Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-దేవాకట్ట(డైనమైట్)

Tue 01st Sep 2015 06:32 AM
dynamite,devakatta,mamchu vishnu,praneetha  సినీజోష్ ఇంటర్వ్యూ-దేవాకట్ట(డైనమైట్)
సినీజోష్ ఇంటర్వ్యూ-దేవాకట్ట(డైనమైట్)
Advertisement
Ads by CJ

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అరియానా, వివియానా సమర్పణలో దేవాకట్టా దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా 'డైన‌మైట్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు దేవాకట్టతో సినీజోష్ ఇంటర్వ్యూ..

చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తా.. 

నేను సినిమాలు చాలా ఫాస్ట్ గా తీస్తుంటాను. 'వెన్నెల' 60 రోజుల్లో  చేసాన., 'ప్రస్థానం' 65 రోజుల్లో ఫినిష్ అయ్యింది. "ఆటోనగర్ సూర్య" పరిస్థితి వేరే అనుకోండి.  'డైనమైట్' కూడా 56 రోజుల్లో పూర్తి చేసాం. నా ప్రతి సినిమాను విడుదల చేయాలనుకొన్న రెండుమూడు నెలల తర్వాతే థియేటర్లలో విడుదలవ్వగలిగింది. 'డైనమైట్' సినిమా రిలీజ్ లేట్ కావడానికి కారణం "బాహుబలి, శ్రీమంతుడు" చిత్రాలు విడుదలవ్వడమే. మంచి గ్యాప్ చూసుకొని సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. 

మంచి యాక్షన్ ఫిలిం... 

"డైనమైట్" సినిమా ఏ జోనర్ అని అందరూ అడుగుతుంటారు. ఇది యాక్షన్ తో కూడిన హైటెన్షన్ ఫిలిం. ట్విస్ట్ రివీల్ అయ్యిన దగ్గర్నుంచీ.. ప్రేక్షకుడు సీట్ చివర కూర్చొని.. తరువాతి సన్నివేశంలో ఏం జరుగుతుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తుంటాడు. ఇంగ్లీష్ లో వచ్చిన "ఎనిమి ఆఫ్ ది స్టేట్, మిషన్ ఇంపాజబుల్" వంటి సినిమాలు చూస్తున్న ప్రేక్షకుడు ఏ విధమైన అనుభూతిని పొందుతాడో, మా "డైనమైట్" చూసిన ప్రేక్షకులకూ అదే విధమైన అనుభూతిని కలింగించాలన్నది నా ప్రయత్నం. 

ఆ సినిమా కాన్సెప్ట్ మాత్రమే తీసుకున్నా.. 

"డైనమైట్" సినిమా తమిళ చిత్రం "అరిమ నంబి"కి రీమేక్ అయినప్పటికీ.. "సేమ్ టు సేమ్" అని ఎక్కడా అనిపించదు. ఆ సినిమా నుంచి కేవలం కాన్సెప్ట్ ను మాత్రమే ఓన్ చేసుకొని "డైనమైట్" చిత్రాన్ని తెరకెక్కించాను. కథ సిద్ధం చేసుకొనేప్పుడు మంచు విష్ణు నాకు ఇచ్చిన ఫ్రీడం అలాంటిది. ఎప్పుడూ నన్ను కంగారు పెట్టలేదు. 

క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది... 

నేను ఏ కథను సిద్ధం చేసుకొన్నా ఆ కథకు కనెక్ట్ కాలేకపోతే ఆ సినిమాను చేయలేను. అయితే ఈ సినిమా  కథ నాది కాకపోయినా.. ఆ కథలో హీరో క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. అందుకే "అరిమ నంబి" సినిమాను రీమేక్ చేయడానికి ఒప్పుకొన్నాను. ముఖ్యంగా ఈ సినిమాలోని కథాంశం ప్రెజంట్ జనరేషన్ యూత్ కు బాగా అలవాటైన సోషల్ నెట్వర్కింగ్ మరియు కాంటెంపరరీ ఇష్యుస్ పై ఉంటుంది. 

ట్రెండీ లుక్ తో అదరగొడతాడు.. 

మంచు విష్ణు "డైనమైట్" సినిమాలో శివాజీ కృష్ణ అనే నవతరం యువకుడి పాత్రలో కనిపిస్తాడు. 10 టు 6 జాబ్ చేసుకొని, సాయంత్రం కాసేపు అలా బయట తిరిగి ఇంటికి చేరుకోవడం అతని దినచర్య. అనుకోకుండా కలిసిన హీరోయిన్ ను ఇష్టపడ్డ కృష్ణ, ఆ తర్వాత ఆమెకు వచ్చిన సమస్యను తన సమస్యలా భావించి, ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఆ సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటి?, ఈమధ్యలో హీరోయిన్ ప్రేమను ఎలా గెలుచుకొన్నాడు? అనేది క్లుప్తంగా "డైనమైట్" కథ. అనామిక పాత్రలో ప్రణీత కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొంటుంది. ఇక విష్ణు అయితే ఈ సినిమాలో ఒక చేతిపై టాటూతో, చెవిపోగుతో, రఫ్ బియర్డ్ తో ట్రెండీ లుక్ తో అదరగొడతాడు. విజయ్ మాస్టర్ నేతృత్వంలో రూపొందిన యాక్షన్ ఎపిసోడ్స్ లో విష్ణు, ప్రణీత డూప్స్ లేకుండా పెర్ఫార్మ్ చేసారు. 

దాని కంటే బెటర్ గా.. 

"డైనమైట్" మాతృక "అరిమ నంది"లో నాకు చాలా ల్యాగ్స్ కనిపించాయి. అయితే తమిళ నేటివిటీకి అవి సరిపోతాయి. కానీ మన తెలుగు ప్రేక్షకులకు ఇంకా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో "డైనమైట్" చిత్రాన్ని అందిస్తున్నాను. నావరకు తమిళ వెర్షన్ కంటే బెటర్ అవుట్ పుట్ ను ఇస్తున్నాననుకొంటున్నాను. 

అవన్నీ అసత్య ప్రచారాలు... 

"ఆటోనగర్ సూర్య" విడుదల సమయంలో "దర్శకుడి కారణంగానే బడ్జెట్ 25 కోట్ల రూపాయలు దాటింది" అంటూ కొన్ని అసత్య ప్రచారాలు జరిగాయి. మా ప్రొడ్యూసర్స్ కూడా ఒక మీడియా సమావేశంలో "మా సినిమాకి 25 కోట్లు బడ్జెట్ అయ్యింది" అని చెప్పడం నాకు నచ్చలేదు. నిజానికి "ఆటోనగర్ సూర్య" సినిమాని 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాను. నా దృష్టిలో "ఆటోనగర్ సూర్య" సినిమా "వెల్ రిటన్ స్క్రిప్ట్ అండ్ బ్యాడ్లీ ఎగ్జిక్యూటెడ్ ఫిలిం". 

ఇప్పటివరకూ ఎప్పుడూ బాధపడలేదు.. 

నా ప్రతి సినిమాకి మధ్యలో చాలా గ్యాప్ వస్తుంటుంది. ఆ సమయంలో కొత్త కథలు రాసుకొంటుంటాను. అయితే, నా వైఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ నాకు ఫైనాన్సియల్ గా సపోర్ట్ చేస్తుండడం వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇన్నాళ్ళ కెరీర్ లో ఎప్పుడినా అసంతృప్తి కలిగిందా అని ప్రశ్నిస్తే "లేదు" అని నిక్కచ్చిగా చెబుతాను. సినిమా పట్ల నాకున్న ప్యాషన్ తోనే ఇటు వచ్చాను. 

స్పెషల్ గా థాంక్స్ కార్డు వేసారు... 

"బాహుబలి" సినిమాలో టైటిల్స్ లో "థాంక్స్" కార్డ్ కింద నా పేరు చూసినవాళ్లందరూ ఆ సినిమాకి నేను చాలా డైలాగ్స్ రాసానని అనుకొంటున్నారు. నిజానికి "బాహుబలి" సినిమాలో వార్ సీక్వెన్స్ కు ముందు ప్రభాస్ మాట్లాడే వెర్షన్ ను మాత్రమే నేను రాశాను. నా "ఆటోనగర్ సూర్య"  డైలాగ్ టీజర్ ను విన్న రాజమౌళి గారు నాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. అయితే, సినిమాలో నాకు స్పెషల్ గా  "థ్యాంక్స్" కార్డ్ వేయడం అన్నది రాజమౌళి గారి సంస్కారం. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్... 

"డైనమైట్" తర్వాత నా తదుపరి సినిమా ఏంటి అన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కొన్ని ఆఫర్లు ఉన్నాయి. అయితే, "డైనమైట్" సినిమా సక్సెస్ ను బట్టి అవి ఫిక్సవుతాయి. కాకపోతే, ఓ నాలుగు కథలు సిద్ధం చేసుకొన్నాను. నాలుగూ డిఫరెంట్ జోనర్ ఫిలింస్ అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ