సినిమాలపై మక్కువతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించి ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పని చేసిన వ్యక్తి నట్టికుమార్. సెప్టెంబర్ 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీకు వచ్చి సుమారు 13 సంవత్సరాలయ్యింది. అతి తక్కువ సమయంలో 63 సినిమాలను ప్రొడ్యూస్ చేసాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో భాధ్యతలు నిర్వహించాను. రాజకీయాలపై ఆసక్తి లేక వాటికి దూరంగా ఉన్నాను. నేను ఈ ఇండస్ట్రీలో చివరివరకు గౌరవించే వ్యక్తి దాసరి నారాయణరావు గారు. ఆయన తరువాత నాకు కొన్ని మెళకువలు నేర్పింది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అలానే ప్రొడక్షన్ వైపు నాకు రామనాయుడు గారు ఎంతగానో సపోర్ట్ చేసేవారు. ఈరోజు ఆయన లేకపోవడం బాధాకరం. నాకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో నాయుడు గారు ఉండేవారు. అతి తక్కువ సమయంలో సినిమాలు ఎలా తీయాలో మహీంద్ర గారి దగ్గర నేర్చుకున్నాను. ప్రొడ్యూసర్ గా నా లాస్ట్ మూవీ యుద్ధం. ఆ తరువాత సినిమాలను నిర్మించకూడదని ఫిక్స్ అయ్యాను. కాని నా బిడ్డల స్పూర్తితో ఈ డిసెంబర్ నెల నుండి సినిమాలని నిర్మించాలని డిసైడ్ అయ్యాను. మంచి కథతో ఏ దర్శకుడు నా దగ్గరకి వచ్చినా సినిమా చేస్తాను. కాని నిర్మాతగా మాత్రం నా పిల్లల పేర్లు మాత్రమే ఉంటాయి. ఎల్.కె. మీడియా ప్రై లిమిటెడ్ పేరిట సంవత్సరానికి 8 నుండి 9 సినిమాలు రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. డిస్త్రిబ్యూటర్ గా చేసాను. ఎన్నో థియేటర్లు కట్టించాను. మార్కెట్ విలువలు తగ్గాయి కాబట్టే సినిమాలు నిర్మించడం మానేసాను. 2016 లో నా కుమారుడు క్రాంతి ను హీరోగా పెద్ద బ్యానర్ లో పెద్ద దర్శకుడితో పరిచయం చేయనున్నాను. ప్రస్తుతం తను న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. మా ట్రస్ట్ తరపున ఎందరికో సహాయసహకారాలు అందించాం. హుదుద్ బాదితులకు మా వంతు సహాయం అందించాం. వైజాగ్, చోడవరం లలో ఉన్న ఎయిడ్స్ పేషెంట్స్ కు నెల నెల కొంత డబ్బు పంపిస్తున్నాం. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.. అని చెప్పారు.