Advertisementt

అక్టోబర్ 4న సామూహిక సత్యనారాయణ వ్రతాలు!

Thu 01st Oct 2015 10:41 PM
sai venkat,thummalapalli ramasathyanarayana,swarna bharathi foundation  అక్టోబర్ 4న సామూహిక సత్యనారాయణ వ్రతాలు!
అక్టోబర్ 4న సామూహిక సత్యనారాయణ వ్రతాలు!
Advertisement
Ads by CJ

సినీ దర్శక నిర్మాత సాయి వెంకట్ స్వర్ణభారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతో, సినీ పరిశ్రమ సర్వతో ముఖాభివృద్ధికై సామూహిక శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 4న ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని చిత్రపురి కాలనీలో ఉదయం 5గంటల నుండి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా..

సాయి వెంకట్ మాట్లాడుతూ..  ప్రతి ఏటా కూకట్ పల్లిలోని భ్రమరాంబ మండపంలో ఈ వ్రతాలను నిర్వహిస్తూ వచ్చాం. ఈ సంవత్సరం మాత్రం సినీ పరిశ్రమ శ్రేయస్సు కొరకు ఐదువేల కుటుంబాలు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో ఈ సామూహిక శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతాలను నిర్వహించాలని భావిస్తున్నాం. ఇప్పటికే నిర్మాతల మండలి, మా అసోసియేషన్ తదితర బృందాలను ఈ కార్యక్రమలో పాలుపంచుకోమని కోరాము. ఈ కార్యక్రమంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనాలి కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. నాకు సాయి వెంకట్ గారు 10 సంవత్సరాలుగా పరిచయం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. 2008 నుంచి ఈ వ్రతాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నందుకు ఆయనను అభినందిస్తున్నాను. సుమారుగా 10 నుంచి 15 లక్షల రూపాయలను ఈ వ్రతాల కోసం ఖర్చు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ