నాని, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జి.ఎ2, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్‌పై మారుతి దర్శకత్వంలో బన్నివాసు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'భలే భలే మగాడివోయ్'. ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నివాసుతో సినీజోష్ ఇంటర్వ్యూ...
సినిమా ఎలా ఉండబోతోంది..?
సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్. ఇందులో హీరోకి మతిమరుపు ఉంటుంది. హీరోయిన్ పర్‌ఫెక్ట్ పర్సన్. తన మతిమరుపును కవర్ చేస్తూ హీరో ఎలా మెనేజ్ చేశాడనేదే మా కథ. ఒక పనిని ఎవరైనా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తే భలే చేశాడురా అంటారు. అలాగే ఈ సినిమాలో హీరో తన అనుకున్న పనిచేసే విషయంలో ఎలా సక్సెస్‌అయ్యాడో చూపిస్తున్నాం కాబట్టే ఈ టైటిల్‌ను పెట్టాం.
మారుతి గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..?
మారుతిగారు కథ చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత అవుతుందో అనే విషయాన్ని వివరంగా చెప్పారు. ఆ బడ్జెట్‌లోనే సినిమాని పూర్తి చేశాడు. నాని యాక్టింగ్, మారుతి టేకింగ్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. మారుతిగారు సినిమాని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మలిచారు.
ప్రత్యేకంగా బ్యానర్ ను స్థాపించడానికి కారణం..?
'100% లవ్, కొత్తజంట, పిల్లానువ్వులేని జీవితం' చిత్రాలకు నిర్మాతగా నా పేరే వచ్చింది. అయితే ఇండస్ట్రీలో నిర్మాతగా అల్లు అరవింద్‌గారంటే ఒక మార్కుంది. ఈ బ్యానర్‌లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్, మీడియం బడ్జెట్ మూవీస్ చేయాలనే ఆలోచనతో ఆయన్ని వెళ్లి కలిసి మాట్లాడాను. ఆ తర్వాతే జి.ఎ 2 బ్యానర్‌ను పెట్టాను. ఇతర బ్యానర్స్‌తో కూడా జి.ఎ 2 బ్యానర్ అసోసియేషన్ అవుతుంది. మా బ్యానర్‌పై సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను.
మతిమరుపు ఉన్న వ్యక్తి పాత్రలో నాని ఎలా నటించాడు..?
నానితో నాకు మంచి పరిచయం ఉంది. కథ విన్నప్పుడు నాని కనెక్ట్ అవుతాడో, కాదో అని డౌట్ ఉండేది. కానీ మారుతిగారి టేకింగ్‌కి నాని యాక్టింగ్ తోడై సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం ఉన్న హీరోలలో మంచి కామెడి టైమింగ్ ఉన్న హీరో నాని.
లావణ్య ఎలా పెర్ఫార్మ్ చేసింది..?
'అందాల రాక్షసి' సినిమాలో అందరూ లావణ్యను చూసి సీరియస్ యాక్టర్ అనుకున్నారు. కానీ తను అన్నీ రకాల పాత్రలను చేయగల మంచి పెర్‌ఫార్మర్. తన పెర్‌ఫార్మన్స్ నచ్చడంతో అల్లు శిరీష్ సినిమాలో కూడా హీరోయిన్‌గా ఓకే చేశాం.
ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు..?
కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో మేము డైరెక్ట్ రిలీజ్ చేయడం లేదు. మిగతా అన్నీచోట్ల మేమే రిలీజ్ చేస్తున్నాం. నైజాంతోకలిపి దాదాపు 670 థియేటర్స్‌లో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
ఇండస్ట్రీలో వారవరైనా సినిమా చూసారా..?
ప్రభాస్‌గారు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశారు. అలాగే బన్ని కూడా ఎడిటింగ్ టైమ్‌లో సినిమా చూశారు. త్వరలోనే ఫస్ట్ కాపీ చూడబోతున్నారు. ఇద్దరికీ సినిమా బాగా నచ్చింది. అల్లు అరవింద్‌గారు సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. నెక్స్‌ట్ మూవీ కూడా నానితోనే చేయమని సలహా ఇచ్చారు.
ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..?
గోపి ఈ సినిమాకి కమర్షియల్ మ్యూజిక్ అందించాడు. అల్రెడి ఆడియో పెద్ద సక్సెస్ అయింది. ఎఫ్.ఎమ్ లలో మా సినిమా సాంగ్స్ ఎక్కువగా ప్లే అవుతున్నాయి, ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్...?
రాజ్ తరుణ్ హీరోగా మున్నా దర్శకత్వంలో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాం. ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్‌లో స్టార్ట్ అవుతుంది. అలాగే ఈటీవీ ప్రభాకర్‌గారి దర్శకత్వంలో ఓ సినిమాని చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.