ఈరోజు(బుధవారం) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైకాపా ఎమెల్యే రోజా, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుల వాదోప వాదాలు చాలా ఆసక్తికరంగా జరిగాయి. తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న నాలుగు రోజులకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ ప్రెస్‌మీట్ పెట్టి సరిపుచ్చుకున్నారని, వెంటనే శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌కి హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్ళిపోయారని విమర్శించింది రోజా. దానికి స్పందించిన గంటా శ్రీమంతుడు ఒక మంచి మెసేజ్ వున్న సినిమా అనీ, అందుకే ఆ ఫంక్షన్‌కి హాజరయ్యానని, రోజా లాగ తను జబర్దస్త్ ప్రోగ్రామ్‌కి వెళ్ళలేదని ఎద్దేవా చేశారు. గంటాతోపాటు పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర రోజాకు చురకలు అంటించారు. కాంగ్రెస్ హయాంలోనే ఆయేషా మీరా హత్య జరిగిందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల బంధువులే ఆ హత్య చేశారని ఆయేషా తల్లిదండ్రులు చెప్పారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని రోజాని సూటిగా ప్రశ్నించారు.