Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- సాయిధరమ్‌తేజ్‌

Mon 21st Sep 2015 06:00 AM
saidharam tej,subrahmanyam for sale,dil raju,hareesh shankar  సినీజోష్ ఇంటర్వ్యూ- సాయిధరమ్‌తేజ్‌
సినీజోష్ ఇంటర్వ్యూ- సాయిధరమ్‌తేజ్‌
Advertisement
Ads by CJ

మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం సుబ్రమణ్యం ఫర్‌సేల్‌. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్‌తేజ్‌ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి..?

డబ్బు సంపాదించాలనే తపనతో అమెరికా వెళ్ళిన యువకుని పాత్రలో కనిపిస్తాను. డబ్బు కోసం అన్ని రకాలా ఉద్యోగాలు చేస్తుంటాడు. రెస్టారంట్ లో, టాక్సీ డ్రైవర్ గా ఇలా పని చేసుకుంటూ ఉన్న అబ్బాయికి ఓ అమ్మాయి పరిచయమవుతుంది. తను కొన్ని సమస్యల్లో ఉంటుంది. వాటిని హీరో సాల్వ్ చేసి, ఇద్దరు ప్రేమలో పడే అంశాలతో సినిమా రన్ అవుతుంటుంది. 

గబ్బర్ సింగ్ సినిమా చేసాడని హరీష్ కు ఓకే చెప్పారా..?

హరీష్ అన్న నాకు మిరపకాయ్ సినిమా టైం నుంచి తెలుసు. ఆయన నాతో సినిమా చేయాలని కథ చెప్పడానికి వచ్చారు. చెప్పే ముందే నేను గబ్బర్ సింగ్ డైరెక్టర్ అనుకొని కథ వినకు. రామయ్య వస్తావయ్య సినిమా డైరెక్టర్ గా కథ చెబుతున్నాను. స్టొరీ నచ్చితేనే సినిమా చేద్దాం అన్నారు. ఆయన కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేసాను. నాకు స్టొరీ అంతబాగా నచ్చింది. 

చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్లు ఆయన నటించిన మొగుడు కావాలి సినిమాలనే ఇది కూడా ఉంటుందా..?

హరీష్ అన్న చాలా సినిమాల నుండి ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు. ట్రైలర్ చూసినప్పుడు మావయ్యకు బావగారు బాగున్నారా, మొగుడు కావాలి సినిమాల్లాగా అనిపించి ఉండొచ్చు. కాని ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. దిల్ రాజు గారు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు తీస్తుంటారు. అలానే హరీష్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలు తీస్తారు. ఆ రెండు జోనర్స్ కలిస్తే ఎలా ఉంటుందే అదే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. 

ఈ సినిమాలో చిరంజీవి గారి సాంగ్ ను రీమేక్ చేసారు. అలా చేసి ఆ పాట వాల్యూస్ తగ్గిస్తున్నామేమో అనుకున్నారా..?  

అసలు లేదు. సినిమాలో ఇంటర్వెల్ కు ముందు ఓ మాస్ సాంగ్ ఉంటుంది. దాని తరువాత వెంటనే మంచి మెలోడీ సాంగ్ ఉండాలి. అది విన్న వెంటనే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వాలనే ఆలోచనతో రీమేక్ సాంగ్ చేయాలనుకున్నాం. చాలా పాటలను ఫిల్టర్ చేసిన తరువాత గువ్వా గోరింకతో సాంగ్ సెలెక్ట్ చేసారు. ఈ సాంగ్ సెలక్షన్ మాత్రం దిల్ రాజు గారు, హరీష్ అన్న ల ఛాయిస్. ఈ పాట కోసం ప్రత్యేకంగా అమెరికా లోని గ్రాండ్ కెన్యా అనే ప్రాంతంలో షూట్ చేసాం. ఇప్పటివరకు అక్కడ ఏ సినిమా షూటింగ్ జరగలేదు. అక్కడ పర్మిషన్ కూడా కేవలం ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకే. ఆ రెండు గంటల్లోనే మేము పాటలో చరణం, పల్లవి షూట్ చేసాం. రాత్రి 12 గంటల వరకు రిహార్సల్స్ జరిపి ఉదయం మూడు గంటలకే బయలుదేరి ఆ పాట షూటింగ్ కంప్లీట్ చేసాం. ఆ సాంగ్ కు అంత వాల్యూ ఇచ్చాం. స్టాండర్డ్స్ తగ్గే విధంగా ఎక్కడా ఉండదు. 

మీ యాక్టింగ్ ను, డాన్సులను చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో పోలుస్తుంటారు. నిజంగానే వారిని ఇమిటేట్ చేస్తారా..?

బహుసా చిన్నప్పటి నుండి వారిని చూస్తూ పెరగడం వలన వాళ్ళ మేనరిజం వచ్చి ఉండొచ్చు. అంతేకాని వారిని ఇమిటేట్ చేసే విధంగా నేను ఎప్పుడు ప్రవర్తించలేదు. నా బాడీ లాంగ్వేజ్ అంతే. 

రెజీనా తో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

తను నాకు మూడు సంవత్సరాలుగా తెలుసు. ఇద్దరం మంచి ఫ్రెండ్స్. తనతో ఆల్రెడీ పిల్లా నువ్వు లేని జీవితం సినిమా చేసాను. సో.. తనతో కలిసి వర్క్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాను. నేను ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి కాస్త ఇబ్బంది పడతాను. కాని రెజీనా నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి ఏమైనా ప్రాబ్లం అయితే ఇద్దరం డిస్కస్ చేసుకొని హరీష్ కు చెప్పేవాళ్ళం.

కథల ఎంపిక విషయంలో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతారా..?

ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. సొంత నిర్ణయాలే తీసుకుంటాను. కాని కథ ఓకే చేసాక చిన్న మావయ్య(పవన్ కళ్యాన్)కు సినిమా చేస్తున్నాను అని ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన నా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రీసెంట్ గా నేను బైక్ కొన్నానని తెలిసి వెంటనే ఫోన్ చేసారు. హెల్మెట్ కొన్నావా, గ్లౌజెస్ తీసుకున్నావా అని చాలా ప్రశ్నలు అడిగారు. ఆయనకు నేనంటే అంత కేరింగ్. కొంచెం డబ్బు సంపాదించిన తరువాత స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ మధ్యనే హార్లీ డేవిడ్సన్ బైక్ కొనుకున్నాను. 

వరుసగా దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో సినిమాలు చేయడానికి కారణం..?

మంచి ప్రాజెక్ట్స్, నేను అనుకున్న రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అందుకే ఆయన ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తున్నాను. నా తదుపరి చిత్రాలు కూడా ఆయనతో కమిట్ అయ్యాను. జనాలని సంతృప్తి పరిచే సినిమాలే చేస్తాను. ఒక నటునిగా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎవరైనా మంచి కథలతో అప్రోచ్ అయితే ఖచ్చితంగా వేరే బ్యానర్ లో కూడా నటిస్తాను.

షూటింగ్ టైంలో ఏమైనా మెమొరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా..?

మొదటిసారి నాగబాబు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. షూటింగ్ కు ఆయన రాకముందు వరకు సులువుగా యాక్ట్ చేసేవాడ్ని. ఆయన వచ్చాక డైలాగ్ చెప్పడానికి చాలా టేక్స్ తీసుకున్నాను. సడన్ గా ఆయనని చూసి చిన్నపిల్లాడ్ని అయిపోయాను. తరువాత ఆయన నా దగ్గరకి వచ్చి ఏంట్రా ప్రాబ్లం ఎందుకు చేయలేకపోతున్నావని అడిగారు. మిమ్మల్ని చూడగానే టెన్షన్ వచ్చేసిందని చెప్పాను. ఆ తరువాత నాగబాబు గారు, హరీష్ అన్న నాకు సర్ది చెప్పి డైలాగ్ చెప్పించారు.

మీ దగ్గరకి వచ్చిన స్క్రిప్ట్స్ మీ ఫ్యామిలీలో వేరే హీరోలకు సూట్ అవుతాయని అలా ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా..? 

ఇప్పటివరకు అలా అయితే జరగలేదు. కాని నిజంగా నాకంటే వరుణ్ కో మరోకరికో సూట్ అవుతాయంటే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాము. ఫ్యూచర్ లో అలా జరిగే పాజిబిలిటీస్ ఉన్నాయి.

కాంపిటిషన్ మధ్యలో సినిమా రిలీజ్ అవుతున్నట్లుంది..?

సినిమాలు వరుసగా రిలీజ్ అయితే ఇండస్ట్రీకి మంచిదే. నేను బిజినెస్ యాంగల్ లో ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమా బావుంటే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. కాంపిటిషన్ అనుకోను. బ్యాక్ టు బ్యాక్, ఒకేరోజు రిలీజ్ అయిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ సుప్రీం ఏసి డిటిఎస్ సినిమాలో నటిస్తున్నాను. అది కాకుండా దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో శతమానం భవతి సినిమాలో నటిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ