్ట్స్ లో టచ్ ఉందా..?

నాకు మార్షల్ ఆర్ట్స్ గురించి అసలు తెలియదు. చిన్నప్పుడు మాత్రం కరాటే నేర్చుకున్నాను. సెల్ఫ్ డిఫెన్సు అయితే చేయగలను. 

షూటింగ్ సమయంలో ఏమైనా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉందా..?

లే చలో సాంగ్ లో చిరంజీవి గారు నన్ను చూసి మెచ్చుకున్నారు. మొదటిరోజు ఆయన షూటింగ్ కి వచ్చినప్పుడు నన్ను పిలిచి సాంగ్ చూసాను చాలా అందంగా కనిపిస్తున్నావని చెప్పగానే సంతోషంగా అనిపించింది. ఆడియన్స్ నుండి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. నాకు తెలియదు కానీ చిరంజీవి కాంప్లిమెంట్ తో నాకు చాలా తృప్తిగా అనిపించింది. ఆయన సినిమాల పట్ల ఎంతో ప్యాషన్, డెడికేషన్ తో ఉంటారు. డైరెక్టర్ షాట్ ఓకే అని చెప్పినా.. ఆయన ఇంకోసారి చేస్తానని చెప్పేవారు. ఈ సినిమా కోసం చిరంజీవి గారితో కలిసి వర్క్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను.

మిమ్మల్ని బాగా సర్ప్రైస్ చేసిన విషయం..?

రాత్రి 12 గంటల సమయంలో యూనిట్ అంతా సాంగ్ షూట్ చేసే పనిలో ఉన్నాం. సడెన్ గా అందరూ బయటకి వెళ్ళిపోతున్నారు. నేను చరణ్ సెట్ మీద ఉన్నాం. ఏం జరుగుతుందో.. మాకు అర్ధం కాలేదు. తరువాత చూస్తే ఎదురుగా షారుఖాన్ ఉన్నారు. బ్రూస్‌లీ యూనిట్‌కి సూపర్‌సర్‌ప్రైజ్‌ ఇచ్చారాయన. షారుఖ్‌ సెట్‌లోనే కూర్చొని చెర్రీ స్టెప్పులు చూసి ఎంజాయ్ చేసారు. తరువాత మానిటర్ లో చూసి రిహార్సల్స్ లేకుండా చాలా బాగా చేసావని చరణ్ ను పొగిడారు. అలానే ఫైట్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు చాలా త్రిల్ ఫీల్ అయ్యాను.

డైరెక్టర్ శ్రీనువైట్ల గురించి చెప్పండి..?

శ్రీనువైట్ల గారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయనకు కరెక్ట్ మీటర్ తెలుసు. ఆడియన్స్ ను ఎలా నవ్వించాలి.. ఎక్కడ పంచ్ డైలాగ్ వేస్తే ప్రేక్షకులను ఆకట్టుకోగలమనే విషయాలు ఆయనకు బాగా తెలుసు. 

నిర్మాత దానయ్య గారి గురించి..?

సినిమా లుక్ గ్రాండ్ గా ఉండాలని దానయ్య గారు చాలా ఖర్చు పెట్టారు. వేరే వాళ్ళ పనుల్లో ఆయన అసలు జోక్యం చేసుకోరు. చాలా ఫ్రీడం ఇస్తారు. పది రోజులు ఇటలీ లో షూటింగ్ చేసినప్పుడు క్లైమాక్స్ కోసం బ్యాంకాక్ లో షూటింగ్ చేసినప్పుడు హాలిడే కు ఎంజాయ్ చేసినట్లు ఎంజాయ్ చేసారు. టీం ని చాలా నమ్మారు. 

సినిమాలో హైలైట్స్ ఏంటి..?

చరణ్ క్యారెక్టర్, శ్రీనువైట్ల గారి కమర్షియల్ సెన్స్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఇలా ప్రతి ఎలిమెంట్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది. 

హీరోయిన్స్ లో మీకు కాంపిటిషన్ ఎవరనుకుంటున్నారు..?

నాకు నేనే కాంపిటిషన్. పీస్ ఆఫ్ మైండ్ తో సంతోషంగా నేను పని చేసుకోవాలి. కాంపిటిషన్ గురించి ఆలోచిస్తూ ఉంటే నటన మీద ఫోకస్ చేయలేను. కాంపిటిషన్ అనే విషయాన్ని అసలు పట్టించుకోను. హీరోయిన్ గా నా నంబర్ ఎంత అనే విషయాల గురించి ఆలోచించను.  

తెలుగులో మీ ఫేవరెట్ హీరో..?

పవన్ కళ్యాన్ గారు, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా చాలా మంది యాక్టర్స్ నాకు నచ్చుతారు.

బ్రహ్మొత్సవం మిస్ అయినట్లుంది..?

దురదృష్టవశాత్తు ఆఫర్ వచ్చినా ఆ సినిమాలో నటించడం కుదరలేదు.

తదుపరి చిత్రాలు..?

ప్రస్తుతం సుకుమార్ గారి దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ సరైనోడు చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీ లో నేను నటించిన సిమ్లా మిర్చి సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇతర భాషల్లో సినిమాలు చెయ్యట్లేదు. రెండు సంవత్సరాలుగా విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్నాను. సో.. ఈ డిసెంబర్ నుండి మెల్లగా సినిమాలు చేయాలనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement