Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-హీరో నాని

Fri 04th Sep 2015 05:06 AM
bhale bhale magadivoy,nani,maruthi,lavanya tripathi  సినీజోష్ ఇంటర్వ్యూ-హీరో నాని
సినీజోష్ ఇంటర్వ్యూ-హీరో నాని
Advertisement
Ads by CJ

నాని, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో జి.ఎ2, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై మారుతి దర్శకత్వంలో బన్నివాసు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం భలే భలే మగాడివోయ్‌.  ఈ చిత్రం సెప్టెంబర్‌ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నాని తో సినీజోష్ ఇంటర్వ్యూ..

అది పొగడ్త కాదు తిట్టు..

భలే భలే మగాడివోయ్ అనే టైటిల్ చూసి అందరూ పొగడ్త అనుకుంటున్నారు.. కాని అది పొగడ్త కాదు తిట్టు. ఎవరికైనా మన చేష్టలతో విసుగొస్తే ఎవడ్రా బాబు వీడు అని తిట్టుకుంటారు. ఈ సినిమాలో హీరోకు ఉన్న మతిమరుపు సమస్యతో తన అనుకున్న పనిచేసే విషయంలో ఎలా సక్సెస్‌అయ్యాడో చూపిస్తున్నాం కాబట్టే ఈ టైటిల్‌ను పెట్టాం. ఈ సినిమా చూసిన తరువాత యాప్ట్ టైటిల్ అని అందరూ అనుకుంటారు. 

అనుకున్న దానికంటే గొప్పగా..

మారుతి గారు డైరెక్ట్ చేసిన ప్రేమ కథా చిత్రం చూసాను. ఆయన ఈ సినిమా కథ నాకు వినిపించినంత సేపు నవ్వుతూనే ఉన్నాను. మారుతి గారు అధ్బుతంగా నేరేట్ చేస్తారు. కథ విన్న వెంటనే ఓకే చేసేసా. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన రాసిన ప్రతి డైలాగ్ ప్రేక్షకులను నవ్వించే విధంగా చిత్రీకరించారు. ఆయనలో మంచి కామెడీ ఫ్లేవర్ ఉంది. 

ఆయనకు నాకు వేవ్ లెంగ్త్ బాగా కుదిరింది..

మారుతి గారికి నాకు వేవ్ లెంగ్త్ భయంకరంగా కుదిరేది. ఇండస్ట్రీలో ఆయన డైరెక్టర్ గా అవ్వాలనుకున్నప్పుడు ఆయన చేతిలో ఓ 5డి కెమెరా, 40 లక్షలు డబ్బు ఉందంట. ఉన్న దాంతోనే సినిమా చేసి సక్సెస్ సాధించి తనేంటో నిరూపించుకున్నాడు. ఈరోజు ఆయనతో ఏ ప్రొడ్యూసర్ అయిన సినిమా చేయడానికి రెడీ గా ఉండే పొజిషన్ లోకి వచ్చారు. అష్టాచమ్మా, అలామొదలైంది చిత్రాల తరువాత కంప్లీట్ గా డిఫరెంట్ జోనర్ లో సినిమాలు చేసాను. మారుతి గారు కూడా అంతే. ఆయన చేసే సినిమాలు రొటీన్ గా ఉండవు. భలే భలే మగాడివోయ్ సినిమాతో మారుతి గారి ఒరిజినల్ ఫ్లేవర్ ఏంటో తెలుస్తుంది. డైరెక్టర్ గా ఆయనకు ఈ సినిమాతో మంచి టర్నింగ్ పాయింట్ వస్తుంది.

లావణ్య మంచి నటి..

లావణ్య త్రిపాఠి టిపికల్ డాల్ లా కాదు. చాలా రియలిస్టిక్ గా నటిస్తుంది. తను ఒక పాత్రలో నటిస్తున్నంతసేపు నిజంగా తన క్యారెక్టర్ అంతేనేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. తనని తప్ప ఆ రోల్ లో వేరే వాళ్ళని ఊహించుకోలేం.

మాస్ మ్యూజిక్ ఇచ్చారు..

మొదటిసారి సినిమాలో పాటలు విన్నప్పుడు బావున్నాయి అనుకున్నాను. ఆడియో రిలీజ్ అయిన తరువాత సాంగ్స్ అందరికి కనెక్ట్ అయ్యాయి. గోపిసుందర్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. బెంగుళూరు డేస్ సినిమా నుంచి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ ని. ఈ సినిమా కోసం ఎనర్జిటిక్ మాస్ మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో కూడా అయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు.

కమల్ గారి సాంగ్ వినిపిస్తుంది..

ఈ సినిమాకి భలే భలే మగాడివోయ్ టైటిల్ పెట్టగానే కమల్ హాసన్ గారి మరోచరిత్ర సినిమాలోని పాటను రీమిక్స్ చేస్తున్నారేమో అనుకున్నారు. అంత మంచి క్లాసీ సాంగ్ ను రీమిక్స్ చేయడం మాకిష్టం లేదు. కాని ఆ పాట మాత్రం మూవీ లో చాలా సార్లు వినిపిస్తుంది. సినిమాలో ఎక్కువ శాతం ఫోన్ లో  డ్రామా జరుగుతుంటుంది. ఆ ఫోన్ రింగ్ టోనే భలే భలే మగాడివోయ్ పాట. 

డిఫరెంట్ జోనర్ ఎంచుకున్నా..

ఈగ సినిమా తరువాత డిఫరెంట్ పాత్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో పైసా, సోల్ సెర్చింగ్ అనే కాన్సెప్ట్ తో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు చేసాను. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేసినప్పుడే నాకు ఆ సినిమా పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు మాత్రమే రీచ్ అవుతుందని తెలుసు. నాకు అలాంటి సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం. ఆ సినిమా చూసిన వారందరూ కంగ్రాట్స్ చెప్పకుండా థాంక్స్ చెప్పేవారు. అదే కెరీర్ స్టార్టింగ్ లో అయితే చేసేవాడ్ని కాదేమో. పైసా సినిమాను ఎంత నమ్మానో భలే భలే మగాడివోయ్ ను కూడా అంతే నమ్మాను. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి సినిమా చూడాలనిపిస్తుంది. 

ఫోన్స్ పక్కన పెట్టేస్తున్నా..

1900 లో మన తాతలు ఫోన్స్, గ్యాడ్జేట్స్, ఏసిలు లేకుండా ఎలా ఉండేవారో పాపం వాళ్ళు చాలా మిస్ అయ్యారు అనుకునేవాడ్ని. ఈ జనరేషన్ వారంతా కంఫర్ట్ కు అలవాటు పడిపోయారు. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా షూటింగ్ కోసం 37 మంది హిమాలయాలకు వెళ్లాం. అక్కడ ఫ లేదు, స్నానం లేదు. బయట ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. ఆ సమయంలో మాతో పాటు షూటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పటినుండి వీలైనంత వరకు ఫోన్స్ అవి పక్కన పెట్టేస్తున్న. నాతో నేను ఉండడానికి ప్రయత్నిస్తున్నాను.

రాజమౌళి గారికి నచ్చితేనే చేస్తారు..

ఈగ సినిమా తరువాత నేను చాలా సినిమాల్లో నటించాను. కాని ఏ సినిమాకు రాజమౌళి గారు నాకు సపోర్ట్ చేయరు. నా సినిమా రిలీజ్ అయిన మొదటిరోజు ఆయన తన ఫ్యామిలీతో సినిమా చూస్తారు. అదే ఆయన నాకిచ్చే సపోర్ట్. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసి ఆయన జెన్యూన్ గా ఎగ్జైట్ అయ్యారు. అందుకే ట్విట్టర్ పోస్ట్ చేసారు. 

అక్కకి చాలా నచ్చింది..

మా అక్క అమెరికా వెళ్ళిపోతుందని ఈ సినిమా షో వేసి చూపించాను. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంది. అక్కకి పైసా సినిమా కూడా చూపించాను కాని నచ్చలేదని చెప్పేసింది. ఈ సినిమా చూసి చాలా బావుంది డెఫినిట్ గా పెద్ద హిట్ అవుతుంది. హిట్ కాకపోతే నీ సినిమాలకు నేను జడ్జిమెంట్ చెప్పనని చెప్పింది. తన రియాక్షన్ తో నాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది.

వారిద్దరూ సినిమా చూసారు..

ప్రభాస్‌గారు సినిమా చూసి చాలా ఎంజాయ్‌ చేశారు. అలాగే బన్ని కూడా ఎడిటింగ్‌ టైమ్‌లో సినిమా చూశారు. త్వరలోనే ఫస్ట్‌ కాపీ చూడబోతున్నారు. ఇద్దరికీ సినిమా బాగా నచ్చింది. అల్లు అరవింద్‌గారు సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు.

భవిష్యత్తులో ప్రొడ్యూస్ చేయొచ్చేమో..

డి ఫర్ దోపిడీ సినిమాకు నేను ప్రొడ్యూసర్ అయిన నేను ప్రొడ్యూస్ చేసిందేమీ లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకు వచ్చిన నాకు కొబ్బరికాయ కొట్టడం నుండి గుమ్మడికాయ కొట్టడం వరకు అంతా తెలుసు. కాని ప్రొడక్షన్ గురించి అసలు ఐడియా లేదు. డి ఫర్ దోపిడీ సినిమాతో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. ఫ్యూచర్ లో ప్రొడ్యూస్ చేస్తే చేస్తాను.   

జై బాలయ్య కాదు..

హిందూపూర్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నా చేతికి జై బాలయ్య అనే టాటూ చూసి అదే సినిమా టైటిల్ అని అక్కడ వారంతా అనుకున్నారు. నిజానికి సినిమా టైటిల్ అది కాదు. 

ఇక నుండి కంటిన్యూస్ గా చేస్తా..

2013లో నా సినిమాలు రిలీజ్ కాలేదు. 2014 లో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. 2014 లో రిలీజ్ అవ్వాల్సిన ఓ సినిమా 2015 లో విడుదలయ్యింది. అప్పుడు ఒక ఫార్మాట్ ఉండేది. ప్రతి ఎనిమిది నెలలకు ఓ సినిమా విడుదలవుతుంది. పెద్ద ప్రాబ్లం ఉండదనుకున్నాను. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సినిమా సినిమాకు మధ్య గ్యాప్ పెరిగిపోవడం వలన నేను అనుకున్నట్లుగా సినిమాలు చేయలేకపోయాను. ఇక నుండి అలా కాకుండా కంటిన్యూస్ గా సినిమాలు చేస్తా. ప్రస్తుతం మూడు నాలుగు కథలు డిస్కషన్స్ లో ఉన్నాయి. మంచి ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ